ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా కెప్టెన్‌లు రిటైన్ చేసుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.
ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశముండగా.. పంజాబ్ కింగ్స్ సారథిగా శ్రేయస్ అయ్యర్ ఎంపిక కావడం దాదాపు ఖారారైంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
కానీ కేకేఆర్, ఆర్సీబీ పరిస్థితులు వేరు. తొలుత ఆర్సీబీ రాహుల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని అంత భావించారు. మరోవైపు కేకేఆర్ రిషబ్ పంత్‌పై కన్నేసిందని వార్తలు వినిపించాయి. కానీ వేలంలో ఈ రెండూ జరగలేదు. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీల కెప్టెన్లగా ఎవరు ఎంపిక అవుతారని అభిమానుల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కేకేఆర్ కెప్టెన్‌గా రహానే..!
అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వెటరన్ అజింక్య రహానే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు పగ్గాలను రహానే అప్పగించాలని కేకేఆర్ మేనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వేలంలో ఆఖరి నిమిషంలో అజింక్య రహానేను కోల్‌కతా కొనుగోలు చేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
తొలి రోజు వేలంలోకి వచ్చిన రహానేను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ రెండో రోజు వేలంలో ఆఖరి రౌండ్‌లో కనీస ధర రూ.1.75 కోట్లకు నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. కాగా కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.
వీరిద్దరూ గత కొన్ని సీజన్లగా కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటకి కేకేఆర్ ఫ్రాంచైజీ మాత్రం రహానే వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి తిరిగి కేకేఆర్ సొంతం చేసుకుంది.
దీంతో అతడికే కేకేఆర్ తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అతడి కెప్టెన్‌గా అనువభవం లేనుందన కేవలం ఆల్‌రౌండర్‌గానే కొనసాగనున్నట్లు సమాచారం. కాగా రహానే గతంలో కేకేఆర్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment