ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.
ఆఖరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు.
కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్-2021 సీజన్‌లో కేకేఆర్ తరపునే అరంగేట్రం చేశాడు. తొలుత అతడిని రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది.
ఆ తర్వాత రెండు సీజన్ల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్-2025 వేలంలోకి కేకేఆర్ విడిచిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి,
Comments
Please login to add a commentAdd a comment