IPL 2022: Rajasthan Royals Swagat to Yuzvendra Chahal Hum He Karenge Joh Karna Hai - Sakshi
Sakshi News home page

IPL 2022 -Rajasthan Royals: క్వారంటైన్‌ పూర్తి కానివ్వండి.. అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం: చహల్‌

Published Tue, Mar 15 2022 2:01 PM | Last Updated on Tue, Mar 15 2022 3:41 PM

Rajasthan Royals Swagat To Yuzvendra Chahal Hum He Karenge Joh Karna Hai - Sakshi

IPL 2022- Rajasthan Royals Swagat: ఐపీఎల్‌-2022 కోసం రాజస్తాన్‌ రాయల్స్‌ సంసిద్దమవుతోంది. క్యాష్‌ రిచ్‌లీగ్‌లో భాగంగా నాగపూర్‌లో తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుందీ ఈ జట్టు. పుణె వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మార్చి 29న రాజస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు జట్టుతో చేరారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సహా యజువేంద్ర చహల్‌ తదితరులు రాయల్స్‌ క్యాంపునకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.

ఇదిలా ఉండగా.. ఫ్రాంచైజీ డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర సహా ఆటగాళ్లకు రాజస్తాన్‌ వినూత్న రీతిలో స్వాగతం పలికింది. ఈ క్రమంలో చహల్‌, అతడి భార్య ధనశ్రీకి సంబంధించిన ఫొటోను షేర్‌ చేసిన రాజస్తాన్‌.. ‘‘మరి.. మా స్వాగతం ఎలా ఉంది చహల్‌’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. 

ఇందుకు స్పందించిన చహల్‌.. ‘‘మూడు రోజుల క్వారంటైన్‌ పూర్తి కానివ్వండి. అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం’’ అంటూ మీ స్వాగతసత్కారాలతో హృదయం ప్రేమతో నిండిపోయిందంటూ హార్ట్‌ ఎమోజీలు జతచేశాడు. కాగా బెంగళూరు ఫ్రాంఛైజీ వదిలేయడంతో ఐపీఎల్‌-2022 మెగా వేలంలోకి వచ్చిన చహల్‌ను రాజస్తాన్‌ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  

చదవండి: IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ దూరం! అయితే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement