కొహ్లీతో కుమార సంగక్కర (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : పరుగుల మెషీన్‌గా మారిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర ఆసక్తికర ట్వీట్ చేశారు. 2017 కేలండర్ ఇయర్‌లో 2,818 పరుగులు సాధించినా... శ్రీలంక మాజీ కెప్టెన్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడంటూ బీబీసీ రిపోర్టర్ ట్వీట్ చేశారు.
ఇందుకు స్పందించిన సంగక్కర.. తన రికార్డు ఎప్పటికీ అలానే ఉండిపోదని అన్నారు. 2018లో కొహ్లీనే దాన్ని బద్దలు కొడతాడని, 2019లో మరోసారి ఆ రికార్డును తిరగరాస్తాడని చెప్పారు. భవిష్యత్‌లో అత్యున్నత శిఖరాలకు కొహ్లీ చేరుకుంటాడని తాను బెట్ కడతానని అన్నారు.
కొహ్లీ బ్యాటింగ్ శైలి విభన్నమైనదని కితాబిచ్చారు. కాగా, శ్రీలంకతో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మూడో టెస్టులో కొహ్లీ 243(287) పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
I don’t think that will last long the way @imVkohli is batting. He will probably overtake it next year and then do it again the year after. He is a different class.
— Kumar Sangakkara (@KumarSanga2) December 6, 2017
Comments
Please login to add a commentAdd a comment