
'మా ఆయన వంట కూడా బాగా చేస్తాడు'
గాలే: శ్రీలంక క్రికెటర్ కూమార సంగక్కర భార్య యెహాలి కొన్ని ఆసక్తికర విషయాలను స్థానిక మీడియాతో పంచుకున్నారు. తన భర్త సంగక్కర మంచి క్రికెటరే కాదు మంచి భర్త, ఉత్తమ తండ్రి అని ఆమె అన్నారు. ఆయన ఎక్కడుంటే నేనూ అక్కడే ఉంటాను.. ఆయన ఎక్కడికి వెళ్లిన తోడుగా వెళ్తుంటాను అని చెప్పారు. సంగకు కుటుంబం అంటే చాలా ఇష్టమని, చాలా ముఖ్యమని నా అభిప్రాయమని అన్నారు. ప్రతి విషయాన్ని చాలా సాధారణంగా తీసుకుంటారని, త్వరగా ఏ విషయం నుంచైనా బయటపడతారని వివరించారు.
తన భర్త సంగ క్రికెట్ బాగా ఆడటంతో పాటు వంట కూడా చేస్తాడని, పాస్తా చాలా బాగా వండుతాడని యెహాలి తెలిపింది. గాలే టెస్టులో తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో సంగ చాలా భాదపడ్డాడని పేర్కొంది. తక్కువ స్కోరుకు పరిమితమైనప్పుడల్లా ఆయన దిగులు చెందుతాడని చెప్పింది. టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక మరో రెండు లేదా మూడేళ్లు దేశవాలీ క్రికెట్ కొనసాగిస్తాడని వివరించింది.
శ్రీలంక జట్టులో నిలకడ ఉన్న ఆటగాడు తన భర్త అని చెప్పింది. గతంలో జరిగిన లాహోర్ దాడి తనకు ఎప్పుడు గుర్తుంటుందని, సంగ కెరీర్ లో ఎన్నో అత్యుత్తమ సంఘటనలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా జట్టుతో 2006లో కొలంబోలోఆడుతున్నప్పుడు మహేళ జయవర్దనేతో కలిసి సంగ చేసిన 624 పరుగుల భాగస్వామ్యం తాను ఎప్పుడు మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. ప్రతిక్షణం జట్టుకోసం తాపత్రయపడేవాడని, తన సెంచరీలను తాను బాగా ఎంజాయ్ చేస్తానని అతని కెరీర్ గురించి ఈ విషయాలను ఆమె పంచుకున్నారు.