
రాజస్తాన్‌పై ఆర్సీబీ ఘన విజయం (PC: IPL)
IPL 2023 RR vs RCB- Wayne Parnell: ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించింది. సంజూ శాంసన్ సేనను 59 పరుగులకే కట్టడి చేసి 112 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతమైదానంలో రాజస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి మరోసారి ఆ జట్టుపై ఆధిపత్యాన్ని చాటుకుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
కోహ్లి విఫలమైనా
జైపూర్ వేదికగా ఆదివారం (మే 14) జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విరాట్ కోహ్లి 18 పరుగులకు పరిమితం కావడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు.
అర్ధ శతకాలతో రాణించి
అయితే, ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్(55 పరుగులు)తో జట్టును ఆదుకోగా... వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అతడికి సహకారం అందించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 54 పరుగులు సాధించాడు.
మహిపాల్ లామ్రోర్(1), దినేశ్ కార్తిక్ (0) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో అనూజ్ రావత్ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లోనే 29 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది.
ఆరంభంలోనే కోలుకోలేని షాకులు
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ను ఆరంభంలోనే షాకిచ్చాడు ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్. గత మ్యాచ్ హీరో యశస్వి జైశ్వాల్‌ను డకౌట్ చేశాడు. సిరాజ్ ఆర్సీబీ వికెట్ల ఖాతా తెరవగా.. మరో ఫాస్ట్‌బౌలర్ వేన్ పార్నెల్ జోష్‌ను కొనసాగించాడు. జోస్ బట్లర్‌ను డకౌట్ చేసిన అతడు.. సంజూ శాంసన్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.
ఈ క్రమంలో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే రాజస్తాన్ 3 వికెట్లు కోల్పోయింది. ఇక బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ కూడా విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
చెత్త రికార్డు.. మూడోసారి
తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడోసారి అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. కాగా 2017లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 49(కోల్‌కతాలో), 2009లో ఆర్సీబీ చేతిలో 58 పరుగుల తేడా(కేప్‌టౌన్)తో రాజస్తాన్ చిత్తైంది. తాజాగా జైపూర్ మ్యాచ్‌లో 59 పరుగులకే కథ ముగించింది.
ఆర్సీబీ బౌలర్లు అదుర్స్
ఇక రాజస్తాన్ తర్వాత అత్యల్ప స్కోరుకు అవుటైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతోంది. 2017లో ఢిల్లీలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 66 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా రాజస్తాన్‌తో తాజా మ్యాచ్‌లో 3 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 10 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసిన వేన్ పార్నెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీ మిగతా బౌలర్లలో సిరాజ్, మాక్సీ ఒక్కో వికెట్ తీయగా.. బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు.
చదవండి: సీఎస్‌కేను ఓడించే సత్తా ఆ ఒక్క జట్టుకే ఉంది: ఆకాష్ చోప్రా
సెంచరీ చేసినా.. స్కోరు జీరో అయినా భయ్యా అంతే! ఆరోజు బాగా ఏడ్చేశాను..
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
— IndianPremierLeague (@IPL) May 14, 2023
The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥
Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP