IPL 2022 RCB Vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి తర్వాత రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సంజూ శాంసన్ సేనతో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. కాగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 68 పరుగులకే ఆలౌట్ అయి పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు.. జోస్ బట్లర్ వరుస సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉండటం రాజస్తాన్‌కు కలిసి వచ్చే అంశంగా పరిణమించింది. కెప్టెన్ సంజూ శాంసన్ సైతం అద్భుత ఆట తీరు కనబరుస్తున్నాడు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్ల విజృంభణతో ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్తాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఏప్రిల్ 22 నాటి ఈ మ్యాచ్‌లో సంజూ బృందం 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ, ఆర్‌ఆర్ జట్ల పోరు ఆసక్తికరంగా మారింది. మరి ఇరు జట్ల ముఖాముఖి రికార్డులు, తుది జట్టు అంచనా, పిచ్ వాతావరణం తదితర అంశాలను పరిశీలిద్దాం.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఐపీఎల్‌లో బెంగళూరు, రాజస్తాన్ ఇప్పటి వరకు 26 సందర్భాల్లో తలపడ్డాయి. బెంగళూరు 13 మ్యాచ్‌లు గెలవగా.. రాజస్తాన్ 10 విజయాలు తన ఖాతాలో వేసుకుంది.
ఇక రాజస్తాన్‌తో ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో ఆర్సీబీదే పైచేయి. వరుసగా 4 వికెట్లు, 7 వికెట్లు, 10 వికెట్లు, 7 వికెట్లు, 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై బెంగళూరు విజయం సాధించింది.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
ఐపీఎల్ మ్యాచ్- 39: బెంగళూరు వర్సెస్ రాజస్తాన్- ఏప్రిల్ 26(మంగళవారం)
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ఎంసీఏ)- పుణె
పిచ్
►పుణెలోని ఎంసీఏ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్. బంతి పాతబడే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.
►ఈ వేదికపై జరిగిన మొత్తం టీ20 మ్యాచ్‌లు: 44
►తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు సాధించిన విజయాలు: 21
►లక్ష్య ఛేదనకు దిగిన జట్లు గెలిచిన సందర్భాలు: 23
►ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు: 211/4 (రాజస్తాన్ రాయల్స్-2018)
►అత్యల్ప స్కోరు: 73/10 (కింగ్స్ ఎలెవన్ పంజాబ్-2017)
తుది జట్ల అంచనా:
ఆర్సీబీ- ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్/మహిపాల్ లామ్రోర్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తిక్, సూయశ్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వనిందు హసరంగ, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్తాన్- జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్(కెప్టెన్), షిమ్రన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్, యజువేంద్ర చహల్.
Faf du Plessis, Mike Hesson and Sridharan Sriram talk about our preparedness, the opposition, the mood in the camp and much more ahead of the #RCBvRR match in Pune at 7:30 PM IST today.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/KrzjqUUyFL
— Royal Challengers Bangalore (@RCBTweets) April 26, 2022
Elegant shots, a sturdy mind, an infectious smile - our Starboy has it all. 💗#RoyalsFamily | #दिलसेरॉयल | #RCBvRR | @devdpd07 pic.twitter.com/LDoOx5pQK1
— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2022
చదవండి👉🏾Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య
Comments
Please login to add a commentAdd a comment