ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించిన ఆర్సీబీ (PC: IPL)
IPL 2023- RCB Knocked Out: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. పదిహేనేళ్లుగా కళ్లు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను నిరాశపరుస్తూ ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో తప్పక గెలవాల్సి ఆదివారం నాటి మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించినా.. శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని చూసి అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. చాంపియన్‌గా నిలుస్తారని ఆశపడితే టాప్-4కి కూడా చేరకపోవడంతో ఆర్సీబీపై విమర్శలు కూడా వచ్చాయి.
మాది అత్యుత్తమ జట్టు కాదు
ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమణ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్‌ను ఇక్కడితోనే ముగించడం పట్ల బాధగా ఉంది. తీవ్ర నిరాశకు లోనయ్యాను.
ఆ అర్హత మాకు లేదు
నిజాయితీగా చెప్పాలంటే.. మా ప్రదర్శనను పరిశీలిస్తే మేము అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలవడానికి అర్హులం కాదు. కాకపోతే మాకంటూ కొన్ని గొప్ప విజయాలు ఉండటం నిజంగా మా అదృష్టం. కానీ జట్టుగా మా ప్రదర్శన చూస్తే సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అర్హత మాత్రం మాకు లేదు’’ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. తమ వైఫల్యాల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ డుప్లెపిస్ మాట్లాడిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది.
ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణించినా
కాగా గతేడాది విరాట్ కోహ్లి నుంచి ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్.. బ్యాటర్‌గా, సారథిగా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2022లో 468 పరుగులు సాధించాడు. అదే విధంగా జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు.
ఇక ఈసారి ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించి 730 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. మరోవైపు.. కోహ్లి సైతం బ్యాట్ ఝులిపించి 639 పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు ఉండటం విశేషం. కానీ.. ఆర్సీబీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో డుప్లెసిస్‌కు, అతడి బృందానికి నిరాశ తప్పలేదు.
చదవండి: నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్‌మన్ సోదరికి అండగా..
IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్
RCB v GT Game Day Review
— Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2023
Captain Faf, players and the coaches reflect on the #IPL2023 season and send in their gratitude and regards to the 12th Man Army, after match that brought an end to our campaign this year.#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/8Vst2kRZLV
Comments
Please login to add a commentAdd a comment