లక్నోతో ఆర్సీబీ పోరు (PC: IPL/BCCI)
IPL 2023 RCB Vs LSG: ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. సొంతమైదానంలో రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌తో తలపడింది.
చిన్నస్వామి స్టేడియంలో ముంబైపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది. అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్సీబీ 81 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్లు విరాట్ కోహ్లి(ముంబైపై 49 బంతుల్లో 82 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (ముంబైపై 43 బంతుల్లో 73 పరుగులు) కోల్‌కతాలో విఫలమయ్యారు.
వీరితో పాటు డేవిడ్ విల్లే (20 పరుగులు) మాత్రమే ఇరవై పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. మరోవైపు.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్.. రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది.
ఆర్సీబీతో లక్నో ఢీ
అయితే, సొంతమైదానంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి గెలుపు బాటపట్టింది. ఈ నేపథ్యంలో రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో, రెండింట ఒక విజయంతో ఏడో స్థానంలో ఉన్న ఆర్సీబీ సోమవారం బెంగళూరు వేదికగా తలపడనున్నాయి.
రెండుసార్లు ఆర్సీబీదే పైచేయి
కాగా బెంగళూరు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి వర్ష సూచనైతే లేదు. అదే విధంగా బ్యాటర్లకు అనుకూలించే చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌లో కూడా మెరుగైన స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ- లక్నో రెండుసార్లు ముఖాముఖి తలపడగా.. రెండుసార్లు బెంగళూరు జట్టే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీకి ప్రొటిస్ ఆల్‌రౌండర్ వేన్ పార్నెల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.
మరోవైపు.. ఫిట్‌నెస్ సమస్యలతో గత మ్యాచ్‌కు దూరమైన లక్నో బౌలర్ మార్క్ వుడ్ ఆర్సీబీతో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆవేశ్ ఖాన్ సైతం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఆర్సీబీ వర్సెస్ లక్నో తుది జట్ల అంచనా:
ఆర్సీబీ
ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, అనూజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.
లక్నో
కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్/క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, గౌతమ్/అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్/జయదేవ్ ఉనాద్కట్, మార్క్ వుడ్, రవి బిష్ణోయి.
ప్రత్యక్ష ప్రసారం:
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్.
చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్?
IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు!
Comments
Please login to add a commentAdd a comment