ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఈ సీజన్‌లోనైనా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించిన అభిమానులకు.. ఆర్సీబీ మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఏడింటిలో గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టులో ప్రక్షాళనకు ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. . ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలంలో పక్కా ప్రణాళికలతో రావాలని ఆర్సీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన దినేష్ కార్తీక్‌కు ఆర్సీబీ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్-16వ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన డికే..11.67 సగటుతో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ధానంలో మరో యువ వికెట్ కీపర్‌ను తీసుకోవాలని బెంగళూరు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు విదేశీ ఆటగాళ్లు వనిందూ హసరంగా, జోష్ హాజిల్ వుడ్, ఫిన్ అలెన్‌ను కూడా విడిచిపెట్టాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో హసరంగాను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
ఆ సీజన్‌లో పర్వాలేదనపించినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మరోవైపు జోష్ హజెల్‌వుడ్‌ను 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి ఫిట్‌నెస్ దృష్ట్యా వచ్చే సీజన్‌కు ముందు సాగనింపాలని ఆర్సీబీ భావిస్తోంది.
చదవండి: గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment