ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ వీడనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే.
హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై ఇండియన్స్ కట్టబెట్టింది. దీంతో అప్పటినుంచి తన జట్టు యాజమాన్యంపై హిట్‌మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది.
అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముంబై జట్టుతో ఇదే నా చివరి సీజన్ అని హిట్‌మ్యాన్ అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ క్రమంలోనే ముంబైని వీడి ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలంలో రోహిత్ భాగం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్‌పై వేటు వేసి రోహిత్ శర్మ తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
తాజా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌ను అభిమానులు ప్రశ్నించారు. డీకే ఇటీవలే క్రిక్‌బజ్ చిట్‌చాట్‌లో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడా అని ఓ అభిమాని డీకేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా కార్తీక్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ సైలెంట్‌గా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
What changes should #India make ahead of #ChampionsTrophy? 🤔
Why did #Rohit & Co. struggle against spinners❓#LaapataaLadies to #Maharaja: A special binge-watch list for cricketers! 🎦@DineshKarthik talks about it all, only on #heyCB, here ⬇️ pic.twitter.com/e6Q2ipzZei— Cricbuzz (@cricbuzz) August 11, 2024
Comments
Please login to add a commentAdd a comment