PC:IPL.com
ఐపీఎల్-2023 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా ఆరంభించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధిచింది. 172 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి కేవలం 16.2 ఓవర్లలోనే ఆర్సీబీ ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(82 నాటౌట్), కెప్టెన్ డుప్లెసిస్(73) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.
కార్తీక్, సిరాజ్ ఢీ.. ఈజీ క్యాచ్ డ్రాప్
కాగా ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఒకరినొకరు ఢీకొని.. రోహిత్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశారు. ముంబై ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో సిరాజ్ వేసిన ఐదో బంతికి రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని 30 యార్డ్ సర్కిల్లో గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ కార్తీక్ కాల్ ఇచ్చి బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే సిరాజ్ కార్తీక్ ఇచ్చిన సిగ్నిల్‌ను చూడకుండా క్యాచ్‌ను పట్టేందుకు వికెట్ కీపర్ వైపు వచ్చాడు. ఈ క్రమంలో కార్తీక్‌ను సిరాజ్ బలంగా ఢీకొనున్నాడు.
దీంతో క్యాచ్ నేలపాలు అయింది. అయితే వీరిద్దరూ ఒకరినొకరు బలంగా ఢీకొనడంతో కాసేపు మైదానంలో నొప్పితో విలవిల్లాడారు. అనంతరం ఫిజియో వచ్చి చికిత్స అందించగా వీరిద్దరూ ఎవరు స్థానాలకు వారు వెళ్లారు. కాగా వాస్తవానికి అది కార్తీక్ అందుకోవాల్సిన క్యాచ్.
కానీ సిరాజ్ మాత్రం ఎటువంటి కాల్ ఇవ్వకుండా క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేసి క్యాచ్ డ్రాప్ అవ్వడానికి కారణమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తరువాతి ఓవర్ మొదటి బంతికే రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది.
చదవండి: IPL 2023 RCB Vs MI: వారెవ్వా తిలక్.. ధోనిని గుర్తు చేస్తూ హెలికాప్టర్ షాట్! వీడియో వైరల్
— Main Dheet Hoon (@MainDheetHoon69) April 2, 2023
Comments
Please login to add a commentAdd a comment