Virat Kohli And RCB Teammates Visit Mohammed Siraj House In Hyderabad, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: సిరాజ్‌ కొత్త ఇంట్లో సందడి చేసిన ఆర్సీబీ ఆటగాళ్లు.. వీడియో వైరల్‌

Published Tue, May 16 2023 12:35 PM | Last Updated on Tue, May 16 2023 12:54 PM

Kohli and his RCB teammates visit Mohammed Sirajs house in Hyderabad - Sakshi

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో  కీలక పోరుకు రాయల్‌ ఛాలెంజెర్స్‌ బెంగళూరు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా మే18న ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేనుకున్న డుప్లెసిస్‌ సేన.. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కొత్త ఇంట్లో సందడి చేశారు.

సిరాజ్‌ ఇటీవలే ఫిల్మ్ న‌గ‌ర్‌లో కొత్త ఇంటిని నిర్మించాడు. తన నూతన గృహ ప్రవేశానికి విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ డుప్లెసిస్‌తో పాటు సహచర ఆటగాళ్లను సిరాజ్ అహ్హనించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లు సిరాజ్‌ కొత్త ఇంటిని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో విరాట్‌ కోహ్లితో పాటు డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు కన్పిస్తున్నారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే ఛాన్స్‌ ఉంది.
చదవండినువ్వేం తింటావు? గుజరాత్‌లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: షమీ వ్యాఖ్యలు వైరల్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement