Do You Only Know How To Bowl Bouncers?: When Mohammed Siraj Faced KL Rahuls Anger In RCB Nets - Sakshi
Sakshi News home page

Mohammed Siraj: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్‌ సీరియస్‌ అయ్యాడు

Published Wed, May 17 2023 1:14 PM | Last Updated on Wed, May 17 2023 1:39 PM

When Mohammed Siraj Faced KL Rahuls Anger In RCB Nets - Sakshi

టీ20లు, 24 టీ20లు,18 టెస్టులు ఆడిన సిరాజ్‌ ఓవరాల్‌గా 101 వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2023లో బీజీబీజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్‌.. ఇక్కడ కూడా దుమ్మురేపుతున్నాడు. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ తరపున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా సిరాజ్‌(12) నిలిచాడు. ఇక ఈ స్థాయికి చేరుకోవడంలో మహ్మద్‌ సిరాజ్‌ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు.

తాజాగా గౌరవ్ కపూర్ చాట్ షో “బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్”లో సిరాజ్‌ తన సహచర ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. నెట్స్‌లో తను బౌలింగ్‌ చేస్తుండగా రాహుల్‌ సీరియస్‌ అయ్యాడని సిరాజ్‌ తెలిపాడు. కాగా ఐపీఎల్‌ అరంగేట్రంకు ముందు బెంగళూరు నెట్‌బౌల్‌గా సిరాజ్‌ పనిచేశాడు.

"నేను 2015లో అండర్‌-23 జట్టులో తొలిసారి ఆడాను. అదే ఏడాదిలో ఫస్ట్‌కాస్ల్‌ అరంగేట్రం కూడా చేశాను. 2015-16 రంజీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీసుకున్నాను. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్‌లను నన్ను జట్టు నుంచి తొలిగించారు. ఆ తర్వాత ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఉప్పల్‌ వేదికగా ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌కు ముందు నేను ఆర్సీబీ నెట్‌బౌలర్‌గా పనిచేశాను. నెట్స్‌లో రాహుల్‌కు బౌలింగ్ చేసే క్రమంలో వరుసగా బౌన్సర్లను సంధించాను. దీంతో విసుగు చెందిన రాహుల్‌ నాదగ్గరకు వచ్చి నీకు కేవలం బౌన్సర్లు మాత్రమే వేయడం వచ్చా అని సీరియస్‌ అయ్యాడు. అందుకు బదులుగా లేదు భయ్యా నాకు ఇతర డెలివరీలు కూడా వేయగలను సమాధానమిచ్చాను" అని “బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్”లో సిరాజ్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఇదేమి చెత్త బౌలింగ్‌రా బాబు.. 12 ఓవర్లలో 132 రన్స్‌! ఇంతకుమించి ఎవరూ దొరకలేదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement