IPL 2023: Fans troll LSG's KL Rahul for 'Another Faliure' - Sakshi
Sakshi News home page

IPL 2023: ఏంటి రాహుల్‌ భయ్యా ఇది..? ఓహో టెస్లుల్లా ఆడుతున్నందుకేనా.. 17 కోట్లు!

Published Tue, Apr 11 2023 10:50 AM | Last Updated on Tue, Apr 11 2023 11:23 AM

Fans Troll KL Rahul for  Another Faliure In IPL 2023 - Sakshi

ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహల్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ తన ఆటతీరుతో చిరాకు తెప్పించాడు.

213 భారీ లక్ష్య ఛేదనలో రాహుల్‌ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రాహుల్‌ ఆడిన 18 బంతుల్లో కేవలం ఒకే బౌండరీ ఉండడం గమనార్హం. 

ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన 61 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన 35 పరుగులే అతడి అత్యధిక స్కోర్‌గా ఉంది. ఆ 35 పరుగులు కూడా 31 బంతుల్లో చేశాడు. ఇక ఆర్సీబీపై చెత్త ఇన్నింగ్స్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి రాహుల్‌.. టెస్టు మ్యాచ్‌ అనుకున్నావా అంటూ పోస్టులు చేస్తున్నారు.

మరి కొంత మంది రూ.17 కోట్లు తీసుకున్నావు.. టెస్టు క్రికెట్‌ కంటే దారుణంగా ఆడుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై ఒక్క వికెట్‌ తేడాతో లక్నో విజయం సాధించింది. లక్నో విజయంలో స్టోయినిష్‌(65), పూరన్‌(62) పరుగులతో  కీలక పాత్ర పోషించారు.


చదవండి: Avesh Khan: మరీ అంత ఓవరాక్షన్‌ పనికిరాదు.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement