IPL 2023, SRH Vs RCB: SRH Owner Kavya Maran Gets Deeply Disappointed After Abhishek Sharma's Wicket;Pics Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: పాపం కావ్య.. ముఖం ఎలా పెట్టుకుందో చూడండి! ఫోటో వైరల్‌

Published Fri, May 19 2023 8:34 AM | Last Updated on Fri, May 19 2023 9:33 AM

Kavya Maran gets deeply disappointed after Abhishek Sharmas wicket - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. ఉప్పల్‌ వేదికగా గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ పరాజయం పాలైంది. అదే విధంగా తమ జట్టు గెలిస్తే చూడాలని మైదానంకు వచ్చిన సన్‌రైజర్స్‌ యాజమాని కావ్యమారన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే ప్రతీ మ్యాచ్‌కు కావ్య హాజరవుతూ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ ఆరెంజ్‌ ఆర్మీ మాత్రం కావ్య ఆశలను ఆడి ఆశలు చేస్తోంది

తాజాగా కావ్య తన ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి సోషల్‌ మీడియాలో హైలెట్‌గా నిలిచింది. కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి అద్భుతమైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ వేసిన బ్రెస్‌వెల్‌ బౌలింగ్‌లో తొలి బంతికే అభిషేక్‌ శర్మ పెవిలియన్‌కు చేరాడు.

ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్‌ను వీక్షిస్తున్న కావ్య మారన్‌ ఒక్క సారిగా తీవ్ర నిరాశకు గురైంది. అభిషేక్‌ శర్మ ఔటైన వెంటనే  కావ్య మొహం మాడిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా  ఈ మ్యాచ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌, విరాట్‌ కోహ్లి సెంచరీలతో చెలరేగారు.
చదవండిIPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్‌క్రమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement