ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదారబాద్ గత కొన్ని సీజన్లగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్‌లు మారుతున్నప్పటికీ.. ఎస్‌ఆర్‌ఆహెచ్ ఆటతీరు మాత్రం మారడం లేదు. కనీసం ఈ ఏడాది సీజన్‌లోనైనా అదరగొడుతుందని భావించిన అభిమానులను ఎస్‌ఆర్‌హెచ్ మరోసారి నిరాశ పరిచింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది.
ఇక తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ ప్రదర్శనపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ యాజమాని కావ్యా మారన్ పడే బాధను తన చూడలేక పోతున్నాని రజనీ అన్నారు. తన రాబోయే చిత్రం ‘జైలర్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. "ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశా. కాబట్టి కళానిధి మారన్(కావ్య మారన్ తండ్రి)కు నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నాను.
జట్టులో మంచి ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి. వేలంలో మెరగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవాలి. జట్టున మరింత బలపేతం చేయాలని" సూచించారు. కాగా కళానిధి మారన్ రజినీ జైలర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024కు ముందు మరోసారి తమ జట్టును ప్రక్షాళన చేయాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హెడ్‌కోచ్ బ్రియాన్ లారాను ఉద్వసన పలకనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు)ను వదులుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చదవండి: IND vs WI: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment