రాస్తోవ్: సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా సౌదీ ఫుట్‌బాల్ ప్లేయర్లు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు రాస్తోవ్‌కు వెళ్తున్న సమయంలో విమానంలోని ఓ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగానే మంటలు వ్యాపించడంతో ఆటగాళ్లంతా ఆందోళనకు గురయ్యారు.
కాగా, ఆ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తమ ప్లేయర్లు అంతా సురక్షితంగా ఉన్నట్లు సౌదీ ఫుట్‌బాల్ సంఘం వెల్లడించింది. సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్‌లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుండగా, మంటలు చెలరేగడానికి పక్షి ఢీకొనడం కారణంగా రష్యా ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను విమానంలో ఉన్న ఆటగాళ్లు వీడియో తీయగా, దాన్ని సౌదీ మీడియా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment