ప్రిన్సెస్ డయానా మేనకోడలు కిట్టి స్పెన్సర్ (30) రోమ్‌లో దక్షిణాఫ్రికా ఫ్యాషన్ వ్యాపారవేత్త, బిలియనీర్ మైఖేల్ లూయిస్ (62)ను పెళ్లాడారు. ఇటలీలోని ఫ్రాస్కాటిలోని విల్లా అల్డోబ్రాండినిలో ఈ నెల 24న వివాహం అత్యంత ఘనంగా జరిగింది. తాజాగా ఈ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రధానంగా ఈ పెళ్లి వేడుకలో కిట్టీ ధరించిన గౌన్లు హాట్ టాపిక్‌గా మారాయి.
దివంగత యువరాణి డయానా తమ్ముడు విక్టోరియా ఐట్కెన్ కుమార్తె కిట్టి స్పెన్సర్ డోల్స్ అండ్ గబ్బానా రూపొందించిన కస్టమ్ మేడ్ వైట్ ఆల్టా మోడ్రన్ గౌనులో మెరిసిపోయింది. మరి డయానా మేనకోడలు, పైగా అతిపెద్ద ఫ్యాషన్ బిజినెస్ టైకూన్‌తో పెళ్లి ఆ మాత్రం ఉండాలి కదా. కిట్టి స్పెన్సర్ తన వెడ్డింగ్ గౌను ఫోటోలను, ఆ వివరాలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కిట్టి స్పెన్సర్ ఇలా పేర్కొన్నారు...“నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు కోసం .. నా కలలకు మించిన గౌనుని సృష్టించిన డొమెనికో అండ్ స్టెఫానోకు హృదయపూర్వక ధన్యవాదాలు... నా సంతోషాన్ని వెల్లడించేందుకు పదాలు లేవు.’’
పెళ్లి రోజున కిట్టీ ధరించిన వైట్ లేస్ గౌను తయారీకి ఆరు నెలల సమయం పట్టిందట. డెల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్న స్పెన్సర్ మూడు రోజుల ఈవెంట్‌లో ఐదు రీగల్ గౌన్లు ధరించింది. హై నెక్, లాంగ్ స్లీవ్స్, బుట్ట చేతులతో స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ గౌన్‌ను చూడటానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ప్రిన్స్ చార్లెస్‌తో పెళ్లి సమయంలో ఆమె అత్త డయానా ధరించిన పొడవాటి గౌన్‌ను తలపించిందని ఫ్యాషన్ ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. స్పెన్సర్ "విక్టోరియన్ ఇన్స్పిరేషన్ లేస్ బ్రైడల్ గౌన్" విశేషాలపై డిజైనర్లు కూడా ఇన్‌స్టాలో ఒక వీడియోషేర్ చేశారు. ఈ పెళ్లికి హాజరైన ప్రముఖుల్లో టెస్కా అధిపతి, ఎలోన్ మస్క్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జేడ్ హాలండ్ కూపర్ ,ప్రముఖ మోడల్ ఎమ్మా థిన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment