డయానాలా మాట్లాడగలనా అని భయం | Kristen Stewart Fear Of Princess Diana Original Accent | Sakshi
Sakshi News home page

డయానాలా మాట్లాడగలనా అని భయం

Oct 13 2020 10:52 AM | Updated on Oct 13 2020 10:52 AM

Kristen Stewart Fear Of Princess Diana Original Accent - Sakshi

‘స్పెన్సర్‌’ అని ఒక హాలీవుడ్‌ మూవీ వచ్చే ఏడాది మొదలు కాబోతోంది. ప్రిన్సెస్‌ డయానా బయోపిక్‌. అందులో డయానాగా అచ్చు డయానాలా లేని క్రిస్టెన్‌ స్టీవార్ట్‌ నటిస్తున్నారు. అంతేకదా, డయానాలా ఉండేవారు ఈ భూమి మీద ఎవరు దొరుకుతారు? డయానాకు ఇద్దరూ మగ పిల్లలే. అదొక సృష్టి అసంపూర్ణత. డయానాలా ఆ ఇంగ్లిష్‌ అదీ మాట్లాడాలన్నా ఏళ్ల ప్రాక్టీసు కూడా సరిపోదు. యూట్యూబ్‌లో వెతికి వినండి. ఆమె స్పీచ్‌లు వినడం కాదు. ఒరిజినల్‌ మాట తీరు దొరుకుతుంది కాస్త కష్టపడి గాలిస్తే. ‘తనలా మాట్లాడగలనా అని భయం వేస్తోంది’ అని అప్పుడే మొదలుపెట్టేశారు క్రిస్టెన్‌.

ఆ ఉచ్చారణ నోరు తిరగట్లేదట. గొప్ప ఇంగ్లిష్‌ అని కాదు. డయానా స్వరంలోంచి ఆ ప్రత్యేకమైన యాక్సెంట్‌కి ప్రాణం తేవడం! ‘ప్రిన్సెస్‌ డయానాకు నా మేకప్‌తో పోలికలు తేగలిగిన మహామహులు ఉన్నారు. అయితే ఆమె మాటకు పోలిక తేవడం నా వల్ల అవుతుందా?’ అని క్రిస్టెన్‌. ‘కానీ మీరే చెప్పాలి క్రిస్టెన్‌. డయానాలా యాక్ట్‌ చేస్తున్నవారే డయానా మాటనూ యాక్ట్‌ చేయగలరని నా నమ్మకం. దానర్థం నేను మిమ్ముల్ని నమ్ముతున్నానని’ అన్నారట డైరెక్టర్‌. ఈ ‘స్పెన్సర్‌’ చిత్రం డయానా ప్రేమ, పెళ్లి, పిల్లలు వరకే ఉంటుంది. ఆమె ట్రాజిక్‌ డెత్‌ వైపు వెళ్లడం లేదు డైరెక్టర్‌ పాబ్లో లారైన్, ఆయన నిర్మాతలు. మంచిదైంది. లేడీ డయానాకు కొన్ని నప్పవు. మరణం అసలే నప్పదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement