సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రతీది ఇప్పుడో న్యూస్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో కొన్ని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం వాటిని సానుకూలంగానే స్వీకరిస్తుంటారు. ఇదిలా ఉంటే ‘ట్విలైట్’ భామ క్రిస్టెన్ స్టెవార్ట్ రహస్య వివాహం చేసుకుందని, అదీ తన గర్ల్‌ఫ్రెండ్‌నేనన్న వార్తలు హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ‘ట్విలైట్’, ‘స్నో వైట్ అండ్ ది హంట్స్‌మ్యాన్’ లాంటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న క్రిస్టెన్(31).. స్క్రీన్ రైటర్ డైలాన్ మెయెర్‌తో 2019 నుంచి డేటింగ్‌లో ఉంది. చాలాకాలం తర్వాత ఈమధ్యే లాస్ ఏంజెల్స్‌లోని ఓ సెలూన్ వద్ద క్రిస్టెన్ ఫొటోగ్రాఫర్ల కెమెరాకు చిక్కింది. అయితే ఆమె చేతికి ఒక రింగ్ కనిపించడం, అలాంటి రింగ్ ఒకటి కొన్నిరోజుల క్రితం ఓ ఈవెంట్‌కు హాజరైన డైలాన్ వేలికి కూడా కనిపించడంతో ఇద్దరి రహస్య వివాహం జరిగిపోయిందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇద్దరూ స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తాను ఫెమినిస్ట్‌నని, బైసెక్సువల్ అని బహిరంగంగా ప్రకటించుకున్న స్టెవార్ట్.. గతంలో ట్విలైట్ హీరో రాబర్ట్ పాటిన్‌సన్‌తోనూ రిలేషన్‌షిప్ నడిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ రుపెర్ట్ శాండర్స్‌తో కొన్నాళ్లూ, తిరిగి పాటిన్‌సన్‌తో ఏడాది డేటింగ్ చేసింది. అటుపై విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అలిసియా కార్గిలేతో, న్యూజిలాండ్ మోడల్ స్టెల్లా మాక్స్‌వెల్‌తోనూ డేటింగ్ చేసింది. ఆపై ఓ టీవీ షో టైంలో డైలాన్ మెయర్‌కి దగ్గరై డేటింగ్ చేస్తూ.. లాస్ ఏంజెల్స్‌లో ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. గర్ల్‌ఫ్రెండ్‌తో బయట కనిపిస్తే ఛాన్స్‌లు ఇవ్వమని కొందరు ప్రొడ్యూసర్లు ఆమెతో చెప్పినప్పటికీ.. క్రిస్టెన్ మాత్రం ఆ వార్నింగ్‌ను లైట్ తీసుకుంది. గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా.. పార్టీలకు సైతం హాజరవుతూ వస్తోంది.
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ట్విలైట్ హీరోయిన్? ప్రొడ్యూసర్లు వార్నింగ్ ఇచ్చినా..
Published Sun, Jul 18 2021 8:24 AM | Last Updated on Sun, Jul 18 2021 3:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment