సహ నటితో హీరోయిన్‌ సీక్రెట్‌ వివాహం | Ellen Page secretly married Emma Portner | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 4 2018 1:18 PM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

Ellen Page secretly married Emma Portner - Sakshi

హాలీవుడ్‌ నటి ఎలెన్‌ పేజ్‌(30) రహస్య వివాహం వెలుగులోకి రావటంతో హాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తానోక లెస్బెనియన్‌ అని గర్వంగా ప్రకటించుకున్న ఈ ఎక్స్‌ మెన్‌ హీరోయిన్‌.. గతంలో ఇద్దరు నటీమణులతో సహజీవనం కూడా చేశారు. 

ఆరు నెలల క్రితం సహ నటి, డాన్సర్‌ అయిన ఎమ్మా పోర్ట్‌నర్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను అప్‌లోడ్‌ చేసి తాము సహజీవనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ‘‘నమ్మలేకపోతున్నా.. అద్భుతమైన మహిళ ఇక నా భార్యగా మారిపోయిందా?’’ అంటూ చేతులకు ఉంగరాలు ఉన్న ఫోటోను ఎలెన్‌ షేర్‌ చేసింది. ఇక ఎమ్మా కూడా అదే పోస్టు చేసి.. తన ప్రేమను వ్యక్త పరిచింది. 

అయితే వీరిద్దరి వివాహం చాలా రోజుల క్రితమే జరిగినట్లు బంధువులు చెబుతుండటం విశేషం. గతంలో ఎలెన్‌.. నటి సమంత థామస్‌తో కూడా రెండేళ్లపాటు సహజీవనం చేసిన విషయం చేసింది కూడా.   ఎక్స్‌ మెన్‌ ఫ్రాంచైజీ చిత్రాలతోపాటు, ఇన్‌సెప్షన్‌, జునో తదితర బ్లాక్‌ బస్టర్‌లలో ఎలెన్‌ పేజ్‌ నటించారు. ప్రస్తుతం ఈ జంటకు సోషల్‌ మీడియాలో అభినందనలు తెలియజేస్తూ సందేశాలు వచ్చి పడుతున్నాయి.

I get to call this incredible woman MY WIFE! @ellenpage I LOVE YOU!

A post shared by Emma Portner (@emmaportner) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement