బడికెళ్లిన బుల్లి యువరాజు | prince george go to school | Sakshi
Sakshi News home page

బడికెళ్లిన బుల్లి యువరాజు

Published Fri, Sep 8 2017 11:12 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

బడికెళ్లిన బుల్లి యువరాజు

బడికెళ్లిన బుల్లి యువరాజు

లండన్‌: బ్రిటన్‌ బుల్లి యువరాజు ప్రిన్స్‌ విలియం తనయుడు జార్జి బుల్లి స్వెట్టర్‌ వేసుకుని తొలిరోజు ఎంతో బుద్ధిగా బడికి కెళ్లారు. తొలిసారి స్కూల్‌కు వెళుతున్నజార్జిని ప్రిన్స్‌ విలియం ప్రత్యేకంగా స్కూల్‌కు తీసుకువెళ్లారు. ప్రిన్స్‌ జార్జి స్కూల్‌ యూనిఫాం ధరించి.. చక్కటి క్రాఫ్‌ తీసిన జుట్టుతో, చిన్న బ్యాగ్‌  పట్టుకునిబుడిబుడి అడుగులు వేసుకుంట బడికెళ్లారు. తొలిరోజు బడిలో సహ విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపాడని.. స్కూల్‌ అధ్యాపకులు చెప్పారు. 

తొలిరోజు తరగతిగదిలో గంట 40 నిమిషాల సేపు జూనియర్‌ ప్రిన్స్‌ గడిపాడు.  35 ఏళ్ల కిందట ఇదే పాఠశాలకు నన్ను మా అమ్మ ప్రిన్సెస్‌డయానా తొలిరోజు తీసుకు వచ్చిందని,ఇప్పుడు నేను నా కుమారుడిని అదే స్కూల్‌కు తీసుకువెళుతున్నాని ప్రిన్స్‌ విలియం అన్నారు. ఈ రెండు ఫొటోలను ప్రిన్స్‌ విలిమం సోషల్‌ మీడియాలో షేర్‌చేశారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement