మా అమ్మ రోజూ గుర్తొస్తుంది! | I still miss my mother every day, says Prince William | Sakshi
Sakshi News home page

మా అమ్మ రోజూ గుర్తొస్తుంది!

Published Sat, Aug 27 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

మా అమ్మ రోజూ గుర్తొస్తుంది!

మా అమ్మ రోజూ గుర్తొస్తుంది!

'నీకెలా ఉంటుందో నాకు తెలుసు. మా అమ్మ నాకు ప్రతిరోజూ గుర్తొస్తుంటుంది. ఆమె చనిపోయి 20 ఏళ్లయినా ఆమెను నేను మిస్‌ అవుతూనే ఉన్నా'.. ఇది బ్రిటన్‌ రాకుమారుడు విలియమ్‌ ఓ చిన్నారితో చెప్పిన మాట. 14 ఏళ్ల ఆ బాలుడి తల్లి క్యాన్సర్‌ బారిన పడి చనిపోయింది. దీంతో అతన్ని ఓదార్చిన ప్రిన్స్‌ విలియమ్‌ తన తల్లి ప్రిన్సెస్‌ డయానా లేనిలోటు తనను ఎలా వెంటాడుతుందో తెలిపారు.

1997 ఆగస్టు 31న పారిస్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో డయానా చనిపోయింది. ప్రిన్స్‌ విలియమ్‌ గతవారం తూర్పు ఇంగ్లండ్‌లోని ఓ సంరక్షణాకేంద్రాన్ని సందర్శించి అక్కడి బాలలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తల్లిని కోల్పోయిన ఓ బాలుడితో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. 'నువ్ బాధపడటం, అమ్మను మిస్‌ అవ్వడం సరైనదే. కానీ, నీ ఆవేదనను కుటుంబంతో పంచుకో' అంటూ అతన్ని ఓదార్చారు. ప్రిన్స్‌ విలయమ్‌ వెంట ఆయన సతీమణి కేట్‌ కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement