ప్రిన్స్ డయానా దుస్తులు వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు మునుపు ఆమె ధరించిన స్వెట్టర్ ధర, వివాహ దుస్తులు ఇలానే కోట్లలో ధర పలికి ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని ప్రూవ్ చేసింది. మళ్లీ మరోసారి అదే రికార్డు స్థాయిలో ప్రిన్స్ డయానికి సంబంధించిన డ్రస్ అమ్ముడిపోయింది యువరాణి క్రేజ్‌ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ డ్రస్‌ని ప్రిన్స్ డయానా 1985లో ఫోరెన్స్‌లోని బాలేరినాలో సాయంత్రం ఈ దుస్తులను ధరించింది. అలాగే వాంకోవర్ పర్యటనలో ఈ డ్రస్‌తో ఫోటోగ్రాఫర్ల కంట పడినట్లు జూలియన్స్ వేలం సంస్థ పేర్కొంది. ఈ డ్రస్ టాప్ నీలిరంగు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి నల్లటి వెల్వెట్ కలర్‌లో ఉండగా, స్కర్ట్ ఊదారంగులోని ఆర్గ్కాన్జాలా ఉండి పైన రిబ్బన్ మాదిరిగా ఉంటుంది.
లండన్‌లో జూలియన్స్ నిర్వహించిన వేలంలో అంచనా వేసిన దానికంటే 11 రెట్టు ధర పలికడం విశేషం. ఇంతకమునుపు వేలం వేసిన డయనా గౌనుల్లో ఒక దాని రికార్డుని బ్రేక్ చేసేలా రూ. 9 కోట్లు పలికింది. ఈ దుస్తులు యువరాణి ప్రిన్స్ డయానా రాజదర్పాన్ని తెలియజేసేలా ఉండటమే గాక ఆ డ్రస్ అత్యధికంగా అమ్ముడుపోయి ఆమె ఫ్యాషన్ ఐకాన్‌కి కేరాఫ్ అని మరోసారి చాటి చెప్పింది. వేలంలో అత్యధిక ధర పలికిన దుస్తులగా ప్రపంచ రికార్డును డయాన ధరించిన దుస్తులే నిలవడం విశేషం.
నిజానికి జూలియన్స్ వేలం నిర్వాహకులు ఈ డ్రస్ వేలంలో సుమారు రూ. 83 లక్షల నుంచి కోటి రూపాయ వరకు పలికే అవకాశం ఉందనుకున్నారు. కనివినీ ఎరుగని రీతిలో అత్యధికంగా పలికీ దటీజ్ ప్రిన్స్ డయానా అనేలా ఆశ్చర్యపరిచింది. కొందరూ కొద్దికాలమే బతికినా వారి ప్రభావం అలానే ఉంటుంది. అందరి మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు కూడా. ఆఖరికీ వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారి మాదిరిగానే ఓ అద్భుతంగా నిలుస్తాయి కాబోలు.
Comments
Please login to add a commentAdd a comment