Diana
-
డయానాలా కనిపించే ప్రముఖ ప్యాషన్ ఐకాన్ ఆమె..!
కొన్ని రకాల నైపుణ్యాలు, తెలివితేటల జీన్స్ రీత్యా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ఆ కుటుంబంలో అత్యంత ప్రతిభావంతుడు ఉంటే. ఆ పరంపర అతని తర్వాత తరంలో ఎవరో ఒకరు కొనసాగిస్తుంటారు. వెంటనే అతన్ని అంతకు ముందు జనరేషన్ వ్యక్తితో పోల్చుకుంటూ..ఆ వ్యక్తి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం సహజం. అలానే ఓ ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ని చూడగానే నాటి అందాల యువ రాణి దివంగత డయానాని గుర్తు తెచ్చుకుంటారు అంతా. ఇంతకీ ఎవరా మోడల్ అంటే..?ఆ మోడల్ పేరు కేథరిన్ కిట్టి ఎలియనోర్ స్పెన్సర్. ఆమె గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చూడటానికి దివంగత యువరాణి డయానాలా అందంగా ఉంటుంది. కిట్టి ఎర్ల్ స్పెన్సర్-విక్టోరియా ఐట్కెన్ల పెద్ద కుమార్తె. ఇక్కడ కిట్టి తండ్రికి స్వయనా అక్కే వేల్స్ దివంగత యవరాణి డయానా. అంటే కిట్టి స్వయానా.. డయాన మేనగోడలు. బహుశా ఆ జీన్స్ ఆమెలో కూడా ఉంటాయి కాబట్టి కిట్టి డయానాలా ఉండి ఉండొచ్చు. ఇక కిట్టీ 2015 నుంచి మోడల్‌గా మారింది. ఎస్టీ లాడర్, బల్గారి, వోగ్, రాల్ఫ్ లారెన్, జిమ్మెర్మాన్లతో సహా ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక బ్రాండ్లతో కలిసి పనిచేశారామె. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మార్క్లేల వివాహంలో తొలిసారిగా కిట్టీ పేరు మారు మ్రోగిపోయింది. మరో డయానాలా ఉందే అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టాట్లర్ కవర్‌పై మోడల్‌గా కనిపించిన ఆమెనే కిట్టి అని ప్రపంచమంతా గుర్తించడం ప్రారంభించింది. ఈ గుర్తింపే కిట్టిని ఫ్యాషన్ కెరియర్ మకుటం లేని రాణిని చేసింది. అయితే కిట్టీ తల్లి విక్టోరియా ఐట్కెన్ కూడా మాజీ బ్రిటిష్ మోడలే కావడం విశేషం. ఇక కిట్టి మోడలింగ్ ఏజెన్సీ స్టార్మ్ మేనేజ్మెంట్కు సంతకం చేయడమే గాక ఇటాలియన్ లగ్జరీ పవర్‌హౌస్ డోల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా ఉంది.వ్యక్తిగత జీవితం..బిలియనీర్ మైఖేల్ లూయిస్‌ని పరిణయమాడింది. అంతేగాదు తన వివాహ సమయంలో లగ్జరీ బ్రాండ్ ఫ్యాషన్ హౌస్ నుంచి డికాడెంట్ గౌనుని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక కెరీర్ పరంగా.. ఆమె లండన్ రీజెంట్స్ యూనివర్శిటీలో లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత కలిగిన యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. కాగా, 33 ఏళ్ల కిట్టి ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ పేరుని, ఫోటోని షేర్ చేసుకుంది.(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!) -
టీచర్ కాస్త రేసర్‌గా..ఏకంగా నేషనల్ కారు రేసింగ్ ఛాంపియన్షిప్..!
మనకు నచ్చిన అభిరుచి వైపు అకుంఠిత దీక్షతో సాగితే ఉన్నత విజయ శిఖరాలను అందుకోవడం ఖాయం. అలా ఎందరో గొప్ప గొప్ప విజయాలను అందుకుని స్ఫూర్తిగా నిలచారు కూడా. అలాంటి కోవకు చెందిందే డయానా పుండోల్. ఇంతకీ ఎవరీమె? ఏం సాధించిందంటే..పూణేకు చెందిన 28 ఏళ్ల డయానా పుండోల్ పురుషులే ఎక్కువగా ఇష్టపడే రేసింగ్‌ల వైపుకు అడుగులు వేసింది. రేసింగ్ అనేది పురుషాధిక్య కాంపీటీషన్ అనే చెప్పాలి. సాధారణంగా మహిళలు ఇటువైపు రావడం. అదీగాక ఎక్కువగా పురుషులే ఈ కారు రేసింగ్‌లో ఛాంపియన్ షిప్‌లు గెలుచుకుంటారు. ఇంతవరకు వాళ్లే ఈ రంగంలో అధిక్యంలో ఉన్నారు. అలాంటి సాహసకృత్యంతో కూడిన రేసింగ్‌ని డయానా ఎంచుకుంది. పైగా ఆమె తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెబుతుండటం విశేషం. ఎంతో అంకితభావంతో రేసింగ్‌లో శిక్షణ తీసుకుని ఏకంగా నేషల్ కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. అంతేగాదు ఇలాంటి ఘనత సాధించిన తొలి మహిళా రేసర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె టీచర్‌గా పనిచేస్తూ వీకెండ్లలో రేసింగ్ ప్రాక్టీస్ చేసి మరీ విజయం సాధించడం విశేషం. ఇన్నాళ్లుగా మహిళలు సాహస క్రీడల్లో పాల్గొనడం అంటే మాటలు కాదు అనే వాళ్ల నోళ్లు మూయించేలా విజయఢంకా మోగించింది డయానా. మహిళలు తలుచుకుంటే ప్రతి రంగంలో ధైర్యంగా దూసుకుపోగలరని తన గెలుపుతో చాటి చెప్పింది. అంతేగాదు పురుషలకు ఏ విషయంలోనూ మహిళలు తీసిపోరని నర్మగర్భంగా చెప్పింది. కాగా, ఆమె ఇలాంటి పలు ఇతర ప్రతిష్టాత్మకమైన రేసింగ్లలో పాల్గొంది కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రసిద్ధ రేసింగ్ కాంపిటీషన్ అన్నింటిల్లోనూ పాల్గొంది. ముఖ్యంగా దుబాయ్ ఆటోడ్రోమ్, యూరప్, యూఏఈలోని హాకెన్‌హైమ్రింగ్, బెల్జియంలోని F1 సర్క్యూట్ డి స్పా వంటి రేసింగ్లలో కూడా పాల్గొంది. పైగా రానున్న జనరేషన్ ధైర్యంగా ఇలాంటి వాటిల్లోకి వచ్చేలా ప్రేరణగా నిలిచింది. ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నైపుణ్యం తోడైతే ఎలాంటి ఛాలెంజింగ్ క్రీడల్లో అయినా విజయం సాధించొచ్చని డయానాని చూస్తే తెలుస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Diana (@diana.pundole) (చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి..
ప్రిన్స్ డయానా దుస్తులు వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు మునుపు ఆమె ధరించిన స్వెట్టర్ ధర, వివాహ దుస్తులు ఇలానే కోట్లలో ధర పలికి ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని ప్రూవ్ చేసింది. మళ్లీ మరోసారి అదే రికార్డు స్థాయిలో ప్రిన్స్ డయానికి సంబంధించిన డ్రస్ అమ్ముడిపోయింది యువరాణి క్రేజ్‌ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ డ్రస్‌ని ప్రిన్స్ డయానా 1985లో ఫోరెన్స్లోని బాలేరినాలో సాయంత్రం ఈ దుస్తులను ధరించింది. అలాగే వాంకోవర్ పర్యటనలో ఈ డ్రస్‌తో ఫోటోగ్రాఫర్ల కంట పడినట్లు జూలియన్స్ వేలం సంస్థ పేర్కొంది. ఈ డ్రస్ టాప్ నీలిరంగు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి నల్లటి వెల్వెట్ కలర్లో ఉండగా, స్కర్ట్ ఊదారంగులోని ఆర్గ్కాన్జాలా ఉండి పైన రిబ్బన్ మాదిరిగా ఉంటుంది. లండన్‌లో జూలియన్స్ నిర్వహించిన వేలంలో అంచనా వేసిన దానికంటే 11 రెట్టు ధర పలికడం విశేషం. ఇంతకమునుపు వేలం వేసిన డయనా గౌనుల్లో ఒక దాని రికార్డుని బ్రేక్ చేసేలా రూ. 9 కోట్లు పలికింది. ఈ దుస్తులు యువరాణి ప్రిన్స్ డయానా రాజదర్పాన్ని తెలియజేసేలా ఉండటమే గాక ఆ డ్రస్ అత్యధికంగా అమ్ముడుపోయి ఆమె ఫ్యాషన్ ఐకాన్‌కి కేరాఫ్ అని మరోసారి చాటి చెప్పింది. వేలంలో అత్యధిక ధర పలికిన దుస్తులగా ప్రపంచ రికార్డును డయాన ధరించిన దుస్తులే నిలవడం విశేషం. నిజానికి జూలియన్స్ వేలం నిర్వాహకులు ఈ డ్రస్ వేలంలో సుమారు రూ. 83 లక్షల నుంచి కోటి రూపాయ వరకు పలికే అవకాశం ఉందనుకున్నారు. కనివినీ ఎరుగని రీతిలో అత్యధికంగా పలికీ దటీజ్ ప్రిన్స్ డయానా అనేలా ఆశ్చర్యపరిచింది. కొందరూ కొద్దికాలమే బతికినా వారి ప్రభావం అలానే ఉంటుంది. అందరి మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు కూడా. ఆఖరికీ వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారి మాదిరిగానే ఓ అద్భుతంగా నిలుస్తాయి కాబోలు. (చదవండి: శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?) -
విదేశీ యువతులు.. తెలుగింటి కోడళ్లు..
ఆదిలాబాద్: పెళ్లంటే ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్రను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. క్రమంగా ఆ సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. ఉన్నత చదువుల కోసం, వృత్తిరీత్యా స్థిరపడేందుకు విదేశాల బాట పడుతున్న యువత అక్కడే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేమించి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొస్తున్నారు. ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడుతున్న విదేశీ యువతులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగింటి కోడళ్లుగా అడుగు పెట్టిన విదేశీ అమ్మాయిలపై ప్రత్యేక కథనం. ►అమెరికా అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి.. (టేలర్ డయానా – అభినయ్‌రెడ్డి) ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి గత అక్టోబర్‌లో పెద్దల అంగీకారంతో మనువాడాడు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు కలిసి నడిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవీదాస్– కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్‌రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఆదిలాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయికి చెందిన ఇరుకుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు కూడా హాజరై ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని వారు చెప్పడం గమనార్హం. వధూవరులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ►ఆస్ట్రేలియా అమ్మాయి.. నిర్మల్ అబ్బాయి.. (హనా,ఆస్ట్రేలియా – నామని కార్తీక్) ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి నిర్మల్ అబ్బాయితో ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. నిర్మల్ శాస్త్రినగర్ కాలనీకి చెందిన నామని పద్మ– సదానందం దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండగా, అమ్మాయి హనా అక్కడే మెడ్ల్యాబ్లో సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ మహోత్సవానికి వధువు తల్లిదండ్రులు వెరోనికా–డార్రెన్ దంపతులు సైతం హాజరై హిందూ సంప్రదాయరీతిలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని టౌన్స్ ప్రిన్సిల్యాండ్స్లోకొత్తకాపురం మొదలుపెట్టారు. ►మయన్మార్ అమ్మాయి.. గుడిహత్నూర్ అబ్బాయి.. (కేథరీన్ – గొల్లపల్లి రవికుమార్) మయన్మార్ అమ్మాయి, గుడిహత్నూర్ అబ్బాయి ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికుమార్‌కు, మయన్మార్‌కు చెందిన కేథరీన్ ప్రేమించుకున్నారు. రవికుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్‌లోని జిన్న్వేథేన్ నగరంలో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో గత ఫిబ్రవరి 6న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా, వరుడి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై ఆశీస్సులు అందజేశారు. -
42 అడుగుల గోళ్లు.. గిన్నిస్ రికార్డు బద్దలు
ఎవరైనా గోర్లు ఎంత పెంచుకుంటారు? ఇంచు.. మహా అయితే రెండు ఇంచులు. కానీ, డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ మాత్రం ఫీట్ల కొద్దీపెంచేసింది. ఆమె గోర్లన్నీ కలిపితే.. 42 అడుగుల 10.4అంగుళాలు పొడవు. అంటే.. నాలుగంతస్తుల భవనం కంటే ఎక్కువేనన్నమాట. అందుకే అత్యంత పొడవైన చేతివేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఆమె గోర్లలో అతి పొడవైనది 4 అడుగుల 6.7అంగుళాలు ఉండగా, అతి చిన్నది 3 అడుగుల 7 అంగుళాల పొడవుతో ఉంది. అయితే డయానా గోళ్లు పెంచడం వెనుక ఓ విషాద గాథ ఉంది. డయానా కూతురు ఆస్తమాతో చనిపోయింది. చనిపోవడానికి ముందు రోజంతా తల్లితోనే గడిపిన ఆ అమ్మాయి.. రాత్రిపూట తల్లి గోళ్లు తీసి, పాలిష్ చేసింది. తల్లీకూతుళ్లు ఆ రాత్రంతా ముచ్చట్లతోనే గడిపేశారు. తెల్లారి ఆ అమ్మాయి చనిపోయింది. కూతురు పాలిష్ చేసిన గోళ్లను కట్ చేయొద్దనుకుంది డయానా. అంతే... 25 ఏళ్లుగా పెంచుతూనే ఉంది. మిగిలిన పిల్లలు గోళ్లు కట్ చేసుకోమని సూచించారు. బయటికి వెళ్లినప్పుడు జనాలు వింతగా చూశారు. అవేమీ పట్టించుకోలేదామె. ఎందుకంటే ఆ గోళ్లను చూసుకున్నప్పుడల్లా తన కూతురు తనతోనే ఉన్నట్లనిపిస్తుందంటుంది. అదే విషయాన్ని పిల్లలతోనూ చెప్పింది. ఆ తరువాత వాళ్లెప్పుడూ కట్ చేసుకోమని చెప్పలేదు. ఇక బయటికి వెళ్లినప్పుడు కొందరు ఆమెతో ఫొటో దిగడానికి ఇష్టపడ్డా.. ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు, గిన్నిస్ రికార్డు తరువాత ఫొటోస్‌కు ఓకే చెబుతానంటోంది. వేర్లలా పెరిగిన గోళ్లతోనే ఆమె అన్ని పనులూ చక్కబె డుతుంది. ల్యాప్‌టాప్‌ను సైతం ఆపరేట్ చేస్తుంది. ఒక్క వంటమాత్రమే చేయలేనని చెబుతోంది. లక్ష డాలర్లు ఇస్తామని చెప్పినా తాను గోళ్లు మాత్రం కట్ చేయనంటోంది. చదవండి: మంకీపాక్స్‌తో వణికిపోతున్న అమెరికా.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన -
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కింది. బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్‌పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలు, తన మెంటార్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి అత్యున్నత అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. -
పేరు మార్చుకున్న నయనతార!
చెన్నై : నయనతార ఈపేరిప్పుడు ఒక సంచలనం. అగ్రకధానాయకి. లేడీ సూపర్‌స్టార్. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయకి. ఇలా చాలా పేర్లు గడించిన నటి నయనతార. గ్లామర్ హీరోయిన్ నుంచి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల నటి స్థాయికి చేరుకుంది. అలాంటి ఈ అమ్మడు మలయాళీ అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ కేరళా బ్యూటీ అసలు పేరు డయానా. మరి నయనతారగా ఎలా రూపాంతరం చెందింది? ఆ క్రెడిట్ తనదే అన్నారు ఒక సీనియర్ నటి. నయనతార అయ్యా అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తరువాత గజనీ లాంటి చిత్రాల్లో రెండో హీరోయిన్‌గానూ నటించింది. ఈ అమ్మడికి చంద్రముఖి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం ఘనవిజయం నయనతారను సూపర్ హీరోయిన్ను చేసేసింది. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌ల్లో అందరు ప్రముఖ హీరోలతోనూ జత కట్టేసింది. ఒక్క కమలహాసన్‌తో మినహా. ఆ అవకాశం ఇటీవల వచ్చినా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రాన్ని అంగీకరించలేకపోయింది. ఈ బ్యూటీ తమిళంలోకి దిగుమతి అయ్యే ముందే మాతృభాషలో మనసీనక్కరే అనే చిత్రంలో నటించింది. అందులో నటుడు జయరామ్ కథానాయకుడు. సీనియర్ నటి షీలా ముఖ్య పాత్రను పోషించారు. సత్యన్ దర్శకుడు. ఆయన డయానా పేరును మార్చాలని భావించారట. అయితే ఏం పేరు పెడదామా? అన్ని ఆలోచలతో తలమునకలయ్యారట. డయానా పేరును మార్చి వెల్లడించడానికి ఒక కార్యక్రమాన్నే ఏర్పాటు చేశారట. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నటి షీలా డయానాకు నయనతార అనే పేరును పెట్టారట. తార అంటే నక్షత్రం కాబట్టి సినిమాలో నయనతార ఓహో అని వెలగాలని ఆమెకు ఆ పేరును పెట్టినట్లు ఇటీవల ఒక భేటీలో నటి షీలా వెల్లడించారు. కాగా ఆమె ఏ శుభ ముహూర్తాన నయనతారకు ఆ పేరు పెట్టారో గానీ, తను భావించినట్లే ఇవాళ నయనతార దక్షిణాదిని ఏలేస్తోంది. అంతే కాదు జయాపజయాలకు అతీతంగా మారిపోయింది. ఒక పక్క ఆమె నటించిన చిత్రాలు అపజయం పొందుతున్నా, మార్కెట్ తగ్గడం కానీ, ఇమేజ్ డామేజ్ కావడం కానీ, అవకాశాలు కొరవడటం కానీ జరగడం లేదు. -
ఏ చెడు కన్నూ పడని చోటు
సమాధి : 1997–2017 నీలికళ్ల సుందరి, అందాల రాకుమారి డయానాను ఈ ప్రపంచంలో ప్రేమించనిదెవ్వరు? ఆఖరికి మరణం కూడా ఆమెను వెంటాడి, వేధించి మరీ ప్రేమించింది! 1997 ఆగస్టు 31న పారిస్‌లోని ఓ సొరంగ మార్గంలో.. కారు యాక్సిడెంట్లో డయానా చనిపోయారు. సెప్టెంబర్ 6న పుట్టినింటి ఎస్టేట్‌లో ఆమెను సమాధి చేశారు! ‘ఏ చెడు కన్నూ పడని చోట, ప్రశాంతమైన ప్రదేశంలో నన్ను సమాధి చెయ్యండి’ అని బతికుండగా ఆమె తన పుట్టింటివాళ్లను కోరుకున్నారట! లండన్‌కి 112 కి.మీ. దూరంలోని నార్థంప్టన్షైర్లో.. సుమారు పదమూడు వేల ఎకరాల విస్తీర్ణంలో పచ్చగా పరుచుకుని ఉన్న 500 ఏళ్ల నాటి అల్తోర్ప్ ఎస్టేట్‌లో గుర్తు తెలియని చోట డయానా భౌతికకాయాన్ని ఖననం చేశారు. డయానా తన 36వ ఏట మరణించారు. ఆమె జీవితకాలంలోని ఒక్కో ఏడాదికి గుర్తుగా ఎస్టేట్‌లోని రౌండ్ ఓవల్ కొలను చుట్టూ 36 ఓక్ మొక్కల్ని నాటారు. అవి ఇప్పుడు 20 ఏళ్ల వయసు గల ఓక్ వృక్షాలు. వందలాది వైట్ వాటర్ లిల్లీ, గులాబీ పూల మొక్కలు ఆ చుట్టూతా ఉంటాయి. బహుశా ఇవన్నీ డయానా కోరుకున్న ‘మరణానంతర ప్రశాంతత’ను ఆమెకు అందిస్తూ ఉండివుండొచ్చు. కానీ, ఒకటి మాత్రం వాస్తవం. ప్రశాంతత కన్నా ముందు ప్రేమ కోసం డయానా పరితపించారు. అదీ.. భర్త ప్రేమ కోసం! ప్రేమకు ప్రేమ ప్రతీకారం! బ్రిటన్ రాకుమారుడు చార్ల్స్‌తో 1981లో డయానా పెళ్లి జరిగింది. 1996లో వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఎంత పెద్ద రాకుమారి అయినా ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి మామూలు అమ్మాయిలానే బిహేవ్ చేస్తుంది. భర్త తనని కాకుండా మరెవర్నో ప్రేమిస్తున్నాడని తెలిసి, భర్తపై కోపంతో మరెవర్నో ప్రేమించింది డయనా. ఒకర్నీ, ఇద్దరిని కాదు. మొత్తం ప్రపంచాన్నే ప్రేమించింది.. ఒక్క భర్తను తప్ప! భర్త గిలగిల్లాడిపోయి, తన ప్రేమకోసం వచ్చేస్తాడనుకుంది పాపం. అలా వచ్చేవాడైతే.. చార్లెస్ అసలు డయానాను ఎందుకు చేసుకుంటాడు? ఆమె అక్కతోనే ఫిక్స్ అయిపోయేవాడు! అవును, డయానా కన్నా చాలా ముందే డయానా అక్క శారా స్పెన్సర్‌ని ప్రేమించాడు చార్ల్స్. తర్వాత ‘నువ్వు నచ్చావ్’ అంటూ డయానా దగ్గరికి వచ్చేశాడు. తర్వాత ‘నువ్వే నచ్చావ్’ అనుకుంటూ మరో ప్రేమికురాలు కామిల్లా పార్కర్ దగ్గరికి వెళ్లిపోయాడు. మనిషి ఇంట్లోనే ఉండేవాడు. మనసు కామిల్లా చుట్టూ తిరిగొచ్చేది. ఇదంతా డయానా కళ్ల ముందే! ఏ భార్యకైనా ఈ మాత్రం నరకం చాలు, ఉన్నపళాన పారిపోడానికి. ‘అది నా పర్సన ల్’ అన్నాడు డయానా కూడా పారిపోయింది. మానసికంగా తన ఇంట్లోంచి తనే. చార్ల్స్ ఎప్పుడొస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తాడో తెలీదు. కానీ ఎక్కడికి వెళ్లొస్తున్నాడో ఆమెకు తెలుసు. ఓ రోజు అడిగింది.. ‘తన దగ్గర్నుంచేనా?’ అని. తన అంటే చార్ల్స్ ప్రియురాలు కామిల్లా. ‘అది నా వ్యక్తిగత విషయం’ అన్నాడు చార్లెస్. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విషయాలు ఉన్నాయీ అంటే ప్రేమ లేకుండా పోయిందని! మణికట్లు కోసుకుంది! అసలు పెళ్లయిన కొత్తలోనే బ్లేడ్‌తో తన మణికట్లను కోసుకుంది డయానా! చేతులు రెండూ రక్తం కారుతూ ఉంటే çపనివాళ్లు చూసి అడిగారే కానీ, చార్ల్స్ పట్టించుకోలేదు. అప్పటికే పూర్వపు ప్రియురాలు కామిల్లా మత్తులో ఉన్నాడతడు. అంటే.. పెళ్లికి విలువలేదనేగా? డిప్రెషన్లో కూరుకుపోయింది డయానా. ఆ డిప్రెషన్లోనే చేతులకు గాయాలు చేసుకుంది. హనీమూన్‌కి కూడా అయిష్టంగానే బయల్దేరింది. ‘హనీమూన్‌కి వెళ్తున్నాం. హాయిగా నిద్రపోడానికి మంచి సమయం’ అని ఆమె తన ఫ్రెండ్స్‌కి రాసిన ఉత్తరం ఒకటి ఈ ఏడాది మే నెలలో బయటపడింది! ఎముకల పోగు అయింది డయానాకు, చార్ల్స్‌కు 13 ఏళ్ల వయసు వ్యత్యాసం. ఇద్దరి మధ్యా అంత దూరం ఉన్నప్పుడు ఎలా దగ్గరవుతారు? ఈ మాట నిజం కాదు. ప్రేమ ఎంతటి దూరాలనైనా దగ్గర చేస్తుంది. డయానా సిన్సియర్‌గా చార్లెస్‌ను లవ్ చేసింది. ఆ ప్రేమకు చార్లెస్ ఎప్పుడైతే ప్రతిస్పందించడం మానేశాడో.. అప్పుడే ఆమె హృదయం బద్ధలైపోయింది. ‘‘ఏంటలా చిక్కిపోతున్నావ్ డయానా.. ఎముకలు కనిపిస్తున్నాయి తెలుసా?’ అని ఆమె స్నేహితులు అడిగినప్పుడు.. డయానా నిర్జీవంగా ఒక నవ్వు నవ్వేది. ఇదీ పెళ్లయిన కొత్తలోనే! ఈ సంగతులన్నీ ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒకటొకటిగా, ఆమె సన్నిహితుల నుంచి బయటపడుతున్నాయి. ప్రేమ కోసం అలమటించీ, అలమటించీ ప్రేమను వెతుక్కునే ప్రయత్నంలో.. బయటి ప్రేమల అడుసులో కాలు వేసి జీవితంలో ప్రశాంతతను కోల్పోయింది డయానా. అందుకేనేమో.. ఏ చెడు కన్నూ పడని చోట తనను సమాధి చెయ్యమని ఆమె కోరుకుంది. అత్త అడుగులో కోడలు ∙పెళ్లి ప్రమాణంలో ‘ఒబే’ అనే మాటను పలకడానికి డయానా నిరాకరించారు! ఆమె స్వతంత్ర వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం అది. ‘కలిమిలో లేమిలో, ఆరోగ్యంలో అనారోగ్యంలో నా భర్తతో నేను జీవితాంతం విధేయురాలినై కలిసి ఉంటాను’ అనే ప్రమాణంలోని ‘విధేయురాలినై’ అనే మాటను ఆమె బుద్ధిపూర్వకంగా స్కిప్ చేయడం ఆ రోజు రాజకుటుంబీకులను ఆశ్చర్యానికి లోను చేసింది. సంప్రదాయ విరుద్ధమైన ఈ ఉల్లంఘనను డయానా కోడలు కేథరీన్ కూడా ఫాలో అయ్యారు! అమె కూడా ‘ఒబే’ అనే మాటలను మినహాయించి మిగతా ప్రమాణమంతా చేశారు. డయనా తన ఎంగేజ్మెంట్ రింగ్‌ని సొంతగా తయారు చేయించుకోకుండా, బయట ఆభరణాల దుకాణంలోంచి ఎంపిక చేసుకున్నారు. దానిని ప్రిన్స్ చార్ల్స్ అమె వేలికి తొడిగారు. ఆ ఉంగరాన్నే డయానా పెద్ద కొడుకు ప్రిన్స్ విలియమ్స్ తన భార్య కేథరీన్ వేలికి తొడిగాడు. పెళ్లి రోజు లేడీ డయానా, ప్రిన్స్ చార్లెస్. తోడు పెళ్లి కూతురు గ్రేట్ బ్రింగ్టన్‌లోని సెయింట్ మేరీ వర్జిన్ చర్చి: డయానా శవపేటికను రౌండ్ ఓవల్ నుంచి రహస్యంగా తరలించి భూస్థాపితం చేశారని భావిస్తున్న చర్చి లోపలి భూగృహ ప్రదేశం. రౌండ్ ఓవల్ కొలనులో డయానా స్మారక మందిరం (ఎడమ), స్మారక స్థూపం (కుడి). డయానా మృతదేహాన్ని ఖననం చేసిన కచ్చితమైన చోటును మాత్రం ఆమె పుట్టింటివాళ్లు ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు. -
డయానా న్యూ లెటర్
అందం, చదువు, ఆస్తి, అంతస్తు, అయినవారు.. అందరూ ఉన్న ఒంటరి యువరాణి.. లేడీ డయానా! ఈ సంగతి ఎవరో ఊహించి చెప్పిందీ, కనిపెట్టి చెప్పిందీ కాదు. స్వయంగా డయానానే తన ఆంతరంగికులకు రాసిన ఉత్తరాలలో తనకు ఎవరూ లేరన్న ఆవేదనను అనేకసార్లు పరోక్షంగా వ్యక్తం చేశారు. లేటెస్టుగా ఇప్పుడు మరో ఉత్తరం బయటపడింది. డడ్లీ పాప్లాక్ అనే ఆత్మీయుడికి 1991 డిసెంబర్ 3న డయానా రాసిన ఉత్తరం అది. డడ్లీ పాప్లాక్ దక్షిణాఫ్రికా దేశపు ఇంటీరియన్ డిజైనర్. సృజనశీలి. లండన్‌లోని బ్రిటిష్ రాజప్రాసాదంలోని హంగులన్నీ డయానా అభిరుచికి తగ్గట్టు అమర్చింది డడ్లీనే. డడ్లీకి డయానా పుట్టింటితో కూడా అనుబంధం ఉంది. డడ్లీ దగ్గర డయానా ఎంతగా మనసు విప్పారో ఈ ఉత్తరం చదివితే తెలుస్తుంది. డియరెస్ట్ డడ్లీ, ఇవాళ లంచ్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా కారణాల వల్ల అది నాకు స్పెషల్ లంచ్. ప్రత్యేకంగా... ఆ రుచికరమై భోజనం ఆఖర్న మన మధ్య జరిగిన సంభాషణ. ఎప్పుడూ లేనంతగా నేనిప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాను. నా దేశంలో, నా కుటుంబంలో జరగబోయేదాన్ని నేను చూడగలుగుతున్నాను. (ఇక్కడి నుంచి నాలుగు లైన్లు తను తీసుకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు గురించి; అన్నార్తులకు, ఆపన్నులకు సహాయం చేయడం గురించి రాశారు డయానా). తర్వాతి లైన్లు: డడ్లీ, మీకు నా మీద నమ్మకం ఉందని నేను విశ్వసిస్తున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను అపార్థం చేసుకుంటున్న ఈ తరుణంలో మీ నమ్మకం నాకెంత ముఖ్యమైనదో చెప్పలేను. ప్లీజ్.. మన సంభాషణను మళ్లీ మనం జనవరిలో కొనసాగించవచ్చా? నా లోలోపలి ఆలోచనలను మీతో పంచుకోవాలని ఉంది. జీవితం వేగాన్ని, చురుకుదనాన్ని కోల్పోయినప్పుడు నేను మీ సలహాలను అడిగి తీసుకుంటాను. మీ ముగ్గురూ నాకు స్పెషల్ ఫ్రెండ్స్ డడ్లీ (ఆ ముగ్గురితోనే అంతకుముందు డయానా లంచ్ చేశారు). పీటర్, ఇయాన్‌ల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. – లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్, డయానా -
భార్య ఎదుటే రెండో పెళ్లి
అడ్డుకోబోయిన భార్యా పిల్లలను చంపుతానన్న యువకుడు హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళకు ఉపాధి కల్పిస్తానని నమ్మించి.. అప్పటికే భార్య ఉన్నప్పటికీ ఆమెను పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... దుర్గానగర్‌కు చెందిన డయానా మూడేళ్ల క్రితం ఆటో డ్రైవర్ మోసెస్ విక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండు నెలల క్రితం మోసెస్ హారిక అనే మహిళను ఇంటికి తీసుకొని రావడంతో ఇంట్లో గొడవ జరిగింది. శనివారం అదే మహిళను ఇంటికి తీసుకొచ్చి భార్య ఎదుటే తాళి కట్టాడు. అడ్డుకోబోయిన డయానాను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించడమే కాకుండా పిల్లలను కూడా చంపుతానని బెదిరించాడు. దీంతో డయానా, ఆమె బంధువులు వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో హారిక తనకు ఉపాధి కల్పిస్తానని నమ్మించాడని, మూడేళ్ల వయసుగల తన కూతుర్ని ఎవరికో అమ్మేశాడని చెప్పింది. తన బిడ్డను ఇప్పించమని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తనకు న్యాయం చేయాలని కోరితే వివాహం చేసుకున్నాడని వివరించింది. డయానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆరని కన్నీటి బొట్టు!
సెప్టెంబర్ 6, 1997 డయానా అంటే.. సుందరరూపమే కాదు... చల్లటి దయాగుణం కూడా. ‘డయానా చనిపోయింది’ అనే వార్త ఒక దేశానికి సంబంధించిన విషాదం మాత్రమే కాలేకపోయింది... అది విశ్వవ్యాప్త విషాదంగా మారిపోయింది. బాగా తెలిసిన అమ్మాయి చనిపోయింది అనే భావనేగానీ, ‘అక్కడెక్కడో బ్రిటన్ యువరాణి చనిపోయిందట’ అని ఎవరూ అనుకోలేదు. ఈరోజు... లండన్‌లో డయానా అంత్యక్రియల వెంట నడిచింది ప్రపంచం. ఎక్కడికక్కడ కన్నీటి వర్షం. వెక్కిళ్ల శబ్దాలు వినబడొద్దు అన్నట్లుగా మోగుతున్న టెనోర్ గంట. ‘ఈ రాచరికపు ఆడంబరం వద్దు’ అన్నట్లుగా కెన్సింగ్టన్ ప్యాలెస్ వైపు చూస్తున్న డయాన నిర్జీవ నేత్రాలు! ‘అందరితో పాటు గుంపులో నడుస్తున్నాను నేను... కానీ ఒంటరిగా’ డయానాకు ఇష్టమై ఈ కవితావాక్యం వెస్ట్‌మినిస్టర్ ఎబెకు వెళ్లే అన్ని దారులలో కన్నీటి శబ్దాల మధ్య వినిపిస్తూనే ఉంది... ఇప్పటికీ! -
సెప్టెంబర్ 6, 1997 ఆరని కన్నీటి బొట్టు!
ఆ నేడు డయానా అంటే.. సుందరరూపమే కాదు... చల్లటి దయాగుణం కూడా. ‘డయానా చనిపోయింది’ అనే వార్త ఒక దేశానికి సంబంధించిన విషాదం మాత్రమే కాలేకపోయింది... అది విశ్వవ్యాప్త విషాదంగా మారిపోయింది. బాగా తెలిసిన అమ్మాయి చనిపోయింది అనే భావనేగానీ, ‘అక్కడెక్కడో బ్రిటన్ యువరాణి చనిపోయిందట’ అని ఎవరూ అనుకోలేదు. ఈరోజు... లండన్‌లో డయానా అంత్యక్రియల వెంట నడిచింది ప్రపంచం. ఎక్కడికక్కడ కన్నీటి వర్షం. వెక్కిళ్ల శబ్దాలు వినబడొద్దు అన్నట్లుగా మోగుతున్న టెనోర్ గంట. ‘ఈ రాచరికపు ఆడంబరం వద్దు’ అన్నట్లుగా కెన్సింగ్టన్ ప్యాలెస్ వైపు చూస్తున్న డయాన నిర్జీవ నేత్రాలు! ‘అందరితో పాటు గుంపులో నడుస్తున్నాను నేను... కానీ ఒంటరిగా’ డయానాకు ఇష్టమై ఈ కవితావాక్యం వెస్ట్‌మినిస్టర్ ఎబెకు వెళ్లే అన్ని దారులలో కన్నీటి శబ్దాల మధ్య వినిపిస్తూనే ఉంది... ఇప్పటికీ! -
ఆ నేడు ఆగస్ట్ 31, 1997
పాపరాట్సీ పొట్టన పెట్టుకుంది! బ్రిటన్ రాకుమారి డయానా కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పారిస్‌లోని ఒక సొరంగ మార్గంలో ఆమె కారు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటాడుతున్న ‘పాపరాట్సీ’ లను (ప్రముఖ వ్యక్తుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీసే ప్రయత్నం చేసేవారు) తప్పించుకునేందుకు కారు డ్రైవర్ అతివేగంగా నడపడంతో కారు గోడకు డీకొని ఈ దుర్ఘటన జరిగింది. భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హారీ... స్కాట్లాండ్లో వేసవి సెలవల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్‌లో ఉండడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కారు ప్రమాదంలో మరణించినవారిలో సంపన్న వ్యాపారి కుమారుడు డోడీ అల్ ఫయేద్ కూడా ఉండడంతో మీడియా ఊహాలకు అంతేలేకుండా పోయింది. ఇరవైయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా డయానా గుర్తింపు పొందారు. -
ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన నవజాత ఆడ శిశువుకు చార్లెట్ ఎలిజబెత్ డయానా అని నామకరణం చేశారు. ప్రజల కోరికమేరకు తల్లిదండ్రులు ప్రిన్స్ విలియం, కేట్లు చిన్నారికి సోమవారం ఆ పేరు పెట్టారు. దివంగత యువరాణి, విలియం తల్లి డయానా స్మృత్యర్థం పాప పేరులో ఆమె పేరు చేరుస్తారని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. పాప పుట్టినందుకు గుర్తుగా లండన్‌లో సైన్యం తుపాకుల వందనం తదితర వేడుకలు నిర్వహించింది. -
బ్రిటన్ యువరాణి డయానాది హత్యా?
లండన్: బ్రిటన్ యువరాణి డయానా కారు ప్రమాదంలో మరణించలేదా? ఆమెను పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? అందులో ఆ దేశ మిలటరీ పాత్ర కూడా ఉందా? ఈ అనుమానాలకు అవకాశమిస్తున్న ఒక సమాచారంపై బ్రిటన్‌కు చెందిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1997 ఆగస్టు 31న డయానా, ఆమె ప్రియుడు అల్ఫాయెద్తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. అది ప్రమాదం కాదని, ఆమెను హత్య చేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. వాటిపై రెండు సార్లు విచారణ జరిపిన ప్రభుత్వం.. అది ప్రమాదమేనని తేల్చింది. కానీ, ఈ సారి మాత్రం అప్పట్లో సైన్యంలో పనిచేసిన ఓ అధికారి.. ‘డయానాను హత్యచేసేందుకు మా యూనిట్ ఏర్పాట్లు చేసింది. అందువల్లే దానిని దాచాల్సి వచ్చింది’ అని తన భార్యతో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ వివరాలను పేర్కొంటూ ఆ సైనికుడి అత్త, మామ కమాండింగ్ అధికారికి లేఖ రాశారు. ఈ సమాచారంలో విశ్వసనీయతను పరిశీలిస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ సీనియర్ పోలీసు అధికారి బెర్నార్డ్ హోగన్ చెప్పారు.