కొన్ని రకాల నైపుణ్యాలు, తెలివితేటల జీన్స్ రీత్యా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ఆ కుటుంబంలో అత్యంత ప్రతిభావంతుడు ఉంటే. ఆ పరంపర అతని తర్వాత తరంలో ఎవరో ఒకరు కొనసాగిస్తుంటారు. వెంటనే అతన్ని అంతకు ముందు జనరేషన్ వ్యక్తితో పోల్చుకుంటూ..ఆ వ్యక్తి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం సహజం. అలానే ఓ ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్‌ని చూడగానే నాటి అందాల యువ రాణి దివంగత డయానాని గుర్తు తెచ్చుకుంటారు అంతా. ఇంతకీ ఎవరా మోడల్ అంటే..?
ఆ మోడల్ పేరు కేథరిన్ కిట్టి ఎలియనోర్ స్పెన్సర్. ఆమె గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చూడటానికి దివంగత యువరాణి డయానాలా అందంగా ఉంటుంది. కిట్టి ఎర్ల్ స్పెన్సర్-విక్టోరియా ఐట్‌కెన్‌ల పెద్ద కుమార్తె. ఇక్కడ కిట్టి తండ్రికి స్వయనా అక్కే వేల్స్ దివంగత యవరాణి డయానా. అంటే కిట్టి స్వయానా.. డయాన మేనగోడలు. బహుశా ఆ జీన్స్ ఆమెలో కూడా ఉంటాయి కాబట్టి కిట్టి డయానాలా ఉండి ఉండొచ్చు.
ఇక కిట్టీ 2015 నుంచి మోడల్‌గా మారింది. ఎస్టీ లాడర్, బల్గారి, వోగ్, రాల్ఫ్ లారెన్, జిమ్మెర్‌మాన్‌లతో సహా ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక బ్రాండ్‌లతో కలిసి పనిచేశారామె. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మార్క్లేల వివాహంలో తొలిసారిగా కిట్టీ పేరు మారు మ్రోగిపోయింది. మరో డయానాలా ఉందే అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టాట్లర్ కవర్‌పై మోడల్‌గా కనిపించిన ఆమెనే కిట్టి అని ప్రపంచమంతా గుర్తించడం ప్రారంభించింది.
ఈ గుర్తింపే కిట్టిని ఫ్యాషన్ కెరియర్ మకుటం లేని రాణిని చేసింది. అయితే కిట్టీ తల్లి విక్టోరియా ఐట్కెన్ కూడా మాజీ బ్రిటిష్ మోడలే కావడం విశేషం. ఇక కిట్టి మోడలింగ్ ఏజెన్సీ స్టార్మ్ మేనేజ్‌మెంట్‌కు సంతకం చేయడమే గాక ఇటాలియన్ లగ్జరీ పవర్‌హౌస్ డోల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా ఉంది.
వ్యక్తిగత జీవితం..
బిలియనీర్ మైఖేల్ లూయిస్‌ని పరిణయమాడింది. అంతేగాదు తన వివాహ సమయంలో లగ్జరీ బ్రాండ్ ఫ్యాషన్ హౌస్ నుంచి డికాడెంట్ గౌనుని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక కెరీర్ పరంగా.. ఆమె లండన్ రీజెంట్స్ యూనివర్శిటీలో లగ్జరీ బ్రాండ్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేకత కలిగిన యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. కాగా, 33 ఏళ్ల కిట్టి ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ పేరుని, ఫోటోని షేర్ చేసుకుంది.
(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!)
Comments
Please login to add a commentAdd a comment