'మగాళ్లపై రేప్ కేసులు పెట్టడం ఫ్యాషన్గా మారింది' | Shiv Sena backs DIG accused of raping a model; says slapping rape charges is now a 'fashion' | Sakshi
Sakshi News home page

'మగాళ్లపై రేప్ కేసులు పెట్టడం ఫ్యాషన్గా మారింది'

Published Sat, Aug 2 2014 3:07 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

'మగాళ్లపై రేప్ కేసులు పెట్టడం ఫ్యాషన్గా మారింది' - Sakshi

'మగాళ్లపై రేప్ కేసులు పెట్టడం ఫ్యాషన్గా మారింది'

ముంబై: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరస్కార్కు శివసేన బాసటగా నిలిచింది. మగాళ్లతో అత్యాచార కేసులు పెట్టడం ఫ్యాషన్గా మారిందని శివసేన పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొంది.

'ఏదో జరిగిపోయిందన్నట్టుగా చూపడానికి ఉన్నత వర్గాలకు చెందిన వారిపై అత్యాచార, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసే సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇదో ఫ్యాషన్గా మారిపోయింది. డీఐజీ సునీల్ కుమార్ ఎన్నో ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేశారు. ఓ మాడల్ ఆరోపణలు చేయగానే ఆయన రాత్రికి రాత్రే విలన్గా మారిపోయారు. వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇవి ఆయుధాలుగా మారుతున్నాయి' అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ మోడల్ ఫిర్యాదు మేరకు డీఐజీపై అత్యాచార కేసు నమోదు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement