మోడల్ను పెళ్లి పేరుతో మోసగించి.. బుక్కయ్యాడు | Love, sex aur dhokha: TV actor booked for rape after refusing to marry model | Sakshi
Sakshi News home page

మోడల్ను పెళ్లి పేరుతో మోసగించి.. బుక్కయ్యాడు

Published Mon, Jun 13 2016 6:08 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

మోడల్ను పెళ్లి పేరుతో మోసగించి.. బుక్కయ్యాడు - Sakshi

మోడల్ను పెళ్లి పేరుతో మోసగించి.. బుక్కయ్యాడు

ముంబయి: సినిమా పిచ్చితో ముంబయి నగరంలోకి అడుగుపెట్టిన ఓ యువతి ఓ టీవీ నటుడి చేతిలో మోసపోయింది. నగరంలో మోడల్గా ఉన్న తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు లైంగికదాడి జరిపి మోసం చేయడంతో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్కు చెందిన ఓ యువతి ఎలాగైనా నటిగా మారాలని 2011 ముంబయిలో అడుగుపెట్టింది. తొలుత అవకాశాలకోసం ఎంతో ప్రయత్నించింది.

చివరకు చిన్నచిన్నవాటిల్లో మోడల్గా పనిచేస్తూ ఓ మేనేజ్ మెంట్ కంపెనీ కింద ప్రస్తుతం మోడల్ గా పనిచేస్తోంది. ఆమెకు 2013లో ఆర్మాన్ తాహిల్ అనే టీవీ నటుడితో ఓ దేవాలయం వద్ద పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులకు చెప్పిన ఫిర్యాదులో తాహిల్ చాలా మంచివాడని, 2015లో తన ఇంటికి కూడా తీసుకెళ్లాడని, కానీ కొద్ది రోజుల తర్వాత అతడి ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, డబ్బు డిమాండ్ చేయడంతో ఇప్పటికే లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పింది. అయితే, తాహిల్ తనతోనే కాకుండా మరో మహిళతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులకు వివరించింది. ఈ నెల 8న కూడా పెళ్లి చేసుకోవాలని కోరగా అతడు నిరాకరించడంతో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పోలీసులు తాహిల్ పై సెక్షన్ 376(లైంగిక దాడి), సెక్షన్ 420 (మోసం), 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement