
ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన నవజాత ఆడ శిశువుకు చార్లెట్ ఎలిజబెత్ డయానా అని నామకరణం చేశారు. ప్రజల కోరికమేరకు తల్లిదండ్రులు ప్రిన్స్ విలియం, కేట్‌లు చిన్నారికి సోమవారం ఆ పేరు పెట్టారు. దివంగత యువరాణి, విలియం తల్లి డయానా స్మృత్యర్థం పాప పేరులో ఆమె పేరు చేరుస్తారని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. పాప పుట్టినందుకు గుర్తుగా లండన్‌లో సైన్యం తుపాకుల వందనం తదితర వేడుకలు నిర్వహించింది.