daughters name
-
నేమ్ ప్లేట్: ఇంటిపేరు ఆడపిల్ల
మన దేశంలో ఇంటి పేరు, ఇంటి వాకిలి పేరు నాన్నదే ఉంటుంది. అమ్మ పేరు దాదాపుగా ఉండదు. కూతురి పేరు అసలే కనిపించదు. కూతురూ ఇంటి సభ్యురాలే అనే భావన ఆమెకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అబ్బాయిల వైఖరిలో మార్పు తెస్తుంది. అందుకే నార్త్‌లో చాలాచోట్ల కుమార్తె నేమ్‌ప్లేట్ పెట్టే ఆనవాయితీ మొదలైంది. ఇటీవల నాగ్‌పూర్ చుట్టుపక్క పల్లెల్లో 2100 ఇళ్లకు అమ్మాయిల పేర్లు సగౌరవంగా అమర్చారు. ఇంకా ఈ ఆనవాయితీ దక్షణాదికి రాలేదు. వివరాలుమన ఇళ్లల్లో ఆడపిల్లలు ఉన్నారో లేరో అన్నట్టుగా ఎందుకు ఉండాలి... వారు తమ అస్తిత్వంతో ఎందుకు ఉండకూడదు.. ఆత్మవిశ్వాసంతో ఎందుకు ఉండకూడదు... గుర్తింపుతో ఎందుకు ఉండకూడదు... ఈ ప్రశ్నలు‘మేజిక్ బస్ ఫౌండేషన్’ బా«ధ్యురాలు ధనశ్రీ బ్రహ్మేకు వచ్చాయి. ఐక్యరాజ్య సమితిలో చాలా కాలం పని చేశాక భారతదేశంలో పారిశ్రామికప్రాంతాల్లోని బస్తీల్లో, వెనుకబడిన పల్లెల్లో లైంగిక వివక్షను రూపుమాపి టీనేజ్ ఆడపిల్లల వికాసానికి కృషి చేయాలని ధనశ్రీ ‘మేజిక్ బస్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఆడపిల్ల తను ఎదిగే వయసులో వెనుకబడితే జీవితాంతం వెనుకబడుతుందని ఆమెకు ఆత్మవిశ్వాసం అవసరమని భావించారు. అందుకే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఆడపిల్ల గురించి ఆలోచించరుమన దేశంలో ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటేప్రాముఖ్యత అంతా అబ్బాయికే ఉంటుంది. అమ్మాయిని మామూలు బడిలో... అబ్బాయిని మంచి బడిలో వేయడం, సౌకర్యాలు, చదువు కొనసాగింపు... ఇవన్నీ అమ్మాయి పట్ల వివక్షను చూపుతాయి. బడి మాన్పించి పెళ్లి చేసే బెడద ఎలాగూ ఉంటుంది. ఆస్తిలో భాగం గురించిన ఆలోచన ఉండదు. వీటన్నింటి దృష్ట్యా పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోవడం తప్ప ఆడపిల్ల వికాసం సంపూర్ణం కాదు. ‘నేనూ ఇంటిలో సమాజంలో భాగమే. నాకంటూ ఒక స్థానం ఉంది. నా బాధ్యతలు నాకున్నా నాకంటూ కొన్ని కలలు ఉంటాయి అని అమ్మాయిలకు అనిపించాలి’ అంటారు ధనశ్రీ. ‘ఇంటికి అమ్మాయి నేమ్‌ప్లేట్ పెడితే కొద్ది మార్పు సాధ్యమే’ అనుకున్నారామె.ఎందుకు పెట్టాలి?మహారాష్ట్రలోని నాగపూర్ శివార్లలో ఉన్న కలమేశ్వర్ పారిశ్రామిక వాడను ఆనుకుని 108 గ్రామాలు ఉన్నాయి. వాటన్నింటిలో రోజు కూలీలు, కార్మికులే ఉంటారు. వీరికి ఆదాయం చాలా తక్కువ. అందువల్ల ఆర్థిక దృష్టికోణంలో అబ్బాయికి ఇచ్చేప్రాధాన్యం అమ్మాయికి ఇవ్వరు. అందుకే అమ్మాయిలు తెర వెనుకే ఉండిపోతారు. వారికి ఆత్మవిశ్వాసం కల్పించేందుకు 12 నుంచి 16 ఏళ్లు వయసున్న అందరు అమ్మాయిల డేటా తీసుకుని వారి ఇళ్లకు వెళ్లి మీ అమ్మాయి నేమ్‌ప్లేట్ ఇంటికి పెట్టండి అని ఫౌండేషన్ కార్యకర్తలు అడిగితే అందరి నుంచి ఎదురైన ప్రశ్న ‘ఎందుకు పెట్టాలి’ అని. ఎందుకంటే ఇంటికి నేమ్‌ప్లేట్ తండ్రిదే ఉంటుంది. లేదంటే కొడుకుది. కూతురిది ఉండదు. ‘అయితే ఇంటికి కూతురు కూడా హక్కుదారని... ఆమె పెరిగే ఇంటికి ఆమె పేరు పెట్టుకునే హక్కు ఉంటుందని కార్యకర్తలు గట్టిగా చెప్తారు’ అని తెలిపారు ధనశ్రీ. అంతేకాదు ఊరి పెద్దలతో, పంచాయితీ పెద్దలతో, స్కూలు టీచర్లతో చెప్పించి ఒప్పించారు.పెనుమార్పుకలమేశ్వర్ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లో 12 నుంచి 16 ఏళ్లు ఉన్న ప్రతి అమ్మాయి ఇంటికి ఆ అమ్మాయి పేరుతో నేమ్‌ప్లేట్ తయారు చేయించి వాటిని ఇంటి వాకిలికి అమర్చే ఏర్పాటు చేశాక ఆడపిల్లల్లో వచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇదో కొత్త గుర్తింపు గౌరవం అయ్యింది. ‘మా అన్నయ్య నాతో నీ పేరు ఎందుకు పెట్టాలి అనడిగాడు... నీ పేరు నువ్వు పెద్దయ్యాక నీ ఇంటికి ఎలాగూ పెట్టుకుంటావు... ఇప్పుడు నా పేరు పెట్టకపోతే ఎక్కడా ఎప్పుడూ పెట్టరు అని సమాధానం ఇచ్చాను’ అని 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అంది. ఈ 18 పల్లెల్లో 2100 గడపలకు అమ్మాయిల నేమ్ప్లేట్లు ఇవాళ కళకళలాడుతూ కనపడుతున్నాయి. ‘ఈ నేమ్ప్లేట్లు పెట్టాక తల్లిదండ్రులు మమ్మల్ని చదివించాలని, మా మాటకు విలువ ఇవ్వాలని, మాకూ గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు’ అన్నారు అమ్మాయిలంతా. ‘చుట్టుపక్కల పల్లెల వాళ్లు ఈ పల్లెలకు వచ్చి నేమ్ప్లేట్లు చూసి మేమూ పెట్టిస్తాం అని వెళుతున్నారు’ అని వారు తెలిపారు. అదే అమ్మాయి... కాని ఒక చిన్న గుర్తింపుతో అడుగున నిలబడే దశ నుంచి సమాన దశకు వచ్చి నిలబడేలా చేసింది ఈ నేమ్‌ప్లేట్.దక్షిణాదిలో ఇవాళ్టికీ జరుగుతున్న కొన్ని వివక్షలను గమనిస్తే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ ఎక్కువ అవసరం అని భావించడంలో తప్పు లేదు. -
అక్కడ ఇళ్లన్నీ ఆడపడుచుల పేరు మీదనే.. మాతృస్వామ్యం కాదు సుమా!
Nameplate campaign: ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అంటారు. అష్టకష్టాలేమి ఖర్మ... అరవై నాలుగు కష్టాలైనా పడి ఇల్లు కట్టుకుంటారు చాలామంది. అంతకష్టపడి కట్టుకున్న ఇంటికి తమకు ఇష్టమైన దైవానికి అంకితం చేస్తూ ఆ పేరు పెట్టుకుంటారు కొందరు. ప్రకృతికి సంబంధించిన పేర్లతో తమ భావుకత్వాన్ని చాటుకుంటారు ఇంకొందరు. ఒక ఇంటి ఉనికి ఆ పేరులో ప్రతిధ్వనిస్తుంది. ఇక విషయంలోకి వద్దాం... హరియాణాలోని హిస్సార్ జిల్లాలోని మయ్యార్ అనే చిన్న గ్రామం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద స్ఫూర్తి ఇస్తోంది. దీనికి కారణం... ప్రతి గ్రామస్థుడు తన ఇంటికి కూమార్తె లేదా కోడలు పేరు పెట్టడం. దీనికి ‘నేమ్‌ప్లేట్ క్యాంపెయిన్’ అని నామకరణం చేశారు. మంచి పని కోసం గ్రామం అంతా ఒక తాటిపై నిలబడింది అంటారు. ఆ తాటిపై నుంచి రకరకాలుగా జారేవారు కూడా ఉంటారు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. ‘నేమ్‌ప్లేట్ క్యాంపెయిన్’కు ముందు ఇలాంటి సమస్యే ఎదురైంది. ‘ఎవరి పేరో ఎందుకు, నా పేరే పెట్టుకుంటాను. రెక్కలు ముక్కలు చేసుకొని, పైసా పైసా కష్టపడి ఇల్లు కట్టాను’ అంటారు ఒకరు. ‘నాకు ఆడపిల్లలెవరూ లేరు. కోడలు ఇంకా రాలేదు’ అని సాకు వెదుక్కుంటారు మరొకరు. అంతమాత్రాన ఎవరితో ఎవరు పోట్లాడింది లేదు. మంచి మాట కంటే మంచి పరిష్కారం ఏముంటుంది! ‘మనలో మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడానికి నేమ్‌ప్లేట్ క్యాంపెయిన్ ఉపయోగపడుతుంది’ అంటూ ఊరి పెద్దలో ఒకరు ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడు సావధానంగా విన్నవారు తప్ప ‘అలా ఎలా అవుతుంది!’ అని అడ్డుపడ్డవారు లేరు. మంచి మాట కదా! చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! ‘ఎక్కడి వరకో ఎందుకో... మన ఊరు విషయానికి వద్దాం’ అంటూ ఆ ఊళ్లో తమ కుటుంబం కోసం కష్టపడిన మహిళలు, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డిన మహిళల నిజజీవిత కథల గురించి ప్రస్తావించినప్పుడు... వ్యతిరేకించినవారు లేరు. ఎందుకంటే నలుగురికి ఉపకారం చేసే మంచి మాట కదా! ఎట్టకేలకు ఊరంతా ఏకమైంది... ‘నేమ్‌ప్లేట్’ ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఆడపడుచు పేరు. ప్రతి ఇల్లు మహిళ పేరుతో గుర్తించబడుతుంది. విశేషమేమిటంటే ఇప్పుడు మయ్యార్ చుట్టుపక్కల గ్రామాలకు స్ఫూర్తి ఇస్తుంది. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
అమ్మాయి పేరులోనే ఉన్నది గుర్తింపు
మన సమాజాలలో కూతురి పేరును ఇంటి బయట నేమ్ప్లేట్గా బిగించడం ఎంత విస్తృతంగా చూస్తాం? చాలా కొన్ని ఇళ్లకి భార్య పేరుతో ఇంటి పేరు పెట్టడం కనిపిస్తుంది. కాని ఎక్కువ ఇళ్లకు భర్త ఉద్యోగాన్ని, హోదాని, ఆ ఇంటి యజమాని ఎవరో తెలిపే వివరాన్ని చెప్పే నేమ్ప్లేట్లే ఉంటాయి. న్యాయమూర్తులైనా, పోలీస్ ఆఫీసర్లైనా, ఐ.ఏ.ఎస్లైనా, టీచర్లైనా, వ్యాపారవేత్తలైనా ఎవరైనా సరే వారి పేరు ఇంటి బయట నేమ్ప్లేట్గా పెట్టుకుంటారు. ఆ ఇళ్లలో భార్య మంచి ఉద్యోగంలో ఉన్నా ఆమె నేమ్‌ప్లేట్ కనిపించదు. ఇక ఇంట్లో కూతురు ఉంటే ఆ కూతురికి ఆ ఇల్లు ఎప్పటికీ చెందదనే వారసత్వ భావజాలం తరతరాల్లో ఉంది. ‘ఇలా ఉంటే అమ్మాయి పుడితే బెంబేలు పడే రోజులు ఎలా పోతాయి’ అనుకున్నారు ఉత్తరాంచల్ పౌరి గర్వాల్ జిల్లా అధికారులు. దానికి కారణం ఉంది. పౌరి గర్వాల్ జిల్లా కొండ ప్రాంతం. ఆడపిల్ల, మగపిల్లాడు అనే తేడా పెద్దగా అంటని ప్రాంతమే అయినా మెల్లగా పరిస్థితులు మారాయి. అక్కడ 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1103 మంది స్త్రీలు ఉండేవారు. కాని తాజాగా 0–6 ఏళ్ల వయసు పిల్లల లెక్కలు తీసినప్పుడు వెయ్యి మంది అబ్బాయిలకు 904 మంది అమ్మాయిలే తేలారు. అమ్మాయిల వల్ల ‘పెళ్లి ఖర్చు’ అనేది తల్లిదండ్రుల సమస్య. అమ్మాయి ఏ ఇంట్లో పుట్టినా పెళ్లి తర్వాత ఆమెకు ఆ ఇంటి మీద ఏ హక్కు ఉండదు కదా అని ఆ అమ్మాయిని చేసుకుని వెళ్లేవారి సమస్య. అంటే ఇరువైపుల నుంచి ఆర్థిక విషయంగానే అమ్మాయిని చూసి ఆమె జననాన్ని నిరాకరించే పరిస్థి్థతులు ఏర్పడుతున్నాయి. నేమ్ప్లేట్లను పంచుతున్న జిల్లా యంత్రాంగం ‘అమ్మాయి చదవగలదు. మంచి ఉద్యోగం చేయగలదు. తాను స్వావలంబన పొందడమే కాదు... ఇంటిని, సమాజాన్ని కూడా ముందుకు నడపగలదు. ఆమెకు ఆస్తిలో హక్కు ఉంటుంది. అమ్మాయికి ఇంటిలో సమాన వాటా ఉంటుంది అని పదే పదే చెప్తే తప్ప మనుషులు గ్రహించరు’ అని పౌరి గర్వాల్ యంత్రాంగం గ్రహించింది. వెంటనే వారొక ఉద్యమాన్ని మొదలెట్టారు. ఆ ఉద్యమం పేరు ‘ఘౌర్ కి పచయన్... నౌని కి నౌ’. అంటే ‘ఇంటి కూతురిని బట్టి.. ఇంటిని గుర్తించు’ అని అర్థం. అధికారులు ఈ ఉద్యమం ప్రకారం జిల్లాలోని పల్లెలకు వెళ్లి సొంత ఇల్లు ఉన్న అన్ని కుటుంబాలతో మాట్లాడటం మొదలెట్టారు. ‘మీ అమ్మాయి పేరుతో నేమ్‌ప్లేట్ చేసిస్తాం. మీ ఇంటి బయట తగిలించండి’ అని కోరసాగారు. ఆశ్చర్యకరంగా ముందుగా ఈ ప్రతిపాదనకు తల్లులే స్పందించారు. ‘మా పెద్దమ్మాయి పేరు పెట్టండి’, ‘మా చిన్నమ్మాయి పేరు పెట్టండి’ అని సూచించసాగారు. ఇందుకు తండ్రులు, ఇళ్లల్లో ఉన్న కుమారులు పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు. ‘నా పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్ దగ్గర నిలబడి నా ఇంటి ఫొటో దిగడం నాకు చాలా ఆత్మవిశ్వాసం ఇచ్చింది’ మథనా గ్రామానికి చెందిన ఆర్తి చెప్పింది. ఆమె సోషియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. ‘ఇక మీదట మా ఇంటిని మా నాన్న పేరుతో కాకుండా ఇది ఆర్తీ ఇల్లేనా అని ఎవరైనా అడగాల్సిందే’ అని ఆ అమ్మాయి సంతోషపడింది. ఆర్తికి ఇంటర్ చదువుతో మానేసిన తమ్ముడు ఉన్నాడు. ఇంకో చెల్లెలు కూడా ఉంది. ‘ఇది మా ముగ్గురి ఇల్లు అనే భావం ఆ కుర్రాడి మనసులో మొదలయ్యేందుకు ఇలాంటి పనులు తోడ్పడతాయి’ అని ఒక ప్రభుత్వ అధికారి అన్నారు. మల్లి అనే ఊళ్లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ముకేష్ కుమార్ ఈ ఉద్యమంలో భాగంగా తన ఇంటికి తన 14 ఏళ్ల కూతురు ‘సిమ్రన్’ నేమ్‌ప్లేట్ బిగించాడు. ‘పూర్వపు రోజులు పోయాయి. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే’ అని అతడు సంతోషంగా అన్నాడు. అతను ఆ మాట అనడంతోటే పక్కనే ఉన్న సిమ్రన్ ‘ఇక నాకు దిగులు పోయింది. నా తల్లిదండ్రులు నన్ను పై చదువులు చదివిస్తారనే భావిస్తున్నా’ అని అంది. ఉత్తరాంచల్‌లో ఆడపిల్లలకు చదువు, ఉపాధి, కెరీర్‌ను ఎంపికను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఘర్షణతో సాధించుకోవాలి. కాని ప్రభుత్వం చేసే ఇలాంటి పనులు, ఆయా సంస్థలు చేసే చైతన్య కార్యక్రమాలు, మీడియా మార్పును తీసుకురాగలవు. ఇప్పుడు ఉత్తరాంచల్‌లో ఇంటింటా వెలుస్తున్న కూతురి పేర్ల నేమ్ప్లేట్లు ఆ సంగతినే చెబుతున్నాయి. – సాక్షి ఫ్యామిలీ -
ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన నవజాత ఆడ శిశువుకు చార్లెట్ ఎలిజబెత్ డయానా అని నామకరణం చేశారు. ప్రజల కోరికమేరకు తల్లిదండ్రులు ప్రిన్స్ విలియం, కేట్లు చిన్నారికి సోమవారం ఆ పేరు పెట్టారు. దివంగత యువరాణి, విలియం తల్లి డయానా స్మృత్యర్థం పాప పేరులో ఆమె పేరు చేరుస్తారని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. పాప పుట్టినందుకు గుర్తుగా లండన్‌లో సైన్యం తుపాకుల వందనం తదితర వేడుకలు నిర్వహించింది.