మళ్లీ తండ్రి కాబోతున్న ప్రిన్స్
లండన్: బ్రిటన్ యువరాజు విలియం మూడోసారి తండ్రి కాబోతున్నారు. విలియం, క్యాథరిన్ మిడిల్‌టన్ దంపతులకు ఇప్పటికే ప్రిన్స్ జార్జి(4), ప్రిన్సెస్ చార్లెట్(2) లనే ఇద్దరు సంతానం ఉన్నారు. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి మూడో సారి తల్లి కాబోతున్నారని కెన్సింగ్టన్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. రాజకుటుంబమంతా ఈ వార్తతో చాలా ఆనందంతో ఉందని తెలిపింది.
ప్రస్తుతం మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడుతున్న కేట్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నట్లు ప్యాలెస్ వర్గాలు వివరించాయి. కాగా కేట్ 2013 జూలైలో తొలి బిడ్డ ప్రిన్స్ జార్జికి జన్మనిచ్చారు. 2015 మే లో రెండవ సంతానంగా ప్రిన్సెస్ చార్లెట్ ఎలిజబెత్ డయానా పుట్టింది.
