
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో బుల్లి వారసుడు వచ్చాడు. ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్ సోమవారం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. లండన్‌లోని సెయింట్ మెరీ ఆస్పత్రిలో కేట్ మూడో బిడ్డను ప్రసవించారు.
తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని రాయల్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్స్, కేట్ దంపతులకు బాబు జార్జ్, పాప చార్లెట్.. ఉన్నారు. మూడో బిడ్డను ప్రసవించే సమయంలో కేట్ పక్కన ప్రిన్స్ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. కేట్ తాజాగా జన్మనిచ్చిన శిశువు బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబేత్ ఆరో మునిమనవడు కాగా.. బ్రిటన్ సింహాసనం అధిరోహించబోయేవారిలో ఐదో వ్యక్తిగా ఉండనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment