మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్‌ | Duchess of Cambridge gives birth to baby boy | Sakshi
Sakshi News home page

మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్‌

Published Tue, Apr 24 2018 2:50 AM | Last Updated on Tue, Apr 24 2018 2:50 AM

Duchess of Cambridge gives birth to baby boy - Sakshi

పసిబిడ్డను ఎత్తుకుని ఆస్పత్రి నుంచి బయటికొస్తున్న కేట్‌

లండన్‌: బ్రిటన్‌ యువరాజు విలియమ్‌ భార్య, యువరాణి కేట్‌ మిడిల్‌టన్‌ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని కెన్సింగ్‌టన్‌ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి. ఇప్పటికే రాజ దంపతులకు నాలుగేళ్ల రాకుమారుడు జార్జ్, రెండేళ్ల రాకుమారి చార్లెట్‌లు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన రాకుమారుడి పేరు ఇంకా ఖరారు చేయలేదు. బ్రిటిష్‌ సింహాసనం అధిష్టించే వారిలో నూతన రాకుమారుడు ఐదో వారసుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement