కేట్‌ మిడిల్టన్‌కు క్యాన్సర్‌ | Kate Middleton reveals cancer diagnosis | Sakshi
Sakshi News home page

కేట్‌ మిడిల్టన్‌కు క్యాన్సర్‌

Published Sun, Mar 24 2024 6:05 AM | Last Updated on Sun, Mar 24 2024 6:05 AM

Kate Middleton reveals cancer diagnosis - Sakshi

కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు వెల్లడించిన కేట్‌

లండన్‌: బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ (42) క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. పొత్తికడుపు ఆపరేషన్‌ తర్వాత జనవరి నుంచి మీడియా ముందుకు రాని మిడిల్డన్‌ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికార్లు చేస్తుండటం తెలిసిందే.

క్యాన్సర్‌కు కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కేట్‌ శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె ఏప్రిల్‌ దాకా విధులకు దూరంగా ఉండనున్నారు.  బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 కూడా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడటం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement