ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియమ్స్
లండన్ : రాజ కుటుంబంలో విభేదాలు అంటూ ఓ ఇంగ్లాండ్ వార్తా పత్రిక ప్రచురించిన కథనంపై ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియమ్స్ స్పందించారు. ఆ వార్తా కథనంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రిన్స్ ఆఫ్ ససెక్స్( హ్యారీ), ప్రిన్స్ ఆఫ్ కేంబ్రిడ్జ్(విలియమ్స్) బంధంపై ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కనబర్చుకునే అన్నదమ్ముల గురించి చెడు వార్తలు రాయటం నేరం, ప్రమాదమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రిన్స్ విలియమ్స్ మోసపూరిత బుద్ధి కారణంగానే రాజ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, విలియమ్స్ చేష్టల కారణంగానే హ్యారీ కుటుంబానికి దూరమవుతున్నాడని సదరు పత్రిక కొద్దిరోజుల క్రితం ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment