లండన్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది.
వివరాల ప్రకారం.. బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బకింగ్‌హం ప్యాలెస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో, కింగ్ ఛార్టెస్ సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది.
A statement from Buckingham Palace: https://t.co/zmYuaWBKw6
— The Royal Family (@RoyalFamily) February 5, 2024
📷 Samir Hussein pic.twitter.com/xypBLHHQJb
మరోవైపు.. వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు.
దేశాధినేతల స్పందన..
ఛార్లెస్-3 క్యాన్సర్ బారిన పడడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం మీ వేగవంతమైన రికవరీని కోరుకుంటుంది’ అంటూ రాసుకొచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్ కూడా ఎక్స్ వేదికగా రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Wishing His Majesty a full and speedy recovery.
— Rishi Sunak (@RishiSunak) February 5, 2024
I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv
Comments
Please login to add a commentAdd a comment