మేఘన్-హ్యారీలను ఇంటర్వ్యూ చేస్తోన్న ఓప్రా ఇన్‌ఫ్రే (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
వాషింగ్టన్: అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే నిర్వహించే ఇంటర్వ్యూలంటే ప్రపంచ వ్యాప్తంగా జనాలు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలు సాధరణంగా ఉండవు.. వచ్చిన అతిథులు మనసు విప్పి మాట్లాడేలా చేసే శక్తి ఓప్రా సొంతం. ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం శనివారం ప్రసారం అయిన ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు జనాలు. ముఖ్యంగా బ్రిటన్ ప్రజలు. ఎందుకంటే ఈ సారి ఓప్రా ఇంటర్వ్యూ చేసింది.. రాజకుటుంబం నుంచి వేరు పడిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్‌ని. కనుక ఈ ఇంటర్వ్యూ పట్ల అధిక ఆసక్తి కనబరిచారు.
ఇక యువరాజు హ్యారీ దంపతులు ఓప్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూ శనివారం ప్రసారమయ్యింది. తన క్యారక్టర్‌పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడి మేఘన్ మార్కెల్.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ వివాహం జరిగిన తీరు, ఆ సమయంలో జరిగిన సంఘటనలను మేఘన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, కానీ, ఆర్చ్‌బిషప్‌ను పిలిచి తామే ఆయనతో చెప్పామన్నారు మేఘన్.
‘‘ఈ విషయం, ఈ దృశ్యం ప్రపంచం కోసం, కానీ మా ఇద్దరి మధ్య బంధం ముడిపడిపోయింది’’ అని ఆర్చ్‌బిషప్‌తో చెప్పినట్టు వివరించారు. హ్యారీ, మేఘన్ మార్కెల్‌కు అధికారికంగా 2018 మే 19న బెర్క్‌షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. గాసిప్‌లతో సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చిందని, ఇదే రాజకుటుంబంతో సంబంధాల్లో మలుపు తిప్పిందని అన్నారు. ఇది నిజం కాదని అక్కడ ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ ప్రచారం మాత్రం రివర్స్‌లో జరిగిందన్నారు.
ఇంటర్వ్యూలోని ఆసక్తికర అంశాలు....
మేఘన్-హ్యారీకి తొలుత కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే పుట్టిన బిడ్డ విషయంలో రాజ కుటుంబం దారుణంగా ప్రవర్తించిందని.. ప్రొటోకాల్ ప్రకారం తమ బిడ్డకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని.. పైగా బిడ్డ రంగు గురించి మాట్లాడుకున్నారని తెలిపారు మేఘన్. ప్యాలెస్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు తాను ఒంటిరిగా ఫీలయ్యానని.. చాలా సార్లు చనిపోవాలనిపించింది అన్నారు మేఘన్.
తమ వివాహ సమయంలో తోటి కోడలు కేట్ ఏడ్చిందనే వార్తలను మేఘన్ ఖండించారు. ఈ విషయంలో రివర్స్‌లో ప్రచారం జరిగిందని.. వాస్తవానికి ఏడ్చింది తాను అన్నారు మేఘన్. తన డ్రెస్ విషయంలో కేట్ తనపై కేకలు వేసిందని.. అది తనను చాలా బాధించిందని తెలిపారు. ఈ పరిణామం తర్వాత మీడియాతో తన సంబంధాలు పూర్తిగా మారిపోయాయి అన్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ప్యాలెస్‌లోని వారు ఎన్ని అబద్దాలు ఐనా చెప్తారన్నారే మేఘన్.
తాము రాజ కుటంబం నుంచి విడిపోయి.. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి విడిగా బతకాలని వెల్లడించినప్పటి నుంచి ప్యాలెస్ నుంచి తమకు డబ్బు రావడం ఆగిపోయిందని తెలిపారు హ్యారీ. తన తల్లి డయానా తన కోసం దాచిన సొమ్ముతోనే ప్రస్తుతం కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపారు. సెక్యూరిటీని కూడా తొలగించారన్నారు.
మేఘన్ వల్లనే తాను కుటుంబం నుంచి విడిపోయాననే వార్తల్ని హ్యారీ ఖండించారు. మేఘన్ నా జీవితంలోకి రాక ముందు నుంచే నేను ఈ చట్రం నుంచి బయటపడాలని భావించాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాప్ చేయబడ్డారు. నా తండ్రి, సోదరుడు అందరు ట్రాప్ చేయబడ్డారు.. కానీ వారు బయటపడలేరు.. వారిని చూస్తే నాకు జాలేస్తుంది’’ అన్నారు.
అన్నదమ్ములిద్దరి మధ్య ప్రస్తుతం గ్యాప్ వచ్చిందని.. కానీ కాలమే అన్నింటిని నయం చేస్తుందని తెలిపారు హ్యారీ. ‘‘విలియమ్ అంటే నాకు చాల ప్రేమ.. తను నా సోదరుడు. మేం మా అభిప్రాయలను ఒకరితో ఒకరం పంచుకుంటాము. కానీ మేం ఇద్దరం వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నాం’’ అన్నారు. అంతేకాక త్వరలోనే తమకు ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలిపారు.
చదవండి:
ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు
మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా
Comments
Please login to add a commentAdd a comment