Oprah Winfrey
-
హారిస్ ప్రచారంలో విన్ఫ్రే
మిషిగన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు టీవీ లెజెండ్ ఓప్రా విన్ఫ్రే జత కలిశారు. ఇద్దరూ కలిసి గురువారం మిషిగన్‌లో జరిగిన ‘యునైటెడ్ ఫర్ అమెరికా’పేరిట టాక్‌షో తరహా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యక్ష ప్రసారంలో జెన్నిఫర్ లోపెజ్, క్రిస్ రాక్, జూలియా రాబర్ట్స్, మెరిల్ స్ట్రీప్‌తో సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయ మీడియాకు దూరంగా ఉండే ఓటర్లను చేరుకోవడానికి హారిస్ ఈ ప్రయత్నం చేశారు. దీన్ని ఐక్యత కోసం సాగుతున్న ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ, స్త్రీల పునరుత్పత్తి హక్కులు, వలసలు తదితర కీలకాంశాలపై ఈ సందర్భంగా హారిస్ చర్చించారు. స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి 50,000 డాలర్ల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది తన ప్రణాళికలో భాగమన్నారు. ‘‘ప్రస్తుతం ఇది 5,000 డాలర్లుంది. అంత తక్కువతో ఎవరూ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించలేరు’’అన్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ‘‘నేను తుపాకీ యజమానిని. నా రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌కు కూడా తుపాకీ ఉంది. ఎవరైనా నా ఇంట్లోకి చొరబడితే కాల్చి చంపుతా’’అని నవ్వుతూ చెప్పారు. ట్రంప్‌తో హోరాహోరీయే గానీ... హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ‘‘వారిద్దరూ చొరో 47 శాతంతో సమానంగా కని్పస్తున్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో మాత్రం హారిస్ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు’’అని గురువారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్ పోల్ తెలిపింది. కాకపోతే కమల డెమొక్రటిక్ అభ్యరి్థగా ఎన్నికైనప్పటి నుంచి సంప్రదాయ మీడియాకు దూరంగా ఉంటున్నారని, ఇది ఆమె అవకాశాలను క్లిష్టతరం చేస్తోందని విమర్శకులు అంటున్నారు. ‘‘ఆధునిక అమెరికా చరిత్రలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అతి తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చిన అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా హారిస్, వాల్జ్ నిలిచారు. వాళ్లు కేవలం ఏడు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే పాల్గొన్నారు’’అని ఆక్సియోస్ సంస్థ గురువారం నివేదించింది. ట్రంప్, ఆయన రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్ మాత్రం ఏకంగా 70కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించింది. -
మెరుపు తీగలా మారిపోయిన ఓప్రా విన్ఫ్రే!
ఓప్రా విన్ఫ్రే ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీవీ వ్యాఖ్యాత. ఆమె టీవీ షో ది ఓప్రా టాక్ షో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ షో ఆమెకు గ్లోబల్ సెలబ్రెటీ స్టేటస్ హోదా తెచ్చిపెట్టింది. ఆమె కూడా గత కొంతకాలం ఒబెసిటీ సమస్యలు ఎదుర్కొన్నారు. అధిక బరువుతో ట్రోలింగ్ గురయ్యారు. ఏమైందో ఏమో కొన్నాళ్ల వరకు కనిపించకుండా పోయి సడెన్‌గా స్లిమ్‌గా మారిపోయి అలానాటి ఓప్రాని తలిపించేలా మారిపోయింది. ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఛాలెంజ్‌లు విసురుతు ఎలా బరువు తగ్గించుకోవాలో అందరికీ పాఠాలు చెప్పేస్తోంది. 70 ఏళ్ల విన్ఫ్రే గత కొన్ని దశాబ్దాలుగా భారీ కాయంతో ఇబ్బందు ఎదర్కొంది. చాలామంది ముఖం మీద లావుగా ఉన్నారని అనడం, ట్రోలింగ్ వంటి వాటితో విసుగుపోయింది. అదీగాక 2021లో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ఆమెకు బోలెడెంత్ రెస్ట్ దొరికింది. ఇకం అంతే ఇదే సమయం అనుకుని బరువు తగ్గే విషయంపై దృష్టి పెట్టింది. పూర్తిగా బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. ఆకలిని నియంత్రించుకునేలా వైద్యుల సూచనలతో కొన్ని రకాల మందులు వాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మంచి ఫిటనెస్ నిపుణుల సాయంతో మంచిగా డైట్‌ని ఫాలో అయి బరువు తగ్గినట్లు వెల్లడించారు. ఇప్పుడు తనకెంతో హాయిగా ఉందని ఆనందంగా చెబుతుంది. భారీ కాయం నుంచి నాకిప్పటికీ విముక్తి లభించింది. అందుకోసం ఆమె ప్రతి రోజు ఐదు నుంచి మూడు మైల్లు వాకింగ్, వారాంతరాల్లో 10 మేళ్లకు పైగా నడవటం, రోజుకు గాలన్ నీరు తాగటం వంటివి తీసుకున్నట్లు తెలిపింది. ఎలాగైన తాను తగ్గాలని గట్టిగా సంకల్పించుకుని ఇన్ఫ్ల్యూయెన్షియల్ పర్సనాలిటీగా ఆవిర్భవించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఆమె వైద్యపరంగా బరువు తగ్గేందుకు ఎలాంటి మందులు వాడిందనేది వెల్లడించకపోయినా వైద్యుల సూచనల ప్రకారం డైట్ ఫాలో అయ్యి తగ్గానని పరోక్షంగా చెప్పింది. ఒకనొక దశలో ఎంత సంకల్పశక్తి ఉన్న బరువు తగ్గడం కష్టం అనిపించింది కానీ కఠినమైన ఫిట్నెస్ ఫాలో అయ్యి నిపుణుల సలహాలు తీసుకుంటే పెద్దకష్టమేమి కాదని అంటోంది. ఇప్పుడామె బాగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి ఆదర్శంగా నిలవడమేగాక ఎలా బరువు తగ్గాలో సలహాలు కూడా ఇచ్చేస్తోంది. బరువు తగ్గాలనుకుంగే ఏజ్‌తో సంబంధం లేదని కూడా ఫ్రూవ్ చేసింది ఓప్రా విన్ఫ్రే. (చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..) -
‘ఓప్రా విన్ఫ్రే’షో: అతిథిగా ఇరవై మూడేళ్ళ యువతి!
ఆపిల్ కంపెనీ ఇంటర్నెట్ టీవీ చానెల్ ‘ఆపిల్ ప్లస్’ ప్రారంభం అయిన ఈ పదహారు నెలల్లో ఆ చానెల్ షోలలో అత్యధికంగా వీక్షకుల రేటింగ్ ఉన్న ‘ది ఓప్రా విన్ఫ్రే కాన్వర్జేషన్’ షో మొన్న శుక్రవారం మొదలవగానే ఆ చిన్న తెరకు ఒక పెద్దకళ వచ్చింది! అతిథి ఇరవై మూడేళ్ల అమందా గోర్మన్. ఆతిథ్యమిచ్చినది అరవై ఏడేళ్ల ఓప్రా విన్ఫ్రే. ఇద్దరూ కూడా వయసుతో నిమిత్తం లేని ప్రతిభా సామర్థ్యాలతో ప్రముఖులుగా గుర్తింపు పొందిన (విన్ఫ్రే), పొందుతున్న (అమందా) వారు. ఇద్దరూ నల్లజాతి అమెరికన్ మహిళలు. ఒకరోజు వస్తుంది. ఆ రోజున భయజ్వాల ఛాయ నుంచి బయట పడతాం. కొత్త ఉదయంలోకి..కొత్త వెలుగులోకి వచ్చేస్తాం. వెలుగును ధైర్యంగా చూడాలి. వెలుగును చూసేందుకు ధైర్యం చేయాలి. అమందా ‘ది హిల్ వియ్ క్లైంబ్’ అనే కవితలోని కొంత భాగం కెరీర్లో విన్ఫ్రేతో పోల్చి చూసినప్పుడు అమందా ఇంకా జీవితారంభంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ, ఇంటర్వూ్యలో విన్ఫ్రే ఆమెను అలా అనిపించనివ్వలేదు. ఒక చిన్న పిల్లలా కాక, ఒక వ్యక్తితో మాట్లాడినట్లే విన్ఫ్రే సంభాషణ మొత్తం నడిపారు. ఆ ధోరణి టీవీ వీక్షకులలో విన్ఫ్రేతో సమానంగా అమందా పైన కూడా గౌరవం కలిగేలా చేసింది! ‘‘అమెరికా ఒక గొప్ప ప్రాధాన్యం కలిగి ఉన్న చారిత్రక క్షణాలలోకి ప్రవేశిస్తున్న సమయంలో వర్తమానంలోకి అమందా రావడం జరిగింది! తనను నేను కలుసుకున్న తొలి క్షణంలోనే అమె యవ్వనోత్సానికి మంత్ర ముగ్ధురాలిని అయ్యాను’’ అని అమందా ఇంటర్వూ్య ప్రారంభానికి ముందు చెప్పారు ఓప్రా విన్ఫ్రే! చారిత్రక క్షణాలు అంటే ఆమె ఉద్దేశం.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భం లోనివని. ఆ రోజు జనవరి 20 న అమందా ‘ది హిల్ వియ్ క్లైంబ్’ అనే కవితను చదివి వినిపించారు. అది ఆమె రాసిందే. అయితే బైడెన్ ప్రత్యేక ఆహ్వానంతో అమందాకు లభించిన ప్రాధ్యానం కాదది. ఆ మునుపే ఆమె తన పద్దెనిమిదవ యేట నుంచీ పెద్ద పేరున్న కవయిత్రి. ఆరవ యేట నుంచీ మానవతావాద కవితలు రాస్తున్నారు. ఎంపిక చేసుకున్న కార్యక్రమాలలో మాత్రమే కవితా పఠనం చేస్తూ వస్తున్నారు. ఆ ‘ఎంపిక’ పూర్తిగా ఆమెదే. గత ఏడాది జూలై 4 న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా ఆమె తన ‘ఇనాగురల్ పొయెట్రీ’ని వినిపించారు. ఆమెకు ప్రారంభోత్సవాల కవయిత్రిగా పేరు. అయితే ఆ కవితలేవీ ఎవరినీ కొనియాడేవి కావు. సమ మానవ భావనను రేకెత్తించేవి. హార్వర్డ్ యూనివర్సిటీ వార్షికోత్సవంలోనైతే ఆమె కవితకు ప్రొఫెసర్లు సైతం ప్రణమిల్లారు. ‘నా కవిత జీవితకాలం ఒక రాత్రి. కానీ హృదయాన్ని స్పృశిస్తుంది’ అని అమందా అంటుంటారు. ఆమె ఒక కార్యక్రమానికి ఒక కవితను మాత్రమే రాస్తారు. ఆమెకు ఇష్టమైన కవులు ఎలిజబెత్ అలెగ్జాండర్, రిచర్డ్ బ్లాంకో. వాళ్లిద్దరూ ఆమె కన్నా రెండింతల వయసు ఉన్నవాళ్లు. తరచు వెళ్లి వాళ్లను కలుస్తుంటారు అమందా. టీనేజ్లోనే అమందా తొలి కవితా సంకలనం వెలువడింది. ‘ది వన్ ఫర్ హూమ్ ఫుడ్ ఈజ్ నాట్ ఇనఫ్’ ఆ పుస్తకం పేరు. ఇంకో రెండు పుస్తకాలు వస్తున్నాయి. వాటిని ప్రచురించేందుకు ప్రసిద్ధ వైకింగ్ సంస్థ ఆమెతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుని ఉంది. ఇవన్నీ తెలిసిన విషయాలే. తాజాగా ఓప్రే విన్ఫ్రే ఇంటర్వూ్య మూలంగా తెలిసిన కొత్త సంగతి ఏమిటంటే.. అమందా భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలిగా పోటీ చేయబోతున్నారు! ఆ మాత్రం ఫైటింగ్ స్పిరిట్ లేకుంటే విన్ఫ్రే ఎవర్నైనా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? విన్ఫ్రే ఇంటర్వ్యూ చేయడం కూడా అమందాకు ఒక పెద్ద ప్రశంసాపత్రమే. లేదా ఒక అవార్డు అనుకోవచ్చు. విన్ఫ్రే ఏ స్థాయి వ్యక్తులతో టీవీ స్క్రీన్‌పై సంభాషిస్తారో ప్రపంచానికి తెలియంది కాదు. ఇటీవల ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్‌తో ఓప్రా చేసిన ఇంటర్వూ్య సంచలనం రేపింది. విన్ఫ్రే ప్రశ్నలు అలా ఉంటాయి మరి. అతిథుల గౌరవం తగ్గకుండా వాళ్లకు తెలియకుండానే వాళ్ల గుండె లోతుల్లోకి మాటలతో ఈదుకుంటూ వెళ్లి సడీ చప్పుడూ లేకుండా మళ్లీ బయటికి వచ్చేస్తారు. ఇప్పుడీ ఆపిల్ ప్లస్ చానల్లోనే వన్ఫ్రే ఇంతవరకు ఇంటర్వ్యూ చేసిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హాలీవుడ్ నటుడు మాథ్యూ మెకానీ, అమెరికన్ గాయకుడు, గేయ రచయిత స్టీమ్ వండర్, అమెరికన్ రచయిత ఇబ్రహిం ఎక్స్.కెండీ వంటి వారు ఉన్నారు. వాళ్లందరిలోకి చిన్న అయినా కూడా వాళ్లందరిలా సృజన ఉన్న కారణంగా అమందాకు.. వారితో సమానంగా ప్రాధాన్యం లభిచింది. ఇంతకీ అమందా ఏమంటారు? 2036 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట. ఆ ఏడాదికి ఆమె 35 ఏళ్లు దాటి ఉంటారు. అమెరికా ప్రెసిడెంటుగా పోటీ చేయడానికి అవసరమైన కనీస వయసు అది. అమందా బ్లాక్ క్యాథలిక్. లాస్ ఏంజెలిస్‌లోని సెయింట్ బ్రిగిడ్ క్యాథలిక్ చర్చిలో సభ్యురాలు. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కవితను చదివి వినిపించిన రెండో రోజు ఆమె ‘ది లేట్ లేట్ షో విత్ జేమ్స్ కార్డెన్’ షోలో కనిపించారు! దేవుడు సృష్టించిన వారిలో కోర్డన్ తన అభిమాన మానవుడు’ అని అమందా ఆ షోలో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. ‘అమందా ఒక పవర్‌హౌస్ అనీ, ఆమె జీవిత చరిత్ర ప్రతి రెండు వారాలకు పాతబడిపోతుందని స్వచ్ఛంద ‘అర్బన్ వర్డ్ ఎన్.వై.సి.’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ సిరీల్లే అభినందించారు. అమందాకు అన్నిట్లోనూ తల్లి జోన్ విక్స్ స్ఫూర్తి. కవితలు రాయడానికి, మానవ హక్కుల ఉద్యమాల్లో పని చేయడానికి కూడా. కూతురికి అంతగా ప్రేరణ ఇచ్చే ఆ తల్లి అమందా రాజకీయాల్లోకి వెళతానంటే వద్దంటుందా! జోన్ విక్స్ ఆరో తరగతి ఇంగ్లిష్ టీచర్. అమందాను, అమందా ఇద్దరు అక్కచెల్లెళ్లను సింగిల్ మదర్‌గా పెంచి పెద్ద చేశారు. -
ప్రిన్సెస్ గౌరమ్మ
స్వేచ్ఛను కోరుకునే మనసు ప్రేమలోనైనా బందీగా ఉండలేదు. బ్రిటన్ కుటుంబంలో రాణిలానూ ఉండిపోలేదు. భర్త నుంచి డయానా, బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి మేఘన్.. ఇద్దరూ స్వేచ్ఛను కోరుకున్న వాళ్లే. ఆ స్వేచ్ఛ కోసమే వాళ్లు తమ రెక్కల్ని తెంపుకున్నారు! వాళ్లిద్దరికంటే ముందు ఆ అంతఃపురంలో గౌరమ్మ అనే బాలిక.. ‘ప్రిన్సెస్’ గా స్వేచ్ఛ కోసం పెనుగులాడింది. తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన భర్తలోని తండ్రి ప్రేమను భరించలేక, క్వీన్ విక్టోరియా కనురెప్పల కింద భద్రంగా జీవించలేక పారిపోవాలని అనుకుంది. సాధ్యం కాలేదు. ప్రేమకు, భద్రతకు బందీగా 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది! ఎవరీ ప్రిన్సెస్ గౌరమ్మ? ప్యాలెస్‌లోకి ఎలా దారి తప్పింది? మేఘన్ రాణివాస జీవితానికి పూర్వఛాయలా అనిపిస్తున్న గౌరమ్మ అసలు ఏ ఊరి చిన్నారి?! ఎవరి పొన్నారి? అన్నమూ నీళ్లూ లేకున్నా మనుషులు కొన్నాళ్లు జీవించి ఉండగలరు. ప్రేమ లేని చోట ఒక్కక్షణం కూడా ఉండలేరు. అది పూరిల్లు అయినా, అంతఃపురం అయినా! లేడీ డయానాకు బకింగ్ హామ్ ప్యాలెస్‌లో ప్రేమ లభించలేదు. ఆమె కోరుకున్న ప్రేమ.. ప్యాలెస్ నుంచి కాదు. భర్త నుంచి. చివరికి మానసికంగా భర్తకు, ప్యాలెస్‌కు కూడా దూరం అయ్యారు డయానా. ప్రేమ లేని జీవితం భారమై, దుర్భరమై ప్రేమ కోసం పరుగులు తీస్తూ బతుకునే పోగొట్టుకున్నారు. 1997 ఆగస్టు 31న ప్యారిస్ లో ఆమె ప్రయాణిస్తున్న కారు టన్నెల్ రోడ్డుకు ఢీకొని మరణించారు. బ్రిటన్ ప్యాలెస్ ఎన్నటికీ మరువలేని విషాదం అది. విషాదం కన్నా కూడా విపత్తు. రాజవంశానికి అప్రతిష్టగా మాత్రమే ఆ దుర్ఘటనను ప్యాలెస్ ఆనాడు పరిగణించింది! ∙∙ బ్రిటన్ రాజప్రాసాదం దృష్టిలో అలాంటి అప్రతిష్టనే ఇప్పుడు మేఘన్ మార్కెల్ తెచ్చిపెట్టారు. క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెరికన్ యువతి మేఘన్. భర్త నుంచి దొరికిన ప్రేమ ఆమెకు అతడి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం లభించలేదు. ఉన్నన్నాళ్లు గుట్టుగా ఉన్నారు. ఇంక ఉండలేను అనుకోగానే ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రిన్స్ హ్యారీ ఆమె వైపు గట్టిగా నిలబడ్డారు కనుకే ఆమె స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలిగారు. ప్యాలñ స్ నుంచి మేఘన్ వెళ్లిపోవడాన్ని పెద్ద విషయంగా లెక్కలోకి తీసుకోని రాణిగారు, తామెందుకని రాచకుటుంబంతో తెగతెంపులు చేసుకుని బయటికి వచ్చారో ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో ఆమె చెప్పడాన్ని మాత్రం తలవంపులుగా భావించారు. ఇప్పుడిక ప్రిన్సెస్ గౌరమ్మ వార్తల్లోకి వచ్చారు. అయితే బ్రిటన్ వార్తల్లోకి కాదు. భారతీయ పత్రికల్లోకి. ‘‘పెళ్లితో ఆ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టి నిరాదరణకు గురైన మహిళల్లో డయానా, మేఘన్ మాత్రమే తొలి వ్యక్తులు కారు. పందొమ్మిదో శతాబ్దంలోనే క్వీన్ విక్టోరియా హయాంలో గౌరమ్మ అనే బాలిక ‘ప్రిన్సెస్’గా ఆ బంగారు పంజరంలో చిక్కుకుని బయటికి వచ్చే దారిలేక పారిపోయేందుకు ఆలోచనలు చేసిందని చరిత్రకారులు నాటి సంగతుల్ని మళ్లీ తవ్వి తీస్తున్నారు. ప్రిన్సెస్ గౌరమ్మతో ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ని పోల్చి చూస్తున్నారు. ఎవరీ గౌరమ్మ?! నిజంగానే బ్రిటన్ రాచ కుటుంబం గౌరమ్మ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందా? అది దయలేకపోవడమా లేక కట్టుబాట్లను శిరసావహించమని ఆదేశించడమా? ∙∙ డయానాను పక్కన పెడితే.. బ్రిటన్ రాజకుటుంబంలో వివక్షకు గురైన గోధుమవర్ణ చర్మం గల రెండో మహిళ మేఘన్ మార్కెల్. మొదటి మహిళ ప్రిన్స్ గౌరమ్మ. పదేళ్ల వయసు లో గౌరమ్మ అంతఃపురానికి వచ్చేనాటికి బ్రిటన్ ను క్వీన్ విక్టోరియా పరిపాలిస్తూ ఉన్నారు. గౌరమ్మ తండ్రి కూర్గ్ రాజు చిక్కా వీర రాజేంద్ర. ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అతడిని పదవీచ్యుతుడిని చేసి, సంపదను కొల్లగొట్టారు. అందులో కొంత భాగాన్నయినా తిరిగి తనకు దక్కులా చేయమని విన్నవించుకోడానికీ, తన ముద్దుల కూతురు గౌరమ్మను ఆమె రక్షణ కోసం రాణిగారికి దత్తత ఇవ్వడానికి.. ఆ రెండు కారణాలతో.. ఆయన గౌరమ్మను వెంటబెట్టుకుని వెళ్లి రాణిగారిని కలిశారు. అది 1852వ సంవత్సర ఆరం¿¶ కాలం. మొదటి పని కాలేదు. రెండో పని అయింది. విక్టోరియా రాణి గౌరమ్మను దత్తత తీసుకున్నారు. ‘‘నా తల్లి ఇక మీది. తనని మీలో కలిపేసుకున్నా (బాప్తిజం) అభ్యంతరం లేదు’’ అని కూతుర్ని రాణిగారి చేతుల్లో పెట్టి వెనుదిరిగారు వీర రాజేంద్ర. గౌరమ్మ అందంగా ఉంది. ఇకపై మరింత అందంగా మారబోతోంది. అందం మాత్రమే కాదు అలవాట్లు, ఆచారాలు కూడా. 1852 జూన్‌లో విండ్సర్ క్యాజిల్‌లో (మరొక రాజసౌధం) గౌరమ్మకు రాచ కుటుంబం బాప్తిజం ఇప్పించడం ఆనాటి పత్రికల్లో విశేష ప్రచారానికి నోచుకుంది. రాణిగారితో కలిసి ఉన్న గౌరమ్మ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆనాటి నుంచి గౌరమ్మ ‘ప్రిన్సెస్ గౌరమ్మ’ అయింది. అయితే అది రాణిగారి సంతోషమే కానీ గౌరవ సంతోషం కాదు. ఆ చిన్నారి తన కొత్త పాత్రలో, కొత్త మనుషుల మధ్య, కొత్త ఆచారాల వ్యవహారాలలో ఇమడలేకపోయింది. క్వీన్ విక్టోరియా ఆమెను అమితంగా ఇష్టపడేవారు. అదే ఆ పసిదానికి కష్టాలను తెచ్చిపెట్టింది. చుట్టూ పరిచారకులు ఉండేవారు. తన ఇష్టానుసారం కాలూ చెయ్యి ఆడనిచ్చేవారు కాదు. రాణిగారితో మాటొస్తుందని వారి భయం. అసలు కష్టం ప్రిన్స్ గౌరమ్మకు తన 16వ యేట వచ్చింది. గౌరమ్మను మహారాజా దులీప్ సింగ్‌కు ఇచ్చి చేయాలని రాణి గారు తలపోయడమే ఆ కష్టం. గౌరమ్మ కన్నా పదహారేళ్లు పెద్దవాడు దులీప్‌సింగ్. గౌరమ్మకూ పెళ్లంటే ఇష్టం లేదు. ఎప్పుడు ఆ బంధనాల్లోంచి పారిపోదామా అన్నట్లు ఉండేదా అమ్మాయి. అది గమనించాడు దులీప్‌సింగ్. తనకు ఆమెతో పెళ్లి ఇష్టం లేదన్నాడు. అలా ఆ కష్టాన్ని అతడే తప్పించాడు. అయితే గౌరమ్మకు నిజమైన కష్టం తండ్రిని కలవనివ్వకుండా కట్టడి చెయ్యడం! కలిస్తే మళ్లీ పాతబుద్ధులే వస్తాయని రాణిగారు ఆందోళన చెందేవారట. ‘‘ఎక్కడికైనా పారిపోయి, పనిమనిషిగానైనా బతికేందుకు గౌరమ్మ సిద్ధపడింది’’ అని క్వీన్ విక్టోరియా ఆంతరంగిక కార్యదర్శి ఆ తర్వాతి కాలంలో బహిర్గతం చేసినట్లు చరిత్రకారులు రాశారు. మొత్తానికి ఇప్పుడు మేఘన్‌కు అయినట్లే, అప్పుడు గౌరమ్మ కు అయింది. ఒక్కరైనా ఆమెను పట్టించుకోలేదు. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న ఆ మనసును తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి కల్నల్ జాన్ కాంప్‌బెల్. ప్రిన్స్ గౌరమ్మ కొత్త పరిచారిక లేడీ లోజిన్ సోదరుడే జాన్ కాంప్‌బెల్. ∙∙ కాంప్‌బెల్.. గౌరమ్మ కన్నా 30 ఏళ్లు పెద్ద. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు అక్కడికి రాకపోకలు సాగిస్తుండే దులీప్ సింగ్ గమనించి, రాణిగారికి ఆ విషయాన్ని చేరవేయడంతో క్షణమైనా ఆలస్యం చేయకుండా ఇద్దరికీ వివాహం జరిపించారు. లేడీ లోజిన్ నిర్ఘాంతపోయారు. గౌరమ్మ తమ ఆడపడుచు అవడం లోజిన్కు ఇష్టం లేదు. కానీ రాణిగారి నిర్ణయం! 1861లో ప్రిన్స్ గౌరమ్మకు ఇరవై ఏళ్ల వయసులో ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు ఎడిత్ విక్టోరియా కాంప్‌బెల్ అని పేరు పెట్టారు. తర్వాత మూడేళ్లకు ప్రిన్స్ గౌరమ్మ 1864లో తన ఇరవై మూడవ యేట చనిపోయింది. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది మాత్రం చరిత్రలో నమోదు అవలేదు! కుటుంబ సభ్యుల ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పెనుగులాడిన లేడీ డయానా, మేఘన్ మార్కెల్‌ల జీవితంలోనూ నమోదు కానీ, నమోదు అయ్యే అవకాశం లేని వ్యక్తిగత విషయాలు ఉంటే ఉండొచ్చు. ఓప్రా విన్ ఫ్రేకు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ -
మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు
లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో జాతి వివక్షని ఎదుర్కొంటూ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నటి మేఘన్ మార్కెల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మేఘన్ వెల్లడించిన విషయాలు బ్రిటన్ రాచకుటుంబాన్నే సంక్షోభంలో పడేశాయి. ఈ సంక్షోభ నివారణకు రాణి ఎలిజెబెత్–2 ఒక ప్రకటన కూడా సిద్ధం చేశారని , కానీ ఇంకా దానిని విడుదల చేయడానికి ముందు వెనుక ఆలోచిస్తున్నారంటూ బ్రిటన్‌లో ఓ వర్గం మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఆ ఇంటర్వ్యూలో తమకి పుట్టబోయే బిడ్డపై కూడా రాచకుటుంబం చర్చించుకుందని, ఆ బిడ్డ నల్లగా పుడతాడని, అందుకే ప్రిన్స్ హోదా, భద్రత కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకుందని వెల్లడించారు. మేఘన్ జాతి వివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను అడగ్గా ‘‘నాకు రాణి పట్ల అమితమైన గౌరవ భావం ఉంది. కామన్వెల్త్ దేశాలన్నింటినీ ఏకం చేసి ఉంచినందుకు ఆమెను ఎప్పటికీ ఆరాధిస్తాను’’అని జాన్సన్ పేర్కొన్నారు. ‘‘రాచకుటుంబ విషయాలపై తాను ఎప్పుడూ వ్యాఖ్యానించనని, ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉంటాను’’అని జాన్సన్ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు సర్ కేర్ స్టార్మర్ ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అన్నారు. తూర్పు లండన్‌లో ఒక పాఠశాలని దర్శించడానికి వచ్చిన ఆయన దగ్గర మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించగా ‘‘రాచకుటుంబం ఇలాంటి సంక్షోభంలో చిక్కుకోవడం అత్యంత విచారకరం. మేఘన్ చెప్పిన జాతివివక్ష, ఆమె మానసిక ఆరోగ్యమనేవి అత్యంత తీవ్రమైన అంశాలు. రాచకుటుంబం కంటే ఇవి పెద్ద విషయాలు. 21వ శతాబ్దాంలో బ్రిటన్‌లో జాతివివక్షకు సంబంధించిన ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి’’అని స్టార్మర్ వ్యాఖ్యానించారు. మరోవైపు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ కొన్ని సంవత్సరాల తర్వాత తన కుమార్తె ఇలా మాట్లాడడం చూస్తున్నానని అన్నారు. స్పందించిన బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకంపనలకు కారణమైన ప్రిన్స్ హ్యారీ దంపతుల ఇంటర్వ్యూపై బిట్రన్ రాణి ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. హ్యారీ, మేఘన్ దంపతులు గడిచిన రెండేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసి ఆవేదన చెందుతున్నామనీ, వీటిని వ్యక్తిగతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలయింది. ముఖ్యంగా వర్ణ వివక్షపై వ్యక్త పరిచిన అంశాలు తీవ్రమైనవని పేర్కొంది. తమ కుటుంబానికి హ్యారీ, మేఘన్ దంపతులు ఎప్పటికీ అత్యంత ప్రియమైన వారిగానే ఉంటారని తెలిపింది. చదవండి: (ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా) -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
-
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
లాస్ ఏంజెలిస్/లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలను అనుభవించానని ఆఫ్రికన్ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ వెల్లడించారు. చాలా ఒంటరితనం అనుభవించానని, తన మానసిక వేదనకు పరిష్కారం లేదనిపించిందని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని వెల్లడించారు. ఇక జీవించాలనుకోవడం లేదని హ్యారీతో కూడా చెప్పానన్నారు. ఈ విషయంలో వైద్య సహాయం పొందేందుకు కూడా అవకాశం కల్పించలేదని, దానివల్ల రాజకుటుంబ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చాట్ షోలో పలు సంచలన విషయాలను ఆమె ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో పంచుకున్నారు. అమెరికాలో సీబీఎస్ నెట్వర్క్ చానల్లో ఆదివారం ఆ కార్యక్రమం ప్రసారమైంది. కుటుంబంతో విభేదాల కారణంగా గత సంవత్సరం మార్చిలో ప్రిన్స్ హ్యారీ దంపతులు, తమ ఏడాది కుమారుడు ఆర్చీతో కలిసి రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఓప్రా విన్ఫ్రే కార్యక్రమంలో మేఘన్ భర్త ప్రిన్స్ హ్యారీ కూడా పాల్గొని, పలు రాచకుటుంబ రహస్యాలను వెల్లడించారు. వివాహం తరువాత కొత్తగా రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు కొద్ది రోజుల తరువాత ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయని మేఘన్ తెలిపారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఊహించని స్థాయిలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానన్నారు. నలుపురంగులో పుడితే ఎలా..? ‘పుట్టబోయే చిన్నారి రంగు గురించి రాచకుటుంబం మాట్లాడుకుంది. నేను నలుపు కనుక బిడ్డ కూడా నలుపు రంగులోనే పుడితే ఎలా?’అని వారు ఆలోచించారని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు రాజకుటుంబం నుంచి లభించే ‘ప్రిన్స్’హోదా ఇవ్వకూడదని నిర్ణయించారని, అందువల్ల రాజకుటుంబ సభ్యులకు లభించే భద్రత కూడా అందదని తేల్చేశారని వివరించారు. ఈ విషయాలను హ్యారీ తనతో పంచుకున్నారని, వాటిని జీర్ణించుకోవడం తమకు కొన్నాళ్ల పాటు సాధ్యం కాలేదని తెలిపారు. అయితే, బిడ్డ రంగు గురించిన వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయాన్ని మేఘన్ వెల్లడించలేదు. వారి పేరు చెబితే.. వారి ప్రతిష్టకు భారీగా భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ విషయమై తనతో రాజకుటుంబ సభ్యులు జరిపిన సంభాషణను తాను కూడా బయట పెట్టాలనుకోవడం లేదని హ్యారీ కూడా స్పష్టం చేశారు. కుటుంబం నుంచి దూరంగా వచ్చేసిన తరువాత తన ఫోన్ కాల్స్‌ను కూడా తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ స్వీకరించలేదని హ్యారీ తెలిపారు. అంతకుముందు, నానమ్మ ఎలిజబెత్ రాణితో మూడు సార్లు, తండ్రి ప్రిన్స్ చార్లెస్‌తో రెండు సార్లు మాత్రం మాట్లాడానన్నారు. ‘నా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమే. కానీ తప్పదు. నేను, నా భార్య మేఘన్, కుమారుడు ఆర్చీల మానసిక ఆరోగ్యం కోసం రాజ కుటుంబానికి దూరం కావాలన్న నిర్ణయం తీసుకున్నాను’అని హ్యారీ వివరించారు. అవన్నీ అవాస్తవాలు.. బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయిందని హ్యారీ వివరించారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం దాచిన ఆస్తులే తమను ఆదుకున్నాయన్నారు. తమ వివాహం తరువాత రాజకుటుంబం తనకు, తన భర్తకు సరైన భద్రతను కూడా కల్పించలేదని మేఘన్ ఆరోపించారు. రాయల్ వెడ్డింగ్ సందర్భంగా ఫ్లవర్ గర్ల్ డ్రెసెస్ విషయంలో తన తోటి కోడలు, ప్రిన్స్ విలియం భార్య, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరిన్(కేట్) మిడిల్టన్ తన కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నారన్న వార్తలను ఓప్రా విన్ఫ్రే ప్రస్తావించగా.. అవన్నీ అవాస్తవాలని మేఘన్ తెలిపారు. ‘నిజానికి జరిగింది వేరే. ఆ ఘటనతో నేనే ఏడ్చాను. ఆ తరువాత కేట్ నన్ను క్షమాపణలు కూడా కోరింది’అని వెల్లడించారు. ‘నిజానికి రాయల్ వెడ్డింగ్‌కు మూడు రోజుల ముందే మాకు వివాహం జరిగింది. అది మాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రైవేట్ విషయం’అని మేఘన్ పేర్కొన్నారు. వివాహమైన మొదట్లో బాగానే చూసుకున్నారని, ఆ తరువాతే వారిలో మార్పు వచ్చిందని మేఘన్ వివరించారు. ‘మొదట్లో నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు’అన్నారు. ఎలిజబెత్ రాణితో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల అస్వస్థతకు గురైనప్పుడు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడానని వివరించారు. ‘రాజకుటుంబ క్రియాశీల బాధ్యతల నుంచి తప్పుకుని ఎలిజబెత్ రాణిని బాధపెట్టారా?, ఆమెకు చెప్పకుండా ఆ నిర్ణయం తీసుకున్నారా?’అన్న ప్రశ్నకు.. ఈ విషయమై నానమ్మకు, తనకు మధ్య పలుమార్లు చర్చ జరిగిందని హ్యారీ వెల్లడించారు. నానమ్మ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. పాప పుట్టబోతోంది రెండో సంతానంగా తమకు పాప పుట్టబోతోందని ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు వెల్లడించారు. ‘ఫస్ట్ కుమారుడు. ఇప్పుడు పాప. ఇంతకన్నా ఏం కావాలి? మేం నలుగురం. మాతో పాటు రెండు కుక్కలు. ఇదే మా కుటుంబం’అని హ్యారీ ఆనందంగా వివరించారు. టాక్‌షోలో ఓప్రా విన్ఫ్రే మొదట మేఘన్‌తో కాసేపు మాట్లాడిన తరువాత, వారితో హ్యారీ జతకలిశారు. -
ప్యాలెస్‌లో ఉండగా చనిపోవాలనిపించింది: మేఘన్
వాషింగ్టన్: అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే నిర్వహించే ఇంటర్వ్యూలంటే ప్రపంచ వ్యాప్తంగా జనాలు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలు సాధరణంగా ఉండవు.. వచ్చిన అతిథులు మనసు విప్పి మాట్లాడేలా చేసే శక్తి ఓప్రా సొంతం. ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం శనివారం ప్రసారం అయిన ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు జనాలు. ముఖ్యంగా బ్రిటన్ ప్రజలు. ఎందుకంటే ఈ సారి ఓప్రా ఇంటర్వ్యూ చేసింది.. రాజకుటుంబం నుంచి వేరు పడిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ని. కనుక ఈ ఇంటర్వ్యూ పట్ల అధిక ఆసక్తి కనబరిచారు. ఇక యువరాజు హ్యారీ దంపతులు ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూ శనివారం ప్రసారమయ్యింది. తన క్యారక్టర్‌పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడి మేఘన్ మార్కెల్.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ వివాహం జరిగిన తీరు, ఆ సమయంలో జరిగిన సంఘటనలను మేఘన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, కానీ, ఆర్చ్‌బిషప్‌ను పిలిచి తామే ఆయనతో చెప్పామన్నారు మేఘన్. ‘‘ఈ విషయం, ఈ దృశ్యం ప్రపంచం కోసం, కానీ మా ఇద్దరి మధ్య బంధం ముడిపడిపోయింది’’ అని ఆర్చ్‌బిషప్‌తో చెప్పినట్టు వివరించారు. హ్యారీ, మేఘన్ మార్కెల్‌కు అధికారికంగా 2018 మే 19న బెర్క్‌షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. గాసిప్‌లతో సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చిందని, ఇదే రాజకుటుంబంతో సంబంధాల్లో మలుపు తిప్పిందని అన్నారు. ఇది నిజం కాదని అక్కడ ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ ప్రచారం మాత్రం రివర్స్‌లో జరిగిందన్నారు. ఇంటర్వ్యూలోని ఆసక్తికర అంశాలు.... మేఘన్-హ్యారీకి తొలుత కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే పుట్టిన బిడ్డ విషయంలో రాజ కుటుంబం దారుణంగా ప్రవర్తించిందని.. ప్రొటోకాల్ ప్రకారం తమ బిడ్డకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని.. పైగా బిడ్డ రంగు గురించి మాట్లాడుకున్నారని తెలిపారు మేఘన్. ప్యాలెస్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు తాను ఒంటిరిగా ఫీలయ్యానని.. చాలా సార్లు చనిపోవాలనిపించింది అన్నారు మేఘన్. తమ వివాహ సమయంలో తోటి కోడలు కేట్ ఏడ్చిందనే వార్తలను మేఘన్ ఖండించారు. ఈ విషయంలో రివర్స్‌లో ప్రచారం జరిగిందని.. వాస్తవానికి ఏడ్చింది తాను అన్నారు మేఘన్. తన డ్రెస్ విషయంలో కేట్ తనపై కేకలు వేసిందని.. అది తనను చాలా బాధించిందని తెలిపారు. ఈ పరిణామం తర్వాత మీడియాతో తన సంబంధాలు పూర్తిగా మారిపోయాయి అన్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ప్యాలెస్‌లోని వారు ఎన్ని అబద్దాలు ఐనా చెప్తారన్నారే మేఘన్. తాము రాజ కుటంబం నుంచి విడిపోయి.. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి విడిగా బతకాలని వెల్లడించినప్పటి నుంచి ప్యాలెస్ నుంచి తమకు డబ్బు రావడం ఆగిపోయిందని తెలిపారు హ్యారీ. తన తల్లి డయానా తన కోసం దాచిన సొమ్ముతోనే ప్రస్తుతం కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపారు. సెక్యూరిటీని కూడా తొలగించారన్నారు. మేఘన్ వల్లనే తాను కుటుంబం నుంచి విడిపోయాననే వార్తల్ని హ్యారీ ఖండించారు. మేఘన్ నా జీవితంలోకి రాక ముందు నుంచే నేను ఈ చట్రం నుంచి బయటపడాలని భావించాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాప్ చేయబడ్డారు. నా తండ్రి, సోదరుడు అందరు ట్రాప్ చేయబడ్డారు.. కానీ వారు బయటపడలేరు.. వారిని చూస్తే నాకు జాలేస్తుంది’’ అన్నారు. అన్నదమ్ములిద్దరి మధ్య ప్రస్తుతం గ్యాప్ వచ్చిందని.. కానీ కాలమే అన్నింటిని నయం చేస్తుందని తెలిపారు హ్యారీ. ‘‘విలియమ్ అంటే నాకు చాల ప్రేమ.. తను నా సోదరుడు. మేం మా అభిప్రాయలను ఒకరితో ఒకరం పంచుకుంటాము. కానీ మేం ఇద్దరం వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నాం’’ అన్నారు. అంతేకాక త్వరలోనే తమకు ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలిపారు. చదవండి: ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా -
ఓప్రాపై విరుచుకుపడ్డ ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా మీడియా మొఘల్ ఓప్రా విన్ఫ్రేపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అభద్రతా భావంతో ఉన్న తనపై ఆమె ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆమె గనుక అధ్యక్ష ఎన్నికల్లో గనుక పోటీచేస్తే చిత్తుగా ఓడించి తీరతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్ సలహాదారు అయితే ఓప్రా విన్ఫ్రీ ప్రస్తుతం సీబీఎస్ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఏడాది పాలనపై ఆమె ప్రజా వేదికలను ఏర్పాటు చేసి చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ఆయన స్పందించారు. ‘ఓఫ్రా నాకు బాగా తెలుసు. గతంలో ఆమె నన్ను ఇంటర్వ్యూ చేయటంతో ఆమెను దగ్గరగా పరిశీలించాను. అందులో ఆమె అడిగిన ప్రశ్నలన్నీ పక్షపాతంగానే ఉన్నాయి. ఆమె చేస్తున్న ఆరోపణలు అసంబంద్ధమైనవి. అసత్య ఆరోపణలతో ఆమె ప్రజలను ఆకర్షించాలని చూస్తోంది. ఒకవేళ ఆమె గనుక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే మిగతా వాళ్ల మాదిరే ఓడిపోవటం ఖాయం’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహగానాలు మీడియాలో ఊపందుకున్నాయి. దీనికి తోడు ఆమె సన్నిహితులు కూడా ఆమె పోటీ చేస్తారనే చెబుతున్నారు. కానీ, తొలుత ఈ వార్తలను ఖండించిన ఓప్రా.. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రసంగంలోనూ ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ కూడా గతంలో ఆమె పోటీ చేయనున్న అంశంపై స్పందిస్తూ... ఆమె అంత సాహసం చేస్తుందని తాను అనుకోవటం లేదని వ్యాఖ్యానించారు. -
'ఆమె పోటీకే రారు.. వస్తే నా చేతిలో ఓటమే'
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్ సలహాదారు ఓప్రా విన్ఫ్రీ ‘గట్టిగా యోచిస్తున్నారని’ ఆమె సన్నిహిత మిత్రులిద్దరు చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆమె కచ్చితంగా అధ్యక్ష రేసులో ఉండరని, ఒక వేళ ఉన్నా ఆమె తన చేతిలో ఓడిపోతారని, తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీవర్లీహిల్స్లో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓఫ్రా పాల్గొని ఉత్తేజపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విన్ఫ్రీ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ అంశాన్ని కొన్ని నెలల క్రితం ఓప్రా ప్రస్తావించారని తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమె మిత్రులిద్దరు చెప్పారు. కాగా, దీనిపై వ్యాఖ్యానించేందుకు విన్ఫ్రీ అధికార ప్రతినిధి మాత్రం నిరాకరించారు. అయితే, ఈ విషయంపై ట్రంప్ మాత్రం వెంటనే స్పందించారు. 'ఓఫ్రాను నేను ఇష్టపడతాను. ఆమె అధ్యక్ష బరిలో దిగుతుందని నేను అనుకోవడం లేదు. ఆమె నాకు బాగా తెలుసు. ఓసారి ఆమె నిర్వహించిన కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఒక వేళ ఆమె నిజంగానే బరిలోకి దిగితే నేను కచ్చితంగా ఓఫ్రాను ఓడిస్తాను' అని ట్రంప్ చెప్పారు. -
అమెరికా అధ్యక్ష పీఠంపై ఓప్రా కన్ను?
అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే విషయంపై మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్ సలహాదారు ఓప్రా విన్ఫ్రీ ‘గట్టిగా యోచిస్తున్నారని’ ఆమె సన్నిహిత మిత్రులిద్దరు సీఎన్ఎన్కు వెల్లడించారు. ఆదివారం బీవర్లీహిల్స్లో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొని ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఆ తర్వాతే విన్ఫ్రీ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ అంశాన్ని కొన్ని నెలల క్రితం ఓప్రా ప్రస్తావించారని తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమె మిత్రులిద్దరు చెప్పారు. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి విన్ఫ్రీ అధికార ప్రతినిధి నిరాకరించారు. అమెరికా వినోద రంగంలో విశేష కృషి చేసినవారికిచ్చే సెసిల్ డీమిల్ అవార్డు స్వీకరిస్తూ ఓప్రా అద్భుత ప్రసంగం చేశారని అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుకున్నారు. మీడియాతోపాటు హాలివుడ్లో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులను నిరసిస్తూ సాగుతున్న ‘మీ టూ ఉద్యమం’ ఆమె ప్రసంగంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఎంతో ఆశావహ దృక్పథంతో, ‘ ఈ కొత్త రోజున ఆశారేఖ కనిపిస్తోంది’ అన్న మాటలు ఆమె మరో కోర్కెకు(అధ్యక్షపదవి) అద్దంపడుతున్నాయని అనేక మంది ఉదారవాదులైన ప్రముఖులు అర్థంచేసుకున్నారు. ఓప్రా బలమైన డెమోక్రాటిక్ అభ్యర్థి కావడానికి ఆమెకున్న డబ్బు, పేరు ప్రఖ్యాతులు సరిపోతాయని కిందటేడాది కొందరు అంచనావేశారు. ఓప్రా విన్ఫ్రీ షో అనే టెలివిజన్కార్యక్రమం ద్వారా జనం వ్యక్తిగత సమస్యలు విని ఊరట ఇచ్చే మాటలతో పరిష్కారాలు సూచించడం ద్వారా ఓప్రా అమెరికాలోనేగాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల మన్ననలు పొందారు. అయితే, వరుసగా ఇద్దరు టీవీ ప్రముఖులను అధ్యక్ష పీఠం ఎక్కిస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కూడా టీవీ రియాలిటీ షో ద్వారానే అందరికీ తెలిశారు. గతంలో అధ్యక్ష పదవికి పోటీపై అడిగిన ప్రశ్నలను ఆమె దాటవేశారు. ఓప్రా పోటీచేసే అవకాశముందని ప్రసంగం ముగిశాక 31 ఏళ్లుగా ఆమె జీవితభాగస్వామి స్టెడ్మన్గ్రహమ్చెప్పారు. ‘‘ అంతా ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె తప్పక ఆ పనిచేస్తారు,’’ అని ఆయన తెలిపారు. 2008 ఎన్నికల్లో బరాక్ఒబామా, 2016లో మరో డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ తరఫున ఓప్రా ప్రచారం చేశారు. స్త్రీలు, పురుషులు ఎలా ప్రవర్తిస్తారో చెబుతూనే ఉన్నా! ‘‘వాస్తవానికి స్త్రీలు, పురుషులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికే నేను నా వృత్తిలో టెలివిజన్, సినిమా ద్వారా శాయశక్తులా ప్రయత్నించా. మన జీవితాల్లో అవమానాలు ఎలా భరిస్తాం, ప్రేమను ఎలా అనుభవిస్తాం, కోపంతో ఎలా ఊగిపోతాం, ఎలా ఓడిపోతాం, ఎలా పారిపోతాం, ఎలా కష్టాలు భరించి వాటిని అధిగమిస్తాం ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడానికి నేను చేయగలిగినంత చేశా. జీవితంలో అత్యంత నికృష్ట కష్టాలు తట్టుకుని నిలబడి ఘోరమైన సమయాల్లో సైతం ఆశావహమైన రేపటి ఉదయం కోసం వేచిచూసిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి, వారి గురించి ప్రజలకు వర్ణించాను,’’ అంటూ ఓప్రా తన ప్రసంగంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరోసారి ‘నేను సైతం’ అని గొంతెత్తే అవసరం రాకుండా ఇక్కడ కూర్చున్న గొప్ప మహిళలు, ఉన్నతమైన పురుషులు వీరోచిత పోరు సాగిస్తున్నారు. వారి కృషి వల్లే ఓ కొత్త ఉషోదయం మన కళ్ల ముందు ఆవిష్కృతమౌంది,’’ అని ఓప్రా తన ప్రసంగం ముగించారు. ఓప్రాను మెచ్చుకున్న ఇవాంకా ఓప్రా ఉపన్యాసం విన్న ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా, ‘ కిందటి రాత్రి గోల్డెన్ గ్లోబ్స్‌లో ఓప్రా చేసిన ఉత్తేజపూరిత ప్రసంగం ఇప్పుడే చూశా. మనమంతా - స్త్రీలు, పురుషులు చేతులు, గొంతు కలపి ‘సమయం ముంచుకొచ్చింది’ అందాం’ అని ట్వీట్‌చేశారు. అయితే, ఆమె మాటలు కపట ధోరణికి అద్దంపడుతున్నాయని, తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చినప్పుడు ఇవాంకా ఏం చేశారని పలువురు ట్విటర్లోనే ప్రశ్నించారు. సూపర్ మోడల్ క్రిసీ టెయిగన్ క్లుప్తంగా, ‘ఇవ్(ఇవాంకా) పో’ అని ఈసడించుకోగా, ప్రముఖ నటుడు ఆడమ్పాలీ, ‘ నీ తండ్రిపై చేసిన 16 లైంగిక వేధింపుల అభియోగాల సంగతేంటి?’ అని ప్రశ్నించారు. బాల్యమంతా కష్టాలమయమే! పెళ్లిగాని ఆఫ్రికన్అ మెరికన్ టీనేజ్ తల్లికి పుట్టిన ఓప్రా బాల్యంలో నానా కష్టాలు అనుభవించారు. ఇప్పుడు 63 ఏళ్ల ఓప్రాకు దాదాపు మూడొందల కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం ఆమె ‘ఓన్’ అనే కేబుల్ చానెల్ సీఈఓగానేగాక, సీబీఎస్ న్యూస్ మేగజీన్ కార్యక్రమం ‘60 మినిట్స్’కు స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. వెయిట్ వాచర్స్ వంటి అనేక కంపెనీల్లో ఆమె పెట్టుబడులున్నాయి. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇదేమీ ట్వీటమ్మో ఇవాంకా?
న్యూయార్క్: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన ప్రముఖ హాలీవుడ్ నటి, వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రేపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. లైంగిక దాడులను వెలుగులోకి తీసుకొస్తూ.. ఇటీవల గళమెత్తిన హాలీవుడ్ నటీమణులు, మహిళలను ప్రశంసిస్తూ విన్ఫ్రే గొప్పగా ప్రసంగించారు. మహిళలపై లైంగిక దాడులు లేని కొత్త సమాజానికి ఇది నాంది కావాలంటూ ఆమె ఇచ్చిన ఉపన్యాసం శ్రోతలను కదిలించింది. ఆమె స్ఫూర్తిదాయక ప్రసంగం విన్న పలువురు.. ఆమె 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని గట్టిగా కోరుతున్నారు. విన్ఫ్రే కూడా ఆ దిశగా గట్టిగానే ఆలోచిస్తున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. అందరిలాగే అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ కూడా విన్ఫ్రే ప్రసంగాన్ని ట్విట్టర్లో ప్రశంసించారు. మహిళా సాధికారిత దిశగా ఓప్రా ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని, పురుషులు, మహిళలు ముందుకొచ్చి ఇందుకోసం కృషి చేయాలని ఇవాంకా యథాలాపంగా ట్వీట్ చేశారు. వెంటనే ఆమె ట్వీట్ బ్యాక్‌ఫైర్ అయింది. ఆమె ట్వీట్‌ను తప్పుబడుతూ.. హాలీవుడ్ ప్రముఖులు అలిస్సా మిలానో, రోసీ ఒడొనెల్, క్రిసీ టీజెన్ తదితరులు ట్వీట్ చేశారు. అందుకు కారణం ఆమె తండ్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే. ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని, తమ పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని పలువురు మహిళలు గళమెత్తారు. ’మీ టూ’ క్యాంపెయిన్‌లో భాగంగా ట్రంప్ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. మరి బాధితులకు మీరు అండగా ఉంటారా? మీ తండ్రిపై ఆరోపణలు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా మీరు చూస్తారా? బాధితులకు న్యాయసహాయం కోసం టైమ్స్ మ్యాగజీన్ ఏర్పాటుచేసిన ఫండ్‌కు నిధులు ఇస్తారా? మీ తండ్రి బాధితులకు ఆర్థిక సహాయం చేస్తారా? అంటూ పదునైన ప్రశ్నలతో ఇవాంకాపై పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు. -
ఆ ఆరుగురి గురించి క్లుప్తంగా....
వాషింగ్టన్: జీవితంలో పైకి రావాలంటే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉత్తమ వేతనాలు కలిగిన ఉన్నత పదవులను అధిష్టించాలని మనలో చాలా మంది భావిస్తారు. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే. పేరు ప్రఖ్యాతులతో పాటు అస్తుపాస్తులు అపారంగా సంపాదించాలంటే ఉన్నత విద్యలు అభ్యసించాల్సిన అవసరం ఏమీలేదని, రాణించాలనుకున్న రంగం పట్ల సరైన అవగాహన, అందుకు అవసరమైన తెలివితేటలు, అంతకన్నా చేసే పని పట్ల చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే సరిపోతుందని ప్రపంచంలో ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. వారిలో ఆరుగురి గురించి క్లుప్తంగా.... బిల్‌గేట్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్‌గేట్స్ పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగామ్ అభివృద్ధిపై తన 13వ ఏటనే దృష్టిని కేంద్రీకరించారు. 1973లో హార్వర్డ్ యూనివర్శిటీలో చేరారు. డిగ్రీ పూర్తిచేయకుండానే కాలేజ్ చదవుకు స్వస్తి చెప్పారు. ‘మైక్రోసాఫ్ట్’ను స్థాపించారు. కంపెనీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పేరు ప్రఖ్యాతులతోపాటు అపార అస్తులను సంపాదించారు. అయినా తృప్తి పడకుండా వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించి, ప్రజలకు కావాల్సిన ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పంతో ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ను స్థాపించి సామాజిక సేవ చేస్తున్నారు. స్టీవ్ జాబ్స్ మరో పర్సనల్ కంప్యూటర్ పయనీర్. పోర్ట్లాండ్లోని రీడ్ కాలేజీలో చేరారు. మధ్యలోనే కాలేజీ చదువుకు స్వస్తి చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. యూనివర్శిటీ చదువును మధ్యలో వదిలేయడం పట్ల ఆయన ఎన్నడూ పశ్చాతపడలేదు. పైగా మంచిపని చేశానని చెప్పుకున్నారు. ‘తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును యూనివర్శిటీ చదువుల పేరిట తగలేయడం ఇష్టం అనిపించలేదు. అందుకే చదువును అర్ధాంతరంగా వదిలేసాను. అప్పుడు నేను జీవితంలో ఏం కావాలనుకుంటున్నానో కూడా నాకు క్లారిటీ లేదు. ఆరోజున పునరాలోచించి చదువు మానేయడం నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో మంచి నిర్ణయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టీవ్ జాబ్స్ పిక్సర్ అనే సంస్థను కూడా స్థాపించారు. తొలి యానిమేటెడ్ సినిమాను నిర్మించిన ఈ సంస్థను తర్వాత డిస్నీ కొనుగోలు చేసింది. జెస్సికా ఆల్బా ‘సిన్ సిటీ’ లాంటి అవార్డు సినిమాల ద్వారా ఆమె మనకు ముందుగానే పరిచియం. ఆమె దానికే పరిమితం కాకుండా 2011లో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ‘హానెస్ట్ కంపెనీ’ని ఏర్పాటు చేశారు. ఈకో ఫ్రెండ్లీ హౌజ్‌హోల్డ్ క్లీనింగ్ ఉత్పత్తులను ప్రారంభించారు. తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు ఆమె కంపెనీ ఆస్తుల విలువ వంద కోట్ల డాలర్లు. డిగ్రీ కూడా చదవని ఆమె, వ్యాపార రంగంలో స్వీయకృషితో పైకొచ్చిన అమెరికా సంపన్నుల్లో ఒకరిగా 2015లో ప్రత్యేక గుర్తింపును పొందారు. రిచర్డ్ బ్రాన్సన్ పదో తరగతి కూడా చదువుకోలేదు. 16వ ఏటనే తన చదువుకు స్వస్తి చెప్పారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా వందల కోట్ల డాలర్లను ఆర్జించారు. ‘రోలింగ్ స్టోన్స్, సెక్స్ పిస్టల్స్’ కళాకారులతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. ‘చదువు ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు. ఓ సైంటిస్ట్ కావాలన్నా, టెక్నీషయన్ కావాలన్నా, మేథమెటీషియన్ కావాలన్నా చదువు తప్పనిసరి. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కావాలంటే బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవుకోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని, అందులోని అనుభవాలను చదువుకుంటే చాలు’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. బ్రాన్సన్ వర్జినీయా మొబైల్ ఫొన్ కంపెనీని స్థాపించారు. నోకియా బూమ్ రాకముందు ఈ ఫోన్లను బాగా అమ్ముడుపోయేవి. మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్‌బర్గ్ 2004లో సంస్థను స్థాపించారు. దానిపై దృష్టిని కేంద్రీకరించడం కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకు స్వస్తి చెప్పారు. నెలకు 150 కోట్ల యూజర్లు కలిగిన ఫేస్బుక్ ఆస్తి 25వేల కోట్ల డాలర్లు. ‘ఏ రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో మనిషి చేసే అతి పెద్ద రిస్క్. యూనివర్శిటీ చదువుకు స్వస్తి చెప్పడం రిస్కే కావచ్చు. కానీ ఆ రిస్క్ నాలాంటి వాళ్లకు ఎంతో కలసొచ్చింది’ అని ఆయన తన గురించి చెప్పుకున్నారు. ఓప్రా విన్ప్రే మిసి్సిసీపిలో జన్మించిన విన్ప్రే జీవితంలో కటిక దరిద్య్రాన్ని అనుభవించారు. టీనేజీలోనే ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొన్నారు. ఉన్నత చదువులను అభ్యసించాలనే లక్ష్యంతో టెన్నీస్ స్టేట్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ వివిధ కళల్లో ఆరితేరారు. అక్కడ చదువు కొనసాగిస్తున్నప్పుడు స్థానిక రేడియో స్టేషన్లో ఉద్యోగం వచ్చింది. చదువుకు స్వస్తి చెప్పారు. కష్టపడి పనిచేశారు. ప్రపంచంలోనే మంచి రేడియో షో హోస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. స్వయం కృషితో అమెరికాలో పైకొచ్చిన సంపన్నుల్లో ఐదో వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. ‘జీవితంలో వైఫల్యం అనేది ఏదీ ఉండదు. ప్రతి వైఫల్యం జీవితానికి ప్రత్యామ్నాయ దారి చూపుతుంది’ అని ఆమె చెప్పారు. -
గాయం చెక్కిన ధ్యేయం
ఫస్ట్ పర్సన్ ఆ శ్రమా, ఈ శ్రమా చేసి బతకడం... లేదా... నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం! ఇది తప్ప... సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనా, అవకాశం రెండూ... సగటు మనిషికి సాధారణంగా ఉండవు. ఏ శ్రమ చేసినా... మనిషి ఆశ్రమంలా ఉండాలని పద్మజ అంటున్నారు. చిన్నప్పుడు అయిన పెద్ద గాయం పద్మజ సేవ ముందు చిన్నబోయింది. మనిషికి అలంకారం... ఆ సంస్కారమే అని... ధ్యేయం గొప్పదైతే గాయం గాంధేయం అవుతుందని పద్మజ చాటి చెబుతున్నారు. మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్విలో 1971 ఏప్రిల్ 9న పద్మజ జన్మించారు. తల్లి వెనిగళ్ల లలిత, తండ్రి భీమేశ్వర్రావు. ప్రాథమిక విద్యను హైదరాబాదులో చిన్నాన్న దగ్గరుండి అభ్యసించారు. హైస్కూల్ చదువు ప్రకాశం జిల్లాలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర సాగింది. బీఎస్సీ ధార్వాడ్ కర్ణాటక యూనివర్శిటీలో పూర్తి చేశారు. చదువయ్యాక నాలుగేళ్లపాటు మానసిక వికలాంగుల కోసం పనిచేసే ‘లార్ష్ ఇంటర్నేషనల్’ సంస్థలో వలంటీర్‌గా ఉన్నారు. అదొక జీవిత అధ్యయనం ఆమెకు. అయితే ప్రస్తుతం పద్మజ చేస్తున్న సేవకు ప్రేరణ మాత్రం.. ఆమె బాల్యంలో జరిగిన ఒక సంఘటన నుంచి కలిగిందే. ఆమె గురించి పూర్తి వివరాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. చేదు బాల్యం అమ్మమ్మ, తాతయ్యల దగ్గరుండి చదువుకున్నానని చెప్పాను కదా. అమ్మమ్మ, తాతయ్యలతో పాటు మేనమామా ఇంట్లో ఉండేవాడు.అతను నన్ను బాగా చూసుకుంటున్నట్టుగా బయటకు ప్రవర్తిస్తూ నా దగ్గర వెకిలి, వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని ప్రవర్తన నాకు అర్థమయ్యేది కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. ఏడుపొచ్చేది. ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. భరించలేక ఎవరికైనా చెప్పాలనిపించేది. కానీ వెంటనే మామయ్య గురించి అలా చెప్తే నమ్ముతారో లేదో అని భయమేసేది. ఆ నరకం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలనిపించేది. అందుకే .. ‘నన్ను ఇక్కడెందుకు ఉంచుతున్నారు? మీ దగ్గరే పెట్టుకొని చదవించొచ్చు కదా.. నేను ఇక్కడ ఉండను .. వచ్చేస్తాను’ అంటూ నాన్న దగ్గర మారాం చేసేదాన్ని. బెంగతో అలా అంటుందని అమ్మానాన్న అనుకున్నారే కాని నా భయాన్ని వాళ్లు గుర్తించలేకపోయారు. ఆ హింస గురించి వాళ్లకు చెప్పే ధైర్యం నేనూ చేయలేకపోయాను. కాని అవకాశం దొరికితే మాత్రం బయటపడాలనే ఆలోచనతోనే పెరిగాను. అందుకే ఇంటర్ అవగానే కర్ణాటకకు వెళ్లిపోయాను. ఏదో సాధించాలని కసి బాగా చదివి ఏదో సాధించాలన్న కసితో చదువుల్లో, ఆటల్లో ముందుండేదాన్ని. డిగ్రీ అయ్యాక, స్వచ్ఛంద సేవాసంస్థలో పనిచేస్తూనే కర్ణాటక రాష్ట్ర గ్రూప్ 1 పరీక్ష రాశాను. సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పరీక్షకూ హాజరయ్యాను. 6వ ర్యాంక్ వచ్చింది. జిల్లా ఉపాధి అధికారిగా ఉద్యోగంలో చేరాను. అందరి పిల్లల గురించి తల్లిదండ్రులు కలలు కన్నట్టే నా గురించీ అమ్మానాన్న కలలు కన్నారు. బాగా చదువుకొని, మంచి ఉద్యోగంలో చేరి.. పెళ్లి, పిల్లలతో హాయిగా జీవితంలో స్థిరపడాలని. చదివి, మంచి ఉద్యోగం సంపాదించి కొంత వరకు అమ్మానాన్న కలల్ని నిజం చేశాను. అమ్మానాన్న మాటలకు ఏ రోజూ ఎదురు చెప్పని నేను పెళ్లికి విషయంలో మాత్రం చెప్పాను . అయితే మా పెద్దమ్మ పెళ్లి చేసుకోవలసిందేనని (భారతి) ఒత్తిడి తెచ్చింది. తప్పించుకున్నా. చెల్లి పెళ్లి అయిపోయాక నా మీద ఆ ఒత్తిడీ తగ్గింది. కాని తర్వాత చాలా రోజులకు అప్పుడప్పుడు అనిపించేది... భర్త, పిల్లలు ఉండే బాగుండు అని. మళ్లీ వెంటనే నా చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూశాక భర్త కంటే కూడా పిల్లలుంటే చాలు అన్న ఆలోచన వచ్చేది. అయితే అది క్షణం వరకే. ‘కంటేనే అమ్మా.. కనకపోతే అమ్మ కాలేమా?’ అనిపించేది. ఓ వైపు ఆ తలపులు.. ఇంకోవైపు ఏదో సాధించాలనే తపనతో చేస్తున్న ఉద్యోగంలో ఆనందాన్ని, సంతృప్తినీ పొందలేకపోయా. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నా అనేవాళ్లను సంపాదించుకోవడం కన్నా నా అన్నవాళ్లు లేనివారికి అంకితం చేయడం మిన్న అనుకున్నాను. ఓప్రా విన్ఫ్రే ప్రభావం ఆ సమయంలోనే ఓప్రావిన్‌ఫ్రే జీవితం, ఆమె షో నా మీద చాలా ప్రభావం చూపించింది. మారుతండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైన విన్ఫ్రే తనలాంటి ఎంతోమంది బాధితులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన తీరు.. పిరికిదాన్నయినా నాకు స్ఫూర్తినిచ్చింది. ఆ ప్రేరణ, అప్పటికే వాలంటరీ వర్క్‌లో ఉన్న అనుభవం, రామమకృష్ణా మిషన్‌తో ఉన్న అనుబంధం, చదివిన పుస్తకాలూ నా గమ్యాన్ని మార్చాయి. చిన్నప్పుడు నాకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఇంకే ఆడపిల్లకు ఎదురు కాకుండా, ఇంకే ఆడపిల్లా బలికాకుండా ఇటు పిల్లలను, అటు తల్లిదండ్రులను జాగృతం చేయాలనుకున్నాను. ‘జట్టు’లో ఒకరిగా ఆ సమయంలో నేను ఉద్యోగరీత్యా ప్రకాశం జిల్లాలో ఉన్నాను. అప్పటి జిల్లా కలెక్టర్ కరికల్ వలెవన్.. ‘జట్టు ’ అనే ఆశ్రమ వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడును పరిచయం చేశారు. జట్టు కోసం ఆతను టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని చేసిన త్యాగాన్ని వివరించారు. ఇక నేను రెండో ఆలోచన చేయలేదు. నా నిర్ణయాన్ని ఆపలేదు. ఉద్యోగం వదిలేశాను. ‘జట్టు’లో చేరాను. ఈ పిల్లలతో బాగానే జట్టు కుదిరింది. అమ్మా...నాన్న... ఎటువంటి ఆధారం లేని ఈ పిల్లల ‘అమ్మా’ అన్న పిలుపు, వాళ్ల మమకారం నన్ను ఇక్కడ కట్టిపడేశాయి. అంతర్జాతీయ స్థాయిలో.. ఈ పిల్లల్లో ఉన్న ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఆశ్రమంలో శ్రీ రజనీరాజ అంతర్జాతీయ శాస్త్రీయ నృత్య కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ పిల్లలతోపాటు చుట్టుపక్కల పిల్లలకూ శాస్త్రీయ నృత్యంతోపాటు, సంగీతం, పలు జానపద కళలు, కత్తిసాము, కర్రసాము, హాకీలాంటి ఆటలను నేర్పుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పిల్లలు బహుమతులు, అవార్డులు, రివార్డులు సాధిస్తున్నారు. ఈ విషయంలో జట్టు పారినాయుడు మాస్టారు, నృత్య శిక్షకులు రజనీ, శ్రీనివాస్‌లు, జట్టు ట్రస్ట్ ప్రోత్సాహం గొప్పది. ఆశ్రమంలో పిల్లలతో పాటు వృద్ధులకు కూడా ఆసరా ఇస్తున్నాం. సుబ్బాయమ్మలాంటి వారు పెద్ద దిక్కుగా ఉన్నారు. జట్టులోని పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలకు అంగరంగవైభవంగా పెళ్లి చేశాం. వారు ఇప్పుడు అమ్మా...నాన్నలున్నా...ఇంత చక్కగా చూసుకోరేమోనన్న సంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నారు. లైంగిక దాడుల బాధితుల కోసం బాల్యంలో, యవ్వనంలో లైంగిక దాడులకు గురవుతున్న ఆడపిల్లలను చైతన్య పరచాలి. ఎదిరించే గుణాలను అలవాటు చేయాలి. అన్యాయాలకు గురైన పిల్లలు మానసిక వత్తిడికి గురి కాకుండా చూడాలి. లేదంటే ఆ వత్తిడితో వివాహమయ్యాక వారు ప్రశాంతంగా ఉండలేక, కట్టుకున్న వారిని ఉంచలేక మథన పడ్తుంటారు. అలాగే దాడులకు పాల్పడుతున్న మగవాళ్లనూ కౌన్సిలింగ్ ద్వారా మార్చాలి. మెప్పుకోసం.. గొప్ప కోసం కాదు ఎదుటివారు నా గురించి ఏమి అనుకుంటారో అన్న చింతను అధిగమించాను. మెప్పు కోసమో, గొప్ప కోసమో పనులు చేయడం అలవాటు చేసుకోలేదు. మనస్సులో కోర్కెలు అణచుకొని నేనేదో గొప్ప త్యాగం చేశానని అనుకోవడం కంటే వాటిని జయించడం ఉత్తమమని తెలుసుకున్నాను. ఆచరిస్తున్నాను. తద్వారా ఆత్మానందం, అనంత శ క్తిని పొందుతున్నాను. ఎంతో మంది చేసిన దాన, త్యాగ ఫలితమే నేను. అందరి నుంచి పొందిన లబ్ధికి, అంతకంటే ఎక్కువగా జోడించి తిరిగి సమాజానికి చెల్లించడమే నా పని. అదే నా భవిష్యత్. చిన్నప్పుడు అనుకునేదాన్ని కష్టపడి డబ్బు సంపాదించాక సేవ చెయ్యడం మొదలుపెట్లాలని. సంపాదనకే సమయం సరిపోతే సేవ ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్న కూడా వేధించింది. మంచికి సమాజంలో ఆదరణ ఉన్నప్పుడు చేయడానికి భయమెందుకు అని పనిలోకి దిగాను. ఇక్కడ ఆశ్రమంలో ఈ బిడ్డల ప్రేమను, కష్ట సుఖాలను పంచుకొనే అదృష్టం దక్కింది . వీళ్లు సన్మార్గంలో నడవడానికి తగిన వాతావరణం ఏర్పాటు చెయ్యటమే నా కర్తవ్యం. గతంలో బతకలేను... గతాన్ని మార్చలేను. కనుక నిస్వార్థ సేవే లక్ష్యంగా... ఉన్నంత కాలం ఏ ఆధారం లేని ఈ పిల్లలకు తల్లిగా ఉండిపోదామనే ఆశతో సాగుతున్నాను. సంభాషణ: వంగల దాలినాయుడు, సాక్షి, పార్వతీపురం -
ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది!
-
ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది!
లండన్: బ్రెడ్డుముక్కను తింటూ కూడా బరువును ఎలా తగ్గించుకోవచ్చో చెప్తూ పెట్టిన ఓ ట్వీట్‌కు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్ఫ్రే అక్షరాల 12 మిలియన్ డాలర్లు (రూ. 81.77 కోట్లు) సంపాదించింది. 'వెయిట్ వాచర్స్' కంపెనీ తరఫున బ్రెడ్ తింటూ 26 పౌండ్ల బరువును ఎలా తగ్గవచ్చో తెలిపే ఓ వీడియోను ఆమె ట్వీట్టర్లో పోస్టు చేసింది. ఈ కంపెనీలో మీడియా మొఘల్‌గా పేరొందిన విన్ఫ్రేకు 6 మిలియన్ డాలర్ల వాటా ఉండగా.. ఈ ఒక్క ట్వీట్ వల్ల ఆమె సంపద 18 శాతం పెరిగి 12 మిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 'వెయిట్ వాచర్స్' కంపెనీలో ఆమె షేర్ విలువ ఒకే ఒక్క గంటలోనే 2.10 శాతానికి పెరిగిందని 'ఫిమెల్ ఫస్ట్' మీడియా సంస్థ తెలిపింది. మల్టీ మిలియన్ డాలర్ ట్వీట్‌గా హల్చల్ చేసిన ఈ ట్వీట్లో 'బ్రెడ్ తినండి. బరువు తగ్గండి. ఏంటి? నిజమా! అవును. నాతోపాటు ఈ 30 సెకండ్ల వీడియో క్లిప్పును చూడండి. నేను 26 పౌండ్ల బరువు తగ్గాను. నేను ప్రతిరోజూ బ్రెడ్ తింటాను' అని విన్ఫ్రే పేర్కొంది. హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ హడ్సన్, జెన్సీ మెక్‌క్యాథీ తరహాలోనే గత అక్టోబర్ నుంచి 'వెయిట్ వాచర్స్' కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా విన్ఫ్రే నియమితురాలైంది. ఇందుకుగాను ఆమెకు లభించే వాటాను మార్కెట్లో అమ్మితేగానీ విన్ఫ్రేకు డబ్బురూపంలో ఆ సొమ్ము అందదని మార్కెట్ వర్గాలంటున్నాయి. -
కోట్స్
నీకు ఉన్నవాటిని లెక్కించుకుంటే చాలా ఉన్నట్లనిపిస్తుంది. నీకు లేనివాటిని లెక్కించుకుంటే నీకసలు ఏమీ లేనట్లే అనిపిస్తుంది. - ఓప్రా విన్ఫ్రే, టాక్ షో వ్యాఖ్యాత భవిష్యత్తుపై ఆశను కోల్పోయిన మరుక్షణమే వర్తమానంపై ఆసక్తిని పోగొట్టుకుంటాం. - రూత్ బెనెడిక్ట్, మానవ పరిణామ శాస్త్రవేత్త. నీలో కోపం భగ్గుమన్న క్షణంలో నువ్వు గనుక సహనంగా ఉండగలిగితే... ఒక జీవితకాల దుఃఖం నుండి తప్పించుకోగలుతావు. -లావోట్ట్జ్, ప్రాచీన చైనా తత్వవేత్త -
మనీ మేనేజ్‌మెంట్‌లోనూ ‘విన్’ ఫ్రే..
ఓప్రా విన్ఫ్రే.. దుర్భర దారిద్య్రం నుంచి స్వయంకృషితో కోట్లకు పడగలెత్తే దాకా ఓప్రా విన్‌ఫ్రేది స్ఫూర్తిదాయకమైన పయనం. ప్రస్తుతం దాదాపు 290 కోట్ల డాలర్ల సంపదతో ఆఫ్రికన్ అమెరికన్లలో ఆమె అత్యంత సంపన్నురాలిగా ఉన్నారు. టాక్ షో వ్యాఖ్యాతగా, నటిగా, ప్రొడ్యూసర్‌గా అనేక పాత్రలు పోషిస్తున్న ఓప్రా విన్ఫ్రే.. క్వీన్ ఆఫ్ ఆల్ మీడియాగా పేరొందారు. సుమారు పాతికేళ్ల పాటు (1986 నుంచి 2011 దాకా) సాగిన ది ఓప్రా విన్ఫ్రే షో అమెరికా టెలివిజన్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇలాంటి వాటి ద్వారా కోట్లు ఆర్జించినా.. డబ్బు విలువ గురించి గుర్తెరిగి వ్యవహరిస్తారు ఓప్రా. కొంత రిస్కు చేసి కొత్త వ్యాపారాలు చేపట్టినా .. రియల్టీ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసినా ఓప్రాది విభిన్న శైలి. కేవలం టాక్‌షోలకు పరిమితం కాకుండా ఆమె స్వయంగా హార్పో (ఇంగ్లిష్‌లో ఓప్రాను తిరగేస్తే వచ్చే పేరు) పేరిట ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. దీంతో ఓప్రాకు గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. అలాగే, ‘ఒ’ పేరుతో ఏర్పాటు చేసిన మ్యాగజైన్ ఓప్రాకు ఏటా మిలియన్లకొద్దీ ఆదాయం తెచ్చిపెడుతోంది. దాదాపు కొన్నాళ్ల క్రితం భారీ బహుళ అంతస్తుల భవంతిలో సుమారు మూడు మిలియన్ డాలర్లు పెట్టి ఏకంగా నాలుగు ఫ్లాట్లను కొన్నారామె. వాటి విలువ ప్రస్తుతం 12 మిలియన్ డాలర్లు పలుకుతోంది. ఆ రకంగా స్వల్ప వ్యవధిలోనే దాదాపు 9 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అలాగే మరో ప్రాంతంలో రెండు మిలియన్ డాలర్లకు కొన్న ఇంటిని 3.25 మిలియన్ డాలర్లకు అమ్మేసి మిలియన్ డాలర్లు లాభం అందుకున్నారు. వీటిలో ఎలాగైతే లాభాలు అందుకున్నారో.. అధిక ధరల్లో కొన్న కొన్ని కలసి రాని ప్రాపర్టీలను కాస్త తక్కువ రేటుకే అమ్మేశారు కూడా. ఓన్ పేరిట ఏర్పాటు చేసిన మీడియా సంస్థను భారీ నష్టాల్లో నుంచి మళ్లీ లాభాల్లోకి మళ్లించారు. ఇంత సంపదను మేనేజ్ చేయడం చాలా కష్టతరం అవుతుండటంతో ఇటీవలే తన పెట్టుబడులను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ప్లానర్లను కూడా నియమించుకున్నారు ఓప్రా. కేవలం ధనార్జనకే పరిమితం కాకుండా .. పేదరికంలో మగ్గిపోతున్న వారికి తన వంతు సాయం చేస్తూ.. దానగుణాన్నీ చాటుకుంటున్నారు. ఇలా జరిగితే ఎలా.. అలా జరిగితే ఎలా అని బాధపడాల్సిన అవసరం లేకుండా మనసు హాయిగా ఉండటమే ఆర్థిక స్వేచ్ఛ అంటారు ఓప్రా. -
20 ఏళ్లయింది.. ఇక పెళ్లి చేసుకుందాం!
చాట్ షో రారాణి ఓప్రా విన్ఫ్రే పేరు విన్నారు కదూ. ఆమెకు ఎంగేజిమెంట్ అయిన విషయం మీకు తెలుసా? అది కూడా అప్పుడు, ఇప్పుడు కాదు.. ఏకంగా 20 ఏళ్ల క్రితం అట. ఇన్నాళ్ల నుంచి ఎంగేజిమెంట్తోనే సరిపెట్టుకుంటూ వస్తున్న ఆమె చెలికాడు స్టెడ్మన్ గ్రాహమ్ మాత్రం ఇక ఎదురుచూపులు చాలు, పెళ్లి చేసుకుందామని ఓప్రాను తొందర పెడుతున్నాడు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని అతగాడు ఆశపడుతున్నాడు. ముందుగా ఆరేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత 1992లో గ్రాహమ్ ప్రపోజ్ చేస్తే ఓప్రా విన్ఫ్రే అందుకు అంగీకరించిదట. కానీ ఎప్పటికప్పుడు పెళ్లి మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. అందుకే ఇప్పుడు రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకుందామని అడగాలని భావిస్తున్నాడు. ఓప్రా ఇటీవలే దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా అంత్యక్రియలకు హాజరై వచ్చిందని, అది చాలా భావోద్వేగాలతో నిండిన పర్యటన అని స్టెడ్మన్ అన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని అంటున్నాడు. -
జీవితం వెనక్కి లాగుతున్నప్పుడే ధైర్యంగా... ముందుకు సాగాలి!
ఏ మనిషీ ముళ్లు ఉన్న చోట అడుగు వేయడు. ముళ్లున్నాయని తెలిసి కూడా ఆ తోవలో వెళ్లాలని అనుకోడు. తను వెళ్లాల్సిన దారిలో ముళ్లు పరిచివుంటే ఏం చేయగలరు ఎవరైనా? వాటిని ఏరి పారేసుకుంటూ వెళ్లాలి. లేదంటే వాటి మీద అడుగులు వేయకుండా తప్పించుకుంటూ నేర్పుగా నడవాలి. అది కూడా కాదంటే... ముళ్లు గుచ్చుకున్నా నొప్పిని భరిస్తూ సాగిపోగలగాలి? వీటిలో ఏది తేలిక? ఒక్కోసారి ఒక్కో మార్గం మేలనిపిస్తూ ఉంటుంది. నా దారిలో నాకు ఎన్నో ముళ్లు తగిలాయి. ఒక్కోసారి వాటిని ఏరి పారేశాను. కొన్నిసార్లు అది సాధ్యం కాక తప్పించుకు సాగడానికి ప్రయత్నం చేశాను. మరికొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా వాటి బారినపడి గాయపడ్డాను. ప్రపంచమంటే ఏమిటో తెలియకముందే ప్రపంచంలో ఇలాంటివి ఉంటాయా అని భయపడే సందర్భాలు ఎదురయ్యాయి నా జీవితంలో. పేదరికం, అవహేళనలు, అత్యాచారాలు, వేధింపులు, సాధింపులు... అబ్బ, ఎన్ని చూశాను చిన్ని జీవితంలో! వయసు పెరిగే కొద్దీ నా చుట్టూ ఉన్న ప్రపంచం కుచించుకుపోసాగింది. నాకంటూ ఎవరూ కనిపించేవారు కాదు. చుట్టూ ఉన్నవాళ్లంతా శత్రువులేమో అన్న భావన. ఎప్పుడు ఎవరేం ద్రోహం తలపెడతారో అన్న భయం. వీటి మధ్య ఓ ఆడపిల్ల జీవితం ఏమవుతుంది? అస్తవ్యస్తమవుతుంది. అభాసుపాలు అవుతుంది. నా విషయంలో అది కూడా జరిగింది. ఆ నవ్వుల్ని నేను మర్చిపోలేదు. వాటిని విజయపథానికి చేర్చే మెట్లు అనుకున్నాను. ఇతరులు చేసిన ఎగతాళిని, అవహేళనలను విస్మరించలేదు. వాటిని లక్ష్యానికి గురిచూసి కొట్టే ఆయుధాలుగా మలచుకున్నాను. పట్టుదలతో ఎదిగాను. పర్వతంలా నిటారుగా నిలబడ్డాను. నా తలను చూడాలంటే ఎవరైనా వారి తల ఎత్తి చూడాల్సిందే తప్ప నేనెప్పుడూ తల దించుకోవాల్సిన అవసరం రాలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే... భయం, నిస్సహాయత, నిస్పృహలు ఏదో ఒక సమయంలో మనసును ముసురుకుంటాయి. భయపెడతాయి. వెనక్కి లాగుతాయి. నీ పని అయిపోయిందంటూ కంగారు పెట్టేస్తాయి. అప్పుడే ధైర్యంగా ఉండాల్సింది. అప్పుడే తెగించి అడుగు ముందుకేయాల్సింది. అప్పుడే మహిళ సత్తాను చూపించాల్సింది. అప్పుడే సంకల్పబలమంటే ఏంటో తెలియజేయాల్సింది. లేవండి. లేచి నడవండి. నడక ఆపకండి. ఆపే అవకాశం ఎవరికీ ఇవ్వకండి. - ఓప్రా విన్ఫ్రే (పలు సందర్భాల్లో చెప్పిన విషయాల ఆధారంగా) -
తన వస్తువులను వేలం వేయనున్న ఓఫ్రా విన్ ఫ్రే
లాస్ ఏంజెలెస్: ఛాట్ షో క్వీన్ ఓఫ్రా విన్ ఫ్రే ఓ మంచి పని కోసం ముందుకు వచ్చారు. దాతృత్వ కార్యక్రమాలకు నిధుల సేకరణ కోసం తన వ్యక్తిగత వస్తువులు వేలం వేయాలని ఆమె నిర్ణయించారు. షికాగో, కాలిఫోర్నియా, ఇండియానా, హవేలిలోని తన నివాసం నుంచి సేకరించిన వస్తువులను కూడా ఆమె వేలం వేయనున్నారు. తన సంతకంతో కూడిన ప్రింటెడ్ పోస్టర్లు, మార్బుల్ బాత్ టబ్, డాల్ తదితర వస్తువులను వేలానికి పెట్టనున్నారు. కార్మిన్స్కీ ఆక్షన్ హౌస్ నవంబర్ 2 వీటిని వేలం వేయనుంది. వేలం వేయడం ద్వారా నిధులను ఓఫ్ర విన్ ఫ్రే లీడర్షిప్ అకాడమీ ఫౌండేషన్ కాలేజీ ఫండ్‌కు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల చదువు కోసం ఈ సంస్థ సహకారం అందిస్తోంది.