మెరుపు తీగలా మారిపోయిన ఓప్రా విన్‌ఫ్రే! | Oprah Winfrey Admits To Using Weight-Loss Medication, Says Im Done With The Shaming - Sakshi
Sakshi News home page

మెరుపు తీగలా మారిపోయిన ఓప్రా విన్‌ఫ్రే..ఆ హేళనలే బరువు తగ్గించాయి!

Published Thu, Dec 14 2023 5:10 PM | Last Updated on Thu, Dec 14 2023 5:47 PM

Oprah Winfrey Admits To Using Weight-Loss Medication - Sakshi

ఓప్రా విన్‌ఫ్రే ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీవీ వ్యాఖ్యాత. ఆమె టీవీ షో ది ఓప్రా టాక్ షో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ షో ఆమెకు గ్లోబల్‌ సెలబ్రెటీ స్టేటస్‌ హోదా తెచ్చిపెట్టింది. ఆమె కూడా గత కొంతకాలం ఒబెసిటీ సమస్యలు ఎదుర్కొన్నారు. అధిక బరువుతో ట్రోలింగ్‌ గురయ్యారు. ఏమైందో ఏమో కొన్నాళ్ల​ వరకు కనిపించకుండా పోయి సడెన్‌గా స్లిమ్‌గా మారిపోయి అలానాటి ఓప్రాని తలిపించేలా మారిపోయింది. ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఛాలెంజ్‌లు విసురుతు ఎలా బరువు తగ్గించుకోవాలో అందరికీ పాఠాలు చెప్పేస్తోంది.

70 ఏళ్ల విన్‌ఫ్రే గత కొన్ని దశాబ్దాలుగా భారీ కాయంతో ఇబ్బందు ఎదర్కొంది. చాలామంది ముఖం మీద లావుగా ఉన్నారని అనడం, ట్రోలింగ్‌ వంటి వాటితో విసుగుపోయింది. అదీగాక 2021లో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ఆమెకు బోలెడెంత్‌ రెస్ట్‌ దొరికింది. ఇకం అంతే ఇదే సమయం అనుకుని బరువు తగ్గే విషయంపై దృష్టి పెట్టింది. పూర్తిగా బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. ఆకలిని నియంత్రించుకునేలా వైద్యుల సూచనలతో కొన్ని రకాల మందులు వాడుతున్నట్లు కూడా వెల్లడించింది.

మంచి ఫిటనెస్‌ నిపుణుల సాయంతో మంచిగా డైట్‌ని ఫాలో అయి బరువు తగ్గినట్లు వెల్లడించారు. ఇప్పుడు తనకెంతో హాయిగా ఉందని ఆనందంగా చెబుతుంది. భారీ కాయం నుంచి నాకిప్పటికీ విముక్తి లభించింది. అందుకోసం ఆమె ప్రతి రోజు ఐదు నుంచి మూడు మైల్లు వాకింగ్‌, వారాంతరాల్లో 10 మేళ్లకు పైగా నడవటం, రోజుకు గాలన్‌ నీరు తాగటం వంటివి తీసుకున్నట్లు తెలిపింది. ఎలాగైన తాను తగ్గాలని గట్టిగా సంకల్పించుకుని ఇన్ఫ్ల్యూయెన్షియల్ పర్సనాలిటీగా ఆవిర్భవించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఐతే ఆమె వైద్యపరంగా బరువు తగ్గేందుకు ఎలాంటి మందులు వాడిందనేది వెల్లడించకపోయినా వైద్యుల సూచనల ప్రకారం డైట్‌ ఫాలో అయ్యి తగ్గానని పరోక్షంగా చెప్పింది. ఒకనొక దశలో ఎంత సంకల్పశక్తి ఉన్న బరువు తగ్గడం కష్టం అనిపించింది కానీ కఠినమైన ఫిట్‌నెస్‌ ఫాలో అయ్యి నిపుణుల సలహాలు తీసుకుంటే పెద్దకష్టమేమి కాదని అంటోంది. ఇప్పుడామె బాగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి ఆదర్శంగా నిలవడమేగాక ఎలా బరువు తగ్గాలో సలహాలు కూడా ఇచ్చేస్తోంది. బరువు తగ్గాలనుకుంగే ఏజ్‌తో సంబంధం లేదని కూడా ఫ్రూవ్‌ చేసింది ఓప్రా విన్‌ఫ్రే.

(చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్‌ చేస్తే అంతలోనే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement