ఎన్నో రకాల డైట్‌ల గురించి విన్నాం. కానీ ఏంటిది 30-30-30 డైట్..?. కీటోజెనిక్ డైట్ నుంచి వీగన్ ప్లాన్స్, అడపాదడపా ఉపవాసం, అధిక-ప్రోటీన్ నియమాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ భోజనం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా నెంబర్ల రూల్‌తో కూడిన డైట్ ఏంటి..? మంచిదేనా అని సందేహించకండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు ఈ డైట్ నూటికి నూరు శాతం మంచిదని కితాబిస్తున్నారు. మరీ ఆ డైట్ ఏంటి..? అందులో ఎలాంటి ఆహారం తీసుకుంటారో చూద్దామా...
ప్రస్తుతం తీసుకునే డైట్‌లలో ఎక్కువగా అధిక బరువు సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటం కోసం అనుసరించేవి. అయితే కొన్ని డైట్‌లతో తొందరగా ఫలితాలను అందుకోగలం. అదేవిధంగా అందరికీ అన్ని డైట్‌లు సరిపడవు కూడా.
అయితే పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా చెప్పే 30-30-30 డైట్ మాత్రం సత్వర ఫలితాలను ఇవ్వడమే గాక తొందరగా వెయిట్ లాస్ అవ్వుతారట. నిపుణుల సైతం నూటికి నూరు మార్కుల ఇస్తున్నారు ఈ డైట్‌కి. పైగా ఇది సమర్థవంతమైనది, ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్ అని చెబుతున్నారు.
ఈ డైట్ ఎలా ఉంటుందంటే..
ఉదయం మేల్కోగానే 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్ తీసకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలి. మనం ఎప్పుడైతే కేలరీలను తగ్గిస్తామో.. అప్పుడు శరీరంలో ఉన్న వేస్ట్ కొవ్వు అదనపు శక్తి కోసం ఖర్చువుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. అలాగే ఈ డైట్ పరంగా చేసే శక్తిమంతమైన వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఇది ఒకరకంగా తినాలనే కోరికను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అదీగాక ప్రతి ఉదయాన్ని 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్‌తో ప్రారంభిస్తారు కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనే ధ్యాస తెలియకుండానే తగ్గుతుందట. ఆటోమేటిగ్గా ఈ రూల్ గుర్తొచ్చి చకచక మన పనులు పూర్తిచేసుకునేలా మన మైండ్ సెట్ అయిపోవడంతో త్వరితగతిన ఫలితాలు అందుకుంటామని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
(చదవండి: దీర్ఘాయువు మందులతో దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్ మిలియనీర్)
Comments
Please login to add a commentAdd a comment