20 ఏళ్లయింది.. ఇక పెళ్లి చేసుకుందాం! | Oprah Winfrey's beau wants them to be 'married couple' | Sakshi
Sakshi News home page

20 ఏళ్లయింది.. ఇక పెళ్లి చేసుకుందాం!

Published Wed, Jan 1 2014 3:55 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

20 ఏళ్లయింది.. ఇక పెళ్లి చేసుకుందాం!

20 ఏళ్లయింది.. ఇక పెళ్లి చేసుకుందాం!

చాట్ షో రారాణి ఓప్రా విన్ఫ్రే పేరు విన్నారు కదూ. ఆమెకు ఎంగేజిమెంట్ అయిన విషయం మీకు తెలుసా? అది కూడా అప్పుడు, ఇప్పుడు కాదు.. ఏకంగా 20 ఏళ్ల క్రితం అట. ఇన్నాళ్ల నుంచి ఎంగేజిమెంట్తోనే సరిపెట్టుకుంటూ వస్తున్న ఆమె చెలికాడు స్టెడ్మన్ గ్రాహమ్ మాత్రం ఇక ఎదురుచూపులు చాలు, పెళ్లి చేసుకుందామని ఓప్రాను తొందర పెడుతున్నాడు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని అతగాడు ఆశపడుతున్నాడు.

ముందుగా ఆరేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత 1992లో గ్రాహమ్ ప్రపోజ్ చేస్తే ఓప్రా విన్ఫ్రే అందుకు అంగీకరించిదట. కానీ ఎప్పటికప్పుడు పెళ్లి మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. అందుకే ఇప్పుడు రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకుందామని అడగాలని భావిస్తున్నాడు. ఓప్రా ఇటీవలే దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా అంత్యక్రియలకు హాజరై వచ్చిందని, అది చాలా భావోద్వేగాలతో నిండిన పర్యటన అని స్టెడ్మన్ అన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement