డొనాల్డ్ ట్రంప్ (పాత చిత్రం)
వాషింగ్టన్ : అమెరికా మీడియా మొఘల్ ఓప్రా విన్‌ఫ్రేపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అభద్రతా భావంతో ఉన్న తనపై ఆమె ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆమె గనుక అధ్యక్ష ఎన్నికల్లో గనుక పోటీచేస్తే చిత్తుగా ఓడించి తీరతానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్ సలహాదారు అయితే ఓప్రా విన్‌ఫ్రీ ప్రస్తుతం సీబీఎస్ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఏడాది పాలనపై ఆమె ప్రజా వేదికలను ఏర్పాటు చేసి చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ఆయన స్పందించారు. ‘ఓఫ్రా నాకు బాగా తెలుసు. గతంలో ఆమె నన్ను ఇంటర్వ్యూ చేయటంతో ఆమెను దగ్గరగా పరిశీలించాను. అందులో ఆమె అడిగిన ప్రశ్నలన్నీ పక్షపాతంగానే ఉన్నాయి. ఆమె చేస్తున్న ఆరోపణలు అసంబంద్ధమైనవి. అసత్య ఆరోపణలతో ఆమె ప్రజలను ఆకర్షించాలని చూస్తోంది. ఒకవేళ ఆమె గనుక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే మిగతా వాళ్ల మాదిరే ఓడిపోవటం ఖాయం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహగానాలు మీడియాలో ఊపందుకున్నాయి. దీనికి తోడు ఆమె సన్నిహితులు కూడా ఆమె పోటీ చేస్తారనే చెబుతున్నారు. కానీ, తొలుత ఈ వార్తలను ఖండించిన ఓప్రా.. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రసంగంలోనూ ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ కూడా గతంలో ఆమె పోటీ చేయనున్న అంశంపై స్పందిస్తూ... ఆమె అంత సాహసం చేస్తుందని తాను అనుకోవటం లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment