తన వస్తువులను వేలం వేయనున్న ఓఫ్రా విన్ ఫ్రే | Oprah Winfrey to auction personal items for charity | Sakshi
Sakshi News home page

తన వస్తువులను వేలం వేయనున్న ఓఫ్రా విన్ ఫ్రే

Oct 20 2013 8:55 AM | Updated on May 24 2018 1:33 PM

తన వస్తువులను వేలం వేయనున్న ఓఫ్రా విన్ ఫ్రే - Sakshi

తన వస్తువులను వేలం వేయనున్న ఓఫ్రా విన్ ఫ్రే

ఛాట్ క్వీన్ ఓఫ్రా విన్ ఫ్రే ఓ మంచి పని కోసం ముందుకు వచ్చారు. దాతృత్వ కార్యక్రమాలకు నిధుల సేకరణ కోసం తన వ్యక్తిగత వస్తువులు వేలం వేయాలని ఆమె నిర్ణయించారు.

లాస్ ఏంజెలెస్: ఛాట్ షో క్వీన్ ఓఫ్రా విన్ ఫ్రే ఓ మంచి పని కోసం ముందుకు వచ్చారు. దాతృత్వ కార్యక్రమాలకు నిధుల సేకరణ కోసం తన వ్యక్తిగత వస్తువులు వేలం వేయాలని ఆమె నిర్ణయించారు. షికాగో, కాలిఫోర్నియా, ఇండియానా, హవేలిలోని తన నివాసం నుంచి సేకరించిన వస్తువులను కూడా ఆమె వేలం వేయనున్నారు.

తన సంతకంతో కూడిన ప్రింటెడ్ పోస్టర్లు, మార్బుల్ బాత్ టబ్, డాల్ తదితర వస్తువులను వేలానికి పెట్టనున్నారు. కార్మిన్స్కీ ఆక్షన్ హౌస్ నవంబర్ 2 వీటిని వేలం వేయనుంది. వేలం వేయడం ద్వారా నిధులను ఓఫ్ర విన్ ఫ్రే లీడర్షిప్ అకాడమీ ఫౌండేషన్ కాలేజీ ఫండ్కు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల చదువు కోసం ఈ సంస్థ సహకారం అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement