‘బకింగ్‌హాం’ బంపర్‌ ఆఫర్‌ | 'Buckingham' Bumper Offer | Sakshi
Sakshi News home page

‘బకింగ్‌హాం’ బంపర్‌ ఆఫర్‌

Published Mon, Feb 13 2017 1:25 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

‘బకింగ్‌హాం’ బంపర్‌ ఆఫర్‌ - Sakshi

‘బకింగ్‌హాం’ బంపర్‌ ఆఫర్‌

లండన్ : లండన్ లోని బకింగ్‌హాం ప్యాలెస్‌ ఒక బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. క్వీన్  ఎలిజబెత్‌ ట్వీటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ అకౌంట్లను నిర్వహించడానికి డిజిటల్‌ కమ్యూనికేషన్ ఆఫీసర్‌ కావాలంటూ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఈ ఉద్యోగానికి జీతం ఎంతో తెలుసా? ఏడాదికి 30 వేల పౌండ్లు. అంటే భారత కరెన్సీతో సరిచూస్తే ఏడాదికి 25 లక్షల పైమాటే అన్నమాట!

ఫేస్‌బుక్‌ వాల్‌పైన, ట్వీటర్, యూట్యూబ్‌ల్లో క్వీన్  ఎలిజబెత్‌కు సంబంధించిన విషయాలు వెల్లడించడానికి గానూ ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే డిగ్రీ ఉండాలని, వెబ్‌సైట్‌ నిర్వహణలో అనుభవం తప్పనిసరంటూ ప్రకటనలో పేర్కొంది. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో నైపుణ్యం ఉండాలని కూడా తెలిపింది. ట్వీటర్‌లో ఎలిజబెత్‌కు 27.7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement