coronation
-
ప్రారంభోత్సవమా? పట్టాభిషేకమా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేక కార్యక్రమంలా నిర్వహించారని ఆక్షేపించారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. ప్రజస్వామ్యం మనగలిగేది భవనాల్లో కాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రజల గొంతుకల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, ఆడశిశువుల సంరక్షణపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనం బయటపడిందన్నారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా రెజ్లర్లపై దాడి చేయడం దారుణమని విమర్శించారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దూరంగా ఉంచారని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దూరం పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ఎన్నికల రాజకీయాల కోసం దళితులను, గిరిజనులను పావులుగా వాడుకోవడం ప్రధాని మోదీకి అలవాటేనని దుయ్యబట్టారు. చరిత్రాత్మక సందర్భానికి రాష్ట్రపతిని దూరం పెట్టడం ఏమిటని నిలదీశారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ సింగ్ స్పందించారు. నరేంద్ర మోదీకి దేశ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే మోదీపై అసూయ పెంచుకున్నారని విమర్శించారు. భారీ ప్రచార కార్యక్రమం.. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన తీరుపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమం చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవంలా ఉందని వ్యాఖ్యానించాయి. దేశ ప్రజలను భాగస్వాములుగా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘న్యూ ఇండియా’అనే ప్రకటనతో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రతిపక్ష పార్టీలు ఎవరూ లేకుండానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన మోదీ ప్రభుత్వం దీనిని భారీ ప్రచార కార్యక్రమంగా మార్చుకుందని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఒక వైపు సెంగోల్‌కు పూజలు చేసిన మోదీ ప్రభుత్వం మరోవైపు రెజ్లర్లపై లాఠీలను ఝళిపించిందని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ ఆరోపించారు. మున్ముందు నిరంకుశ ఫాసిస్ట్ విధానాలు సాగుతాయనేందుకు ఈ ఘటనలే నిదర్శనమన్నారు. చక్రవర్తి పట్టాభిషేకం మాదిరిగా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం జరుగుతుండగానే మహిళా రెజ్లర్లు, మహిళా పంచాయత్‌కు వచ్చిన మహిళలపై పోలీసు జులుం సాగింది. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిపై నిరంకుశ దాడి’అని సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పేర్కొన్నారు. मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं। मैं हर कीमत चुकाने को तैयार हूं। — Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023 తిరోగమనానికి నిదర్శనం: పవార్ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వివిధ మతసంబంధ పూజలు చేయడంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం వెనక్కి వెళుతోందనటానికి ఇవే నిదర్శమన్నారు. ‘మన సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలని భారత ప్రథమ ప్రధాని నెహ్రూ ఆకాంక్షించారు. కొత్త పార్లమెంట్ భవన సముదాయం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మతాచారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి’అని పవార్ పుణేలో మీడియాతో పేర్కొన్నారు. మన దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తున్నట్లు భయం కలుగుతోందన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతోనే ప్రారంభమవుతున్నప్పుడు వారిని ఆహ్వానించకపోవడమేంటన్నారు. ‘పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి నాకు ఆహ్వానం పంపిందీ లేనిదీ తెలియదు. ఒక వేళ ఢిల్లీలోని నా కార్యాలయానికి ఆహ్వానం వచ్చి ఉంటుందేమో తెలియదు’అని వ్యాఖ్యానించారు. శవపేటికలా పార్లమెంట్ భవనం: ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్ బిహార్‌లోని అధికార పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ )పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోల్చింది. పార్లమెంట్ కొత్త భవనం శవపేటిక మాదిరిగా త్రిభుజాకారంలో ఉందంటూ బిహార్ అధికార ఆర్జేడీ ఆదివారం ట్వీట్ చేసింది. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆర్జేడీని శవపేటికలోనే సమాధి చేస్తారంటూ వ్యాఖ్యానించింది. ‘ఆర్జేడీ అథమ స్థితికి దిగజారింది. త్రికోణానికి భారతీయ వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. శవపేటిక షట్కోణంగా గానీ బహుభుజిగా కానీ ఉంటుందని తెలుసుకోవాలి’అని పేర్కొంది. అయితే, ఆర్జేడీ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని గానీ, రాజ్యసభాధ్యక్షుడైన ఉపరాష్ట్రపతిని గానీ పిలవలేదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగవు’అంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఇదీ చదవండి:త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయి: ప్రధాని మోదీ -
రాజు చుట్టూ ని‘బంధనాలు’.. ప్రతి రోజూ రాజభోగాలే అనుకుంటే పొరపాటే!
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక దేశానికి రాజుగా కిరీటధారణ జరిగితే ఇక ప్రతి రోజూ రాజభోగాలు అనుభవించడమే అనుకుంటే పొరపాటే. విందు వినోదాలు, చుట్టూ వందిమాగధులు, ఏ చిన్న పనికైనా జీ హుజూర్ అనే సేవకులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరిన్ని ఆంక్షల చట్రంలో బతకాల్సి ఉంటుంది. రాజు ప్రాణం ప్రజలకు ఎంతో విలువైనది. అందుకే భద్రతా కారణాలు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలతో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పా టించాలి. ఒక రకంగా బంగారు పంజరంలో బంధించినట్టుగా స్వేచ్ఛను కోల్పోవలసి ఉంటుంది. 70 ఏళ్ల క్రితం రాణి ఎలిజæబెత్ నాటి నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కింగ్ చార్లెస్ అవి ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించి తీరవలసిందే. కానుకల స్వీకరణ తప్పనిసరి బ్రిటన్ రాజ సంప్రదాయం ప్రకారం వారికొచ్చే కానుకల్ని తప్పనిసరిగా స్వీకరించాలి. దేశంలో వివిధ ప్రాంతాలు సందర్శించినప్పుడు ఇతర దేశాల పర్యటనలకి వెళ్లినప్పుడు రాజుపై గౌరవంతో చాలా మంది రకరకాల కానుకలు ఇస్తారు. వాటిని రాజు తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ ఆ కానుకలు ఏదైనా ప్రత్యుపకారం పొందడం కోసం ఇస్తూ ఉంటే మాత్రం రాజకుటుంబం వారు కానుకల్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. విలియంతో ప్రయాణించలేరు బ్రిటన్ రాజుతో పాటు వారసుడు కూడా ము ఖ్యమే. కింగ్ చార్లెస్ తర్వాత సింçహాసనం అధిష్టించే వారసత్వపు హక్కు కలిగిన ప్రిన్స్ విలి యమ్‌తో కలిసి ఆయన ఎక్కడికీ ప్రయాణించకూడదు. ఇద్దరూ వేర్వేరు విమానాలు, వాహనాల్లోనే వెళ్లాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉండకూడదన్న భావనతో ఈ నిబంధన తీసుకువచ్చారు. వస్త్రధారణ రాజు ధరించే వస్త్రధారణకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దౌత్యపరంగా అనుకూలంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. రాజు ఏ దేశానికి వెళితే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులే ధరిస్తారు. ఇక రాజు తనతో పాటు ఎప్పుడూ నలుపు రంగు వస్త్రాలు తీసుకువెళతారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో అంత్యక్రియలకి హాజరుకావాల్సి వస్తే అప్పుడు వేసుకోవడం కోసం నల్ల బట్టలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. షెల్ ఫిష్ తినలేరు రాజుతో సహా బ్రిటన్ రాచకుటుంబీలు అందరూ షెల్ఫిష్కు దూరంగా ఉండాలి. ఫుడ్ పాయిజనింగ్‌కి అవకాశం ఉన్న తినకూడదన్న నిబంధనలైతే ఉన్నాయి. ఇక రాజు భద్రతే అత్యంత కీలకం కాబట్టి అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఓటుకి దూరం బ్రిటన్ రాజు ఎప్పుడూ రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబించాలి. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకూడదు. అయితే పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉన్నప్పటికీ రాచ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఓటింగ్‌కి కూడా దూరంగా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు ఎన్ని రకాల ఆంక్షలున్నా బ్రిటన్ రాజు ఒక్కరికే ఉన్న సదుపాయం ఒకటుంది. అదే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం. కారు డ్రైవ్ చేయాలని అనుకుంటే ఆయనకు లైసెన్స్ అక్కర్లేదు. పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించవచ్చు. సెల్ఫీలు ఆటోగ్రాఫ్‌లు ఉండవు ప్రజలెవరైనా రాజుతో కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చట పడితే అది కుదిరేపని కాదు. ఎవరికీ ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అలా ఇస్తే రాజు సంతకం ఫోర్జరీ చేస్తారన్న భయం ఉంది. సెల్ఫీలు దిగకూడదు. రాజు కుటుంబ సభ్యులందరికీ ఇదే వర్తిస్తుంది. అయితే ప్రోటోకాల్స్‌లో ఈ నిబంధనని అధికారికంగా ఇంకా చేర్చలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్ 3 వెస్ట్మిన్స్టర్ అబ్బే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. సమీపంలో ఓ మెటల్ బారీకేడ్ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డస్టేట్ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e — Spriter (@Spriter99880) May 6, 2023 (చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి) -
King Charles III: కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం.. కిరీటధారిగా బ్రిటన్ రాజు (ఫొటోలు)
-
రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే, చార్లెస్–3 పట్టాభిషేకం సందర్బంగా అందరి ఫోకస్ రాజకుటుంబం మీదే ఉంది. ఈ నేపథ్యంలో, రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ ఈ కార్యక్రమానికి వస్తారా..? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది. ‘రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ హాజరవుతారు.. కానీ, ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్‌తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది’. ఇదిలా ఉండగా.. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్కీ, లిలిబెట్. అయితే, రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి. ఇక, రాజకుటుంబంతో విభేధాల కారణంగా చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజరికాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ బ్రిటన్ రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. మరోవైపు.. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. Prince Harry will be attending the #coronation today, but Meghan Markle has remained in California with their children.https://t.co/LfDJkI6e7i pic.twitter.com/PQYLkr68tI — Newsweek (@Newsweek) May 6, 2023 ఇది కూడా చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం -
పట్టాభిషేకం వేడుకకు గుర్తుగా..రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో శనివారం కింగ్ చార్లెస్ 3కి పట్టాభిషేకం అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్ రాజు దాదాపు రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ బహుమతులను పట్టాభిషేక పతకాల రూపంలో అందించనున్నారు. వీటిని యూకే ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ పట్టాభిషేకంలో సహకరించి, విజయవంతంగా పూర్తి అయ్యేలా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నట్లు బ్రిటన్ పేర్కొంది. తమ దేశంలో అత్యవసర సమయంలో సేవలందించే.. ఆర్మీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి అందజేయనున్నట్లు భారత మూలాలు ఉన్న యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ అన్నారు. తమ కొత్త రాజు పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా..తమ దేశంలోని అత్యవసర సేవలందించే సిబ్బంది పాత్రను గుర్తించడమే గాక ఆ వేడుకకు గుర్తుగా ఈ కృతజ్ఞతా పతకాలను అందజేస్తున్నట్లు బ్రేవర్మాన్ అన్నారు. ఈ మేరకు బ్రేవర్మాన్ మాట్లాడుతూ..సాయుధ దళాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, నిస్వార్థ సేవ లేకుండా ఈ పట్టాభిషేకం విజయవంతం కాదని అన్నారు. ఈ పతకం వారి సేవకు, కృషికి గుర్తింపుగా దేశం తరుఫున కృతజ్ఞతా బహుమతి అని అన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి అందజేస్తారని చెప్పారు. ఈ పతకం ముందు భాగంలో రాజు, రాణి డబుల్ పోర్ట్రెయిట్ ఉంటుంది. దీన్ని మార్టిన్ జెన్నింగ్స్ రూపొందించారు. ఈ పతకాలను బర్మింగ్‌హామ్‌లోని వోర్సెస్టర్షైర్ మెడల్ సర్వీస్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ పతకం మా సాయుధ దళాలు, చక్రవర్తి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి అద్దంపడుతుందన్నారు బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్. పట్టాభిషేకమహోత్సవ పతకాల సంప్రదాయం 1603 లో కింగ్జేమ్స్ హయాం నాటిదని చెప్పారు. ఈ వేడుకలో మొత్తం 4 లక్షల మందికి ఈ పట్టాభిషేక పతకాలు అందుకుంటారని బెన్ వాలెస్ చెప్పారు. ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల నుంచి అతిరథమహారథులకే గాక నిస్వార్థపూరితంగా పనిచేసి ఆయా విభాగాల్లో పేరుగాంచిన ప్రముఖులకు సైతం బ్రిటన్ ఆహ్వానం పలికింది. (చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ) -
కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు!
సాక్షి, ముంబై: ముంబైలోని డబ్బావాలాల సేవలు గురించి అందరికీ తెలిసిందే. వారు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, స్కూల్‌కి వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్‌లు అందిస్తుంటారు. వారికి బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం అందడం విశేషం. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా. దీన్ని పూణేలో గౌరవ చిహ్నంగానూ, గర్వంగానూ భావిస్తారు. అంతేగాదు ఇక్కడి తలపాగాకి భౌగిళిక హోదా లభించింది కూడా. ఇక్కడి ముంబై డబ్బావాలాలకు బ్రిటీష్ ఎంబసీ ద్వారా ఆహ్వానాలు అందినట్లు మీడియాకి తెలిపారు. ఈ మేరకు ముంబై డబ్బావాలాస్ ప్రతినిధి విష్ణు కల్డోక్ మాట్లాడుతూ.. తమలోని ఇద్దరు డబ్బావాలాలకు ఆహ్వానం అందిందన్నారు. అదీగాక బ్రిటీష్ రాయల్టీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అతను రాజు కాబోతున్నాడు కాబట్టి కింగ్ చార్లెస్‌కి పుణేరి పగడి తోపాటు వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం అని డబ్బావాలా ప్రతినిధి విష్ణు కల్డోక్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కాగా, ఈ ముంబైలోని డబ్బావాలాలు నగరంలో లంచ్‌బాక్స్ డెలివరీ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. #WATCH | Maharashtra: Mumbai's Dabbawalas purchase gifts - Puneri Pagadi & a shawl of the Warkari community - for Britain's King Charles III, ahead of his coronation ceremony on May 6. They say that they have been sent invitations by British Consulate, British Embassy. pic.twitter.com/88RlOhxidQ — ANI (@ANI) May 2, 2023 (చదవండి: శరద్ పవార్ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో) -
Prince Harry: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోని విభేధాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మే 6వ తేదీన జరగబోయే కింగ్ ఛార్లెస్ Charles III పట్టాభిషేకం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. ప్రిన్స్ హ్యారీ రాక గురించి ఆసక్తి నెలకొంది. అయితే అయిష్టంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. తండ్రి ఛార్లెస్ పిలుపు మేరకు ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకానికి హాజరు అవుతారని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారని రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా దగ్గర బట్లర్‌గా పని చేసిన పాల్ బరెల్.. ప్రస్తుతం రాజకుటుంబంలోని వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. ఛార్లెస్, విలియమ్-హ్యారీల మధ్య సయోధ్య ఇప్పట్లో జరగకపోవచ్చు. పట్టాభిషేక కార్యక్రమంలో వాళ్ల మధ్య కనీసం మాటలు కూడా ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రిపై గౌరవంతో.. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ హోదాలో కేవలం ముఖం చూపించేందుకు మాత్రమే హ్యారీ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అంతేగానీ ఆ కుటుంబంలో మళ్లీ కలిసిపోవడానికి ఎంత మాత్రం కాదు అని పేర్కొన్నారు పాల్. ఇక మూడు రోజులు పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవంలో కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమం నాడు మాత్రమే ప్రిన్స్ హ్యారీ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు 24 గంటలు గడవక ముందే ఆయన యూకేను విడిచి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టాభిషేక సమయంలో ముందు వరుసలో కాకుండా.. దూరంగా ఎక్కడో పదో వరుసలో ఆయన కూర్చుంటారని సమాచారం. అయితే ఆయన భార్య మేఘన్ మార్కే హాజరుపై మాత్రం స్పష్టత లేదు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం అనంతరం రాజుగా పగ్గాలు చేపట్టిన ఛార్లెస్-3.. ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత పట్టాభిషేకం జరుపుకోబోతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆయన 40వ చక్రవర్తి. ఆయన రెండో భార్య క్యామిల్లా యూకే రాణిగా బాధ్యతలు చేపట్టనుంది. అయితే.. పూర్తిస్థాయి మహారాణి హోదా కాదు. ఆ తరహా హోదాతో కూడిన క్వీన్ కాన్సోర్ట్ మాత్రమే. అంటే నామమాత్రపు మహారాణిగా బకింగ్హమ్ ప్యాలెస్‌లో ఆమె నివసించనున్నారు. రాజకుటుంబంలో ఏం జరిగింది? భార్యలు రాజేసిన చిచ్చు భగ్గున మండి.. -
‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా?
లండన్: బ్రిటన్ మహారాణి ధరించే కిరీటంపై ఉండే 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే క్వీన్ కెమెల్లా పార్కర్ బౌల్స్, కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన కాలం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసినట్లవుతుందని బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023, మే 6న జరగనున్న పట్టాభిషేకంలో క్వీన్ కామెల్లా.. కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించాలా వద్దా అనే అంశంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు పునఃసమీక్షిస్తున్నట్లు వార్తా సంస్థ టెలిగ్రాఫ్ పేర్కొంది. అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారత్‌కు చెందిందని, దానిని వినియోగించటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘పట్టాభిషేకంలో రాణి కెమెల్లా కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గత పాలన జ్ఞాపకాలను భారతీయులు ఇప్పుడిప్పుడే చెరిపివేస్తున్నారు. ఐదు శతాబ్దాలకుపైగా 5-6 తరాల భారతీయులు విదేశీ పాలనలో మగ్గిపోయారు. ఇటీవలి సందర్భాలైన క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, క్వీన్ కెమెల్లా పట్టాభిషేకంలో కోహినూర్ పై చర్చ జరిగి బ్రిటీష్ పాలనలోకి భారతీయులను తీసుకెళ్లింది.’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాణి కిరీటం నుంచి కోహినూర్ వజ్రాన్ని తొలగించి దాని స్థానంలో మరో వజ్రాన్ని ఏర్పాటు చేసి ఉపయోగించాలని భావిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయుల వీసా అంశంపై యూకే హోంశాఖ మంత్రి బ్రేవర్‌మ్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఐ)పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి: రాజుగా చార్లెస్ ప్రమాణం -
రాజుగా ఛార్లెస్-3.. పట్టాభిషేకానికి ఆలస్యం ఎందుకంటే..
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ప్రకటన కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రసారం చేసింది కౌన్సిల్. సాధారణంగా.. సింహాసనంపై ఉన్నవాళ్లు మరణిస్తే.. వారసులే ఆటోమేటిక్‌గా తదుపరి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతర్గతంగా ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ, బ్రిటన్ రాజరికంలో తొలిసారి ఇలా టీవీ టెలికాస్టింగ్ ద్వారా ప్రకటించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నాం సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 73 ఏళ్ల ఛార్లెస్ అధికారికంగా బాధ్యతలు చేపడుతూ.. ‘అనితరమైన సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యతలు తనకు తెలుస’ని ప్రమాణం చేశారు. ► వందల కొద్దీ ప్రైవేట్ కౌన్సిలర్లు.. అందులో బ్రిటన్ తాజా ప్రధాని లిజ్ ట్రస్, క్వీన్ ఎలిజబెత్-2 వారసులు, ఛార్లెస్ భార్య క్యామిల్లా, పెద్ద కొడుకు..తదుపరి వారసుడు విలియమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఛార్లెస్ లేని ప్రత్యేక ఛాంబర్లో ఆయన్ని అధికారికంగా రాజుగా ప్రకటించింది యాక్సెషన్ కౌన్సిల్. ► అనంతరం.. ఆయన సమక్షంలోనే మరోసారి ‘ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్’ ఇకపై యూకేకు సార్వభౌమాధికారి.. రాజు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ప్రమాణం చేసి.. రాజపత్రాలపై సంతకం చేశారు. ఇక లోపలి కార్యక్రమం పూర్తికాగానే.. మధ్యాహ్నం 3గం.30ని. ప్రాంతంలో ట్రంపెట్ ఊది ఛార్లెస్-3ను అధికారికంగా బాహ్యప్రపంచానికి రాజుగా ప్రకటించింది మండలి. అయితే.. ► బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3ని ప్రకటించినప్పటికీ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదే మహారాజుగా ఆయనకు జరగాల్సిన పట్టాభిషేకం. తల్లి మరణించిన వెంటనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ఛార్లెస్.. రాజు హోదా దక్కించుకున్నారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో సంతాప సమయం ముగిశాకే.. ఆయనకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ► బ్రిటన్ రాజరికాన్ని గమనిస్తే ఇంతకు ముందు.. 1952 ఫిబ్రవరి 6వ తేదీన జార్జ్-6 మరణించారు. ఆ సమయంలో వారసురాలు ప్రిన్స్ ఎలిజబెత్-2 రాణిగా ప్రకటించబడ్డారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం మాత్రం 1953, జూన్ 2న జరిగింది. అయితే ఆమె భర్త ఫిలిప్.. ఆ తర్వాతి కాలంలోనూ ప్రిన్స్‌గానే కొనసాగారు. ► ఇవాళ జరిగిన.. ప్రవేశ వేడుక(ceremony of Accession), తర్వాత జరగబోయే పట్టాభిషేక వేడుక(ceremony of Coronation) మధ్య తేడా ఏంటంటే.. ప్రవేశ వేడుకలో కేవలం అధికారిక ప్రకటన, ప్రమాణం ఉంటుంది. కానీ, పట్టాభిషేకం అనేది కాంటర్బరీ ఆర్చ్‌బిషప్ నిర్వహించిన మతపరమైన వేడుక. లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో గత 900 సంవత్సరాలుగా పట్టాభిషేక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ► సింహాసనంపై ఉన్నవాళ్లు మరణించాక.. తదనంతర రాజు/రాణికు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించేందుకే అంత గ్యాప్ తీసుకుంటారు. ► పట్టాభిషేక సమయంలో సదరు వ్యక్తి రాజు/రాణి.. చట్టం ప్రకారం పాలించడం, దయతో న్యాయం చేయడం, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం లాంటి ప్రమాణాలు చేస్తారు. ► అనంతరం ఆర్చ్‌బిషప్ సమక్షంలో.. కింగ్ ఎడ్వర్డ్ సింహానం మీద అధిరోహిస్తారు. ఆపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజు/రాణి తలపై ఉంచుతారు ఆర్చిబిషప్. భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో క్వీన్ ఎలిజబెత్-2 ► 1626 నుంచి బ్రిటన్ సింహాసనం విషయంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. ► బ్రిటన్ పట్టాభిషేక కార్యక్రమానికి.. రాజరిక వంశస్థులతో పాటు చట్ట సభ్యులు, చర్చ్ సభ్యులు, కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు.. ప్రతినిధులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులూ హాజరవుతారు. -
మహోజ్వల భారతి: ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం
జూన్ 6, 1674 న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీ తనను తను ‘ఛత్రపతి’గా ప్రకటించుకున్నారు. ఛత్రపతి అయ్యాక 50 వేల బలగాలతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న రాయఘడ్ కోటలో మరణించారు. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే 1927 ఫిబ్రవరి 19న జన్మించారు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని డీకొన్నారు. శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవారు. అయితే నిజాంషాహీ ప్రభువు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి హత్య చేయించడంతో అది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికారు. శివాజీ లౌకిక పాలకుడు. అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను సమానంగా చూసుకునేవారు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవానికి నోచుకున్నారు. భారత స్వాతంత్య్రోద్యమానికి, శివాజీ జీవించిన కాలానికి సంబంధం లేకున్నా.. ఆయన వ్యక్తిత్వం ఆ తర్వాతి కాలాలకు ఒక స్ఫూర్తిగా ఉంటూ వచ్చింది. -
రామయ్య సన్నిధికి తమిళిసై: వెంట ఎవరూ లేకున్నా..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రామయ్య పట్టాభిషేకంలో పాల్గొనడంతోపాటు దమ్మపేట, మణుగూరు మండలాల పర్యటన నిమిత్తం ప్రత్యేక రైల్లో సోమవారం తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులెవరూ స్వాగతం పలకలేదు. భద్రాచలంలోని శ్రీరాముడి పట్టాభిషేక వేడుకలో, తర్వాత స్థానిక కార్యక్రమాల్లో ఏ అధికారీ వెంట లేకుండానే గవర్నర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు, ఎస్పీ సునీల్‌దత్ గవర్నర్ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ముగ్గురు ఉన్నతాధికారులూ రెండ్రోజుల వ్యక్తిగత సెలవు పెట్టినట్లు సమాచారం. అంతా రాముడే చూసుకుంటాడు: గవర్నర్ రాముడి పట్టాభిషేకానికి హాజరు కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రామయ్యను ప్రార్థించానన్నారు. తన పర్యటనకు జిల్లా యంత్రాంగం గైర్హాజరుపై విలేకరులు ప్రశ్నించగా ‘ఇది ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే. రాముడి పట్టాభిషేకానికి వచ్చాను. అంతా రాముడే చూసుకుంటాడు’ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
‘నవమి’ ముహూర్తం ఖరారు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 10న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం (శ్రీరామనవమి) నిర్వహించనున్నారు. ఈ మేరకు వైదిక కమిటీ రూపొందించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ ఈఓ బి.శివాజీ సోమవారం విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభమవుతాయని, 6న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, ఉత్సవ అంకురార్పణ, 7న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 8న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, చతుఃస్థానార్చన, భేరీ పూజ, దేవతాహ్వానం, బలిహరణం, హనుమద్వాహన సేవ, 9న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో వివరించారు. 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, శ్రీరామ పునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహన సేవ, 11న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు. 12 నుంచి 16 వరకు వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కాగా, కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో భక్తులకు ఈ ఏడాది మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయంలో ఆలయ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
రామరాజ్యానికి అర్థం అదే!
ఆశ్రమంలో వశిష్ఠుడు, అరుంధతి శ్రీరామకల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పదిరోజులు ముందుగానే చలువ పందిళ్లు వేయించారు. కల్యాణానికి వచ్చేవారందరూ కమనీయంగా ఆ వేడుక చూడటం కోసం ఈత ఆకులు, తాటి ఆకుల చాపలు సిద్ధం చేశాడు. పానకం, వడపప్పుకు కావలసిన సంభారాలన్నీ దండిగా ఇచ్చింది కామధేనువు. అన్నీ సిద్ధమయ్యాయి. అరుంధతి వశిష్ఠులవారిని సమీపించి–‘‘స్వామీ! తెల్లవారితే శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుందనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ఆయన అడవుల పాలయ్యాడు కదా. ఆయన ఎంత స్థితప్రజ్ఞుడో కదా! నాకొక సందేహం స్వామీ! ఇన్ని వేల సంవత్సరాలుగా సీతారాముల కల్యాణం ఎందుకు జరిపిస్తున్నారు. రామావతారానికి ముందు, తరువాత కూడా అవతారాలున్నాయి కదా! ఈ రాముడికే ఎందుకు ఇంత వైభోగం. మీరు ఆయన కులపురోహితులు, రాముల వారిని దగ్గర నుంచి చూశారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సుగుణాలు మీకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియవు! ఏ కారణంగా ఆయనకు నేటికీ కల్యాణం జరుపుతున్నారు. రామరాజ్యం అనే పేరే ఎందుకు స్థిరపడిపోయింది. రామరాజ్యాన్ని అధిగమించే రాజ్యమే రాలేదా!’’ అని ప్రశ్నించింది అరుంధతి. వశిష్ఠుడు గంభీరంగా నవ్వుతూ, ‘‘అరుంధతీ! నా రాముడని నేను గొప్పలు చెప్పడం కాదు కానీ, దశరథ మహారాజుని మించినవాడు నా రాముడు. దశరథుడి పాలన కూడా అద్భుతంగానే సాగింది. కాని ఆయన ముగ్గురిని వివాహం చేసుకున్న కారణంగా, కన్నకొడుకుని అడవుల పాలు చేయవలసి వచ్చింది. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు కదా! ఆ విషయం పక్కన పెడితే –రామపట్టాభిషేకానికి ముందురోజు దశరథుడు రాముడిని పిలిచి, ‘నాయనా! ఈ కోసల రాజ్య ప్రముఖులందరూ రేపు ఉదయం నిన్ను పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. కనక పట్టాభిషిక్తుడు కావలసిన రాజనందనుడు ఏ నియమవ్రతాలు అనుసరించాలో గురువులు చెబుతారు. ఆ ప్రకారం ఈ రాత్రి గడుపు. ఉదయమే మంగళ స్నానానంతరం పట్టాభిషేకం చేస్తారు’ అని నా దగ్గరకు పంపాడు. నేను నా రామునికి ధర్మశాస్త్రం వివరించి, సింహాసనం అధివసించేవాడు, రాత్రి ఉపవసించి, కటిక నేల మీద దర్భాసనం పరిచి పడుకోవాలి. తెల్లవారేవరకూ మౌనంగా ఉండాలి. రాజభోగాలు అనుభవించడానికి అన్ని అధికారాలూ లభించే క్షణంలో తిండి లేకుండా, రాతి నేల మీద పడుకుని, స్నేహితులతో, భార్యతో ముచ్చటలాడుకునే అవకాశం లేకుండా రాత్రి గడపాలి’ అని వివరించాను.‘‘దేని కోసం ఈ నియమం?’’ అని అమాయకంగా ప్రశ్నించింది అరుంధతి.రాజు కాబోయేవానికి తన ప్రజల ఆకలి బాధ తెలియాలి. దారిపక్కన చెట్టు నీడన కాపురం చేస్తూ బండ రాళ్ల మధ్య నిద్రించేవారి బాధ వంటబట్టాలి. రాజ్యం చేతికందనున్న సమయంలో ఆవేశం పెరిగి ‘అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అని వాగ్దానాలు చేయకూడదు, చెయ్యవలసిన లోక క్షేమంకర పథకాలను ఆలోచించుకుని, ఆచరణలో వచ్చే కష్టసుఖాలు తెలుసుకోవాలి. అప్పుడు సింహాసనం ఎక్కినవాడు ప్రజల జీవితావసర కార్యాలు నిరాఘాటంగా నిర్వహించగలుగుతాడు, వారి బాధలను గ్రహించి పరిష్కారం చేయగలిగి, అందరి అభిమానాన్నీ పొందగలుగుతాడు’ అని వివరించాను అన్నాడు.‘‘మరి రాముడు మీ ఆదేశాలను ఆచరించాడా మహర్షీ!’’ అంది అరుంధతి.‘‘నా ఆదేశాలను పాటించి, రామభద్రుడు ఉపవాస నియమంతో, అధశ్శయనంతో, మౌనంగా ఆ రాత్రి గడిపాడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతీక అయ్యాడు’’ అన్నాడు వశిష్ఠుడు.తండ్రి మాటలకు మారుమాటాడకుండా నా దగ్గరకు రావటమే కాదు, నేను చెప్పిన నియమాలను కూడా త్రికరణశుద్ధిగా అనుసరించాడు. ‘ఇలా ఎందుకు చేయాలి?’ అని ఎదురు ప్రశ్నించని సుగుణాభిరాముడు నా రాముడు.... అని కించిత్ గర్వంగా అన్నాడు వశిష్ఠుడు, తన శిష్యుడి వినయాన్ని మనసులోనే అభినందిస్తూ. ‘‘రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం కదా! ఆయనకు కూడా ఇన్ని నియమాలు విధించారా స్వామీ!’’ అన్నది అరుంధతి.‘‘మానవరూపంలో ప్రభవించాక పరమేశ్వరుడైనా, ఆదిగర్భేశ్వరి అయినా మానవ ధర్మాన్ని ఆచరించి ఆదర్శం చూపాలి’’ అన్నాడు కులగురువులు వశిష్ఠులు.‘‘ప్రజల కష్టం తెలుసుకోలేని వాడికి రాజు కాగల అర్హత లేదు. కష్టాలను స్వయంగా అనుభవించాలి. రాజుకి ఆకలి బాధ తెలియాలి, కటిక నేల మీద నిద్రించేవాడి బాధ తెలియాలి, బంధువులకు పదవులు కట్టబెట్టకూడదని తెలియాలి. అయినవారికి అనుకూలంగా ప్రవర్తించేవాడికి రాజు కాగల అర్హత లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ నా రాముడికి నేను తెలియచెప్పాను. గురువునైన నా ఆజ్ఞను త్రికరణశుద్ధిగా అనుసరించిన నా రాముడు జగదభిరాముడు కాకుండా ఉండగలడా, ఆయన పరిపాలన రామరాజ్యం కాకుండా ఉంటుందా అరుంధతీ!’’ అన్నాడు వశిష్ఠుడు.ఈ దృష్టితో రామాయణం చదివి వివేకంతో వ్యవహరించేవారు అధికారంలో ఉంటే అశేషప్రజల జీవితం ప్రశాంతంగా సాగుతుందని రాముడి నడవడిక ద్వారా తెలియచెప్పాడు ఆదికవి వాల్మీకి. – డా. వైజయంతి పురాణపండ -
రాజాధిరాజుగా రామయ్య..
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఘనంగా పట్టాభిషేకం భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో గురువారం శ్రీసీతారామ చంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించి పోయారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా రామాలయ ప్రాంగణంలోని యాగశాలలో ఉదయం చతుస్థానార్చన హోమం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలం కరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరి ప్రదక్షిణగా మిథిలాస్టేడియానికి తీసుకొచ్చి, కల్యాణ మండపంపై వేంచేయింపజేశారు. ముందుగా స్వామివారికి ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలగిపోయేలా విష్వక్సేన పూజ చేసి, ఆ తర్వాత పట్టాభిషేకం తంతు ప్రారం భించారు. అనంతరం పూజా ద్రవ్యాల కు పుణ్యాహవచనం చేశారు. కలశాలలో ఉన్న చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థ జలాల కు ప్రోక్షణ చేసి, ఆ తీర్థాన్ని అష్టదిక్కులలో, భక్తులపై చల్లి సంప్రోక్షణ జరిపారు. రామ దాసు కాలం నాటి ఆభరణాలైన బంగారు పాదుకలు, రాజదండం, రాజము ద్రిక, క్షత్రం సమర్పించి కిరీట«ధారణ చేశారు. తర్వాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు. ఈ వేడుక విశిష్టతను వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు భక్తులకు వివరిం చారు. శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఎండలతో భక్తులు లేక వెలవెల.. పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి ఆశిం చిన స్థాయిలో భక్తులు హాజరు కాలేదు. కార్య క్రమాన్ని 2 వేలకు లోపే భక్తులు తిలకించారని అధికారుల అంచనా. ఒకవైపు ఎండలు.. మరోవైపు కల్యాణం మరుసటి రోజున స్వామి వారికి జరిపే పట్టాభిషేకం గురించి ఆలయ అధికారులు సరైన రీతిలో ప్రచారం చేయకపో వడం వల్లే ఇలా జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు లేక మిథిలా స్టేడియంలోని సెక్టార్లన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజ రై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆయన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీతాయారు అమ్మవారు, భద్రమహర్షి ఆలయాలను కూడా దర్శించు కొని పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్రావు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఆలయ ప్రధానార్చ కులు పొడిచేటి జగన్నాథాచార్యులు, వైఎస్సార్ సీపీ కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని సీతా రాం, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. -
పావన వేదం.. శ్రీగురుచరణం
– ఘనంగా ప్రారంభమైన రాఘవేంద్రుల వైభవోత్సవాలు – కనుల పండువగా పాదుక పట్టాభిషేకం – నవరత్న రథంపై బంగారు పాదుకల ఊరేగింపు మంత్రాలయం : వేదభూమి పులకించింది.. భక్తిపారవశ్యంతో పరవశించింది. సద్గురు బంగరు పాదుకల పట్టాభిషేకం కనువిందు చేసింది. భక్తజనం మది ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వైభవోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ముందుగా రాఘవేంద్రుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, తులసీమాల సమర్పణ, పట్టువస్త్ర అలంకరణ గావించి మంగళహారతులు పట్టారు. శ్రీరాఘవేంద్రుల సన్యాసం పుచ్చుకున్న రోజును కావడంతో డోలోత్సవ మండపంలో రాఘవేంద్రుల బంగరు పాదుకలను స్వర్ణపీఠంపై కొలువుంచారు. శాస్త్రోక్తంగా పాదుకలకు ముత్యాలు, వెండి, స్వర్ణ, నవరత్నాలతో అభిషేకాలు చేశారు. పరమ నిష్టతో సాగిన పట్టాభిషేక ఘట్టం భక్తులను మైమరిపించింది. బృందావన ప్రతిమ, పాదుకలు, శ్రీమన్‌న్యాయ సుధా పరిమళగ్రంథ తాళ పత్రాలను నవరత్నరథంపై కొలువుంచారు. పీఠాధిపతులు పాదుకలకు పూజలు, హారతులు పూర్తిచేసి రథోత్సవానికి అంకురార్పణ పలికారు. అశేష భక్తజనం, మంగళవాయిద్యాలు మధ్య శ్రీమఠం మాడవీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. ఉత్సవంలో పండిత కేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, వేద పాఠశాల ఉపకులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారకపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం
-
తవ్వితీసిన శవానికి పట్టాభిషేకం
పీఛేముడ్ పద్నాలుగో శతాబ్దంలో పోర్చుగల్ దేశానికి నాలుగో అఫాన్సో రాజుగా ఉండేవాడు. అఫాన్సో రాజావారికి డాన్ పెడ్రో (ఒకటో పీటర్) అనే పుత్రరత్నం ఉన్నాడు. ప్రకృతి సహజధర్మం ప్రకారం రాజావారి పుత్రరత్నానికి కూడా వయసొచ్చింది. వయసొస్తే ఏ కుర్రాడైనా ఊరుకుంటాడా? రాకుమారుడు పెడ్రో కూడా అంతే! ప్రేమలో పడ్డాడు. అతగాడు ఏ రాచకన్నెనో వలచి ఉంటే ఇంత కథ జరిగేది కాదు గానీ, ఒక నిషిద్ధ వర్గానికి చెందిన ఇనెస్ పిరాస్ డి క్యాస్ట్రో అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. ఆమెనే పెళ్లాడాలనుకున్నా, తండ్రిచాటు బిడ్డ కావడంతో ఆ పని చేయలేకపోయాడు. అఫాన్సో రాజావారికి కొడుకు తీరు ఏమాత్రం నచ్చలేదు. కొడుకు ప్రేమను చంపడం తన వల్లకాదని ఆయనగారికి అర్థమైపోయింది. కొడుకు ప్రేమను చంపడం అసాధ్యమైనా, అతగాడి ప్రియురాలిని అంతం చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని కూడా ఆయనగారి ‘రాచ’తెలివికి తట్టింది. రాజు తలచుకోవాలే గానీ, ఎన్ని మొండేల నుంచి వాటి తలకాయలు వేరుపడవు? మూడో కంటికి తెలియకుండా ఈ పనిని నిర్వర్తించే బాధ్యతను ముగ్గురు నమ్మినబంటులకు అప్పగించారు. వారు అత్యంత రాజభక్తితో, రాకుమారుడి సామాన్య ప్రియురాలిని పరలోకానికి సాగనంపారు. రాకుమారుడు పెడ్రోకు శోకక్రోధాలు ఏకకాలంలో కలిగినా, అప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయత. కాలం గడిచి, అఫాన్సో రాజావారు కాలధర్మం చెందారు. తండ్రి మరణంతో పెడ్రో పట్టాభిషిక్తుడయ్యాడు. గద్దెనెక్కడమే తడవుగా తన ప్రియురాలి హత్యపై దర్యాప్తుకు హుకుం జారీ చేశాడు. ముగ్గురు హంతకుల్లో ఒకడు తప్పించుకుపోయినా, మిగిలిన ఇద్దరూ రాచభటుల చేతికి చిక్కారు. వాళ్లిద్దరికీ గుండెలు పెకలింపజేసి మరణశిక్ష విధించాడు. తర్వాత తన ప్రియురాలి సమాధిని తవ్వించి, ఆమె శవాన్ని బయటకు తీయించాడు. రాజ లాంఛనాలతో ఆ శవానికే రాణిగా పట్టాభిషేకం జరిపించి, సభాసదుల చేత గౌరవవందనం చేయించాడు. -
మైసూరు మహారాజుగా యదువీర్‌కు పట్టాభిషేకం
మైసూరు(కర్ణాటక): ఘనమైన చరిత్ర కలిగిన మైసూరు రాజకుటుంబం వారసునిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. రాజ సంప్రదాయాన్ని అనుసరించి ఈ పట్టాభిషేకం కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి అంబా ప్యాలెస్‌లోని కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. 23 ఏళ్ల యదువీర్, రజతసింహాసనం ‘భద్రాసనా’న్ని అధిరోహించారు. వడయార్ రాజకుటుంబంలో 27వ రాజు అయిన యదువీర్ దసరా ఉత్సవాల సందర్భంగా ‘ఖాసా(ప్రైవేటు) దర్బారు’ను నిర్వహిస్తారు. అప్పుడాయన స్వర్ణ సింహాసనాన్ని అధిరోహిస్తారు. మహారాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013లో మరణించడం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి ప్రమోదాదేవి వడయార్.. యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్‌ను దత్తత తీసుకున్నారు. యదువీర్ అమెరికాలో డిగ్రీ విద్య(బీఏ)ను పూర్తి చేశారు. పట్టాభిషేకం అనంతరం యదువీర్ మాట్లాడుతూ.. రాజకుటుంబ సంప్రదాయాలను తు.చ. తప్పక కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక రాష్ట్ర మంత్రులు కె.జె.జార్జి, ఆర్.వి.దేశ్‌పాండే, డి.కె.శివకుమార్, శ్రీనివాస ప్రసాద్, రోహన్ బేగ్, లోకాయుక్త వై.భాస్కరరావు ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి యదువీర్ కాబోయే సతీమణి త్రిషికా కుమారి(రాజస్థాన్‌కు చెందిన ఓ రాజకుటుంబానికి చెందినవారు) హాజరయ్యారు. వీరి వివాహం ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశముంది. ఇదీ చరిత్ర.. వడయార్ రాజకుటుంబం మైసూరు రాజ్యాన్ని 1399 నుంచి 1947 వరకు పాలించింది. చివరి రాజు జయచామరాజేంద్ర వడయార్ 1940 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు పాలించారు. అనంతరం మైసూరు రాజ్యాన్ని భారత్‌లో కలిపేందుకు అంగీకరించారు. అయితే 1950లో భారత్ రిపబ్లిక్‌గా మారేవరకు ఆయన మహారాజుగా కొనసాగారు. ఆ తరువాత మాజీ రాజకుటుంబం వారసునిగా శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ కొనసాగారు. దాదాపు 41 ఏళ్ల క్రితం ఆయన పట్టాభిషేకం జరిగింది. 2013లో ఆయన మరణం నేపథ్యంలో వారసునిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఎంపికయ్యారు. -
భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం
పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు తిలకించి, పులకించిన భక్తజనం భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామివారి పట్టాభిషేక మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను కనులారా వీక్షించిన భక్తజనం తన్మయత్వం చెందారు. తొలుత ఉదయం యాగశాలలో చుతాస్థానార్చన హోమం నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షిణ చేశారు. మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాలు,భక్తుల జయజయధ్వానాలు, మహిళల కోలాటాలతో కల్యాణమండపం వరకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం నుంచి మాడవీధుల మీదుగా ఈ ఊరేగింపు కల్యాణ మండపానికి చే రుకుంది. గవర్నర్ దంపతులు పట్టువస్త్రాలతో పల్లకి ముందు నడిచారు. పట్టాభిషేకం జరిగిందిలా... వేడుకలో భాగంగా స్వామివారికి ముందుగా ఆరాధన జరిపారు. సకల విఘ్నాలు తొలిగేందుకు విష్వక్సేన పూజ నిర్వహించారు. పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యహవచనం గావించారు. ఆ తరువాత కలశాలలో ఉన్న చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థజలాలకు ప్రోక్షణ చేశారు. ప్రాంగణానికి అన్ని దిక్కులు, భక్తులపై పుణ్యజలాలను చిలకరించారు. అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి ఆభరణాలు, బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఛత్రం సమర్పించి కిరీటధారణ గావించారు. ప్రధాన కలశంతో ప్రోక్షణ అనంతరం స్వామివారిని పట్టాభిషిక్తుడను చేశారు. అభిషేకంతో పట్టాభిషేక తంతు ముగిసింది. రామయ్య పాలన ఆదర్శం అనంతరం ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి పట్టాభిషేకాన్ని నిర్వహించే వేదపారాయణులు, అష్టదిక్పాలకులను పరిచయం చేశారు. పట్టాభిషేకంలో వారి పాత్రను వివరించారు. భద్రాచలంలో మహా పట్టాభిషేకం విశిష్టతను ఆలయ వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు వివరించారు. శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని చెప్పారు. పట్టాభిషేకం పూర్తయ్యాక పుణ్యజలాలను భక్తులపై చల్లారు. రెండు రాష్ట్రాలూ సుభిక్షంగా ఉండాలి: గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఆదివారం నిర్వహించిన మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరయ్యూరు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆయన రామాలయూన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, భద్రమహర్షి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. పట్టాభిషేకం పూర్తి అయిన తరువాత కూడా ఆయన సతీసమేతంగా ఆలయానికి వెళ్లి మరోమారు స్వామివారిని దర్శించుకున్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నాను’ అని గవర్నర్ నర్సింహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో దివ్య, ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ఉన్నారు. -
నేడు నయూబ్ ఇమామ్ పట్టాభిషేకం
న్యూఢిల్లీ : దేశంలో ప్రసిద్ధి చెందిన జామా మసీదు నయూబ్ ఇమామ్‌గా షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి కుమారుడికి శనివారం పట్టాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ముస్లిం మతగురువులు, పెద్దలు హాజరుకానున్నారని బుఖారి పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి చట్టబద్ధత లేదని వచ్చిన విమర్శలను ఇక్కడ మీడియా సమావేశంలో బుఖారీ తోసిపుచ్చారు. ‘ పట్టాభిషేకం ఉత్సవాన్ని నిలుపుదల చేస్తూ స్టే విధించాలని వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించడాన్ని బుఖారీ స్వాగతించారు. ‘ నయూబ్ ఇమామ్ పట్టాభిషేకానికి చట్టబద్ధత లేదని, అక్రమమని కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..పట్టాభిషేక ఉత్సవం శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై సుదీర్గంగా ఇరువైన్నర గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. టునీషియా, ఈజిప్టు, మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబీయాల నుంచి ముస్లిం మతగురువులు, నాయకులు, వేల సంఖ్యలో ముస్లింలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వారంతా మత బోధనలు చేస్తారని చెప్పారు. అవివాహితుడైన షాబాన్ బుఖారీ అమ్నీ యూనివర్సిటీలో సామాజికశాస్త్రంలో డిగ్రీ చేస్తున్నాడు. అతడు అతి పిన్న వయస్సులోనే దేశంలోనే అతిపెద్ద మసీదుకు నయూబ్ ఇమామ్ పదవి చేపట్టడానికి మార్గం సుమగమైందని, అనంతరం షాహీ ఇమామ్‌గా మారుతోందని చెప్పారు. 27 ఏళ్లు నయూబ్ ఇమామ్‌గా చేసిన పిదప, 2000 సంవత్సరంలో తాను ‘షాహి ఇమామ్’గా నియమితులైనట్లు బుఖారీ చెప్పారు. ఈ ఉత్సవానికి హాజరుకావాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బుఖారి చేసిన ఆహ్వానానికి అంగీకరించారా లేదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం నిరాకరించారు. అయితే భారత ప్రధాని నరేంధ్ర మోదీని ఈ ఉత్సవానికి ఆహ్వానించని విషయం తెలిసిందే.. కాగా, వాస్తవానికి బుఖారీలు మధ్య ఆసియా నుంచి ఇక్కడకు వచ్చారు. 17వ శతాబ్ధంలో మొగల్పాలనలో..ఎర్రకోట ఎదురుగా నిర్మించిన ఈ మసీదుకు బుఖారీలు ఆపధర్మ వారసులుగా కొనసాగుతున్నారు.