
జూన్ 6, 1674 న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీ తనను తను ‘ఛత్రపతి’గా ప్రకటించుకున్నారు. ఛత్రపతి అయ్యాక 50 వేల బలగాలతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న రాయఘడ్ కోటలో మరణించారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే 1927 ఫిబ్రవరి 19న జన్మించారు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని డీకొన్నారు. శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవారు.
అయితే నిజాంషాహీ ప్రభువు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి హత్య చేయించడంతో అది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికారు. శివాజీ లౌకిక పాలకుడు. అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను సమానంగా చూసుకునేవారు.
ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవానికి నోచుకున్నారు. భారత స్వాతంత్య్రోద్యమానికి, శివాజీ జీవించిన కాలానికి సంబంధం లేకున్నా.. ఆయన వ్యక్తిత్వం ఆ తర్వాతి కాలాలకు ఒక స్ఫూర్తిగా ఉంటూ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment