Viral Video: Truck Loses Control During Petrol Pump Entry - Sakshi
Sakshi News home page

Viral Video: ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్‌ పంపు

Published Tue, Apr 25 2023 9:51 AM | Last Updated on Tue, Apr 25 2023 11:09 AM

Viral Video: Truck Loses Control During Petrol Pump Entry - Sakshi

పెట్రోల్‌ బంక్‌లో ప్రవేశిస్తుండగా ట్రక్‌ అదుపుతప్పడంతో ఘోర ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటనలో పెట్రోల్‌ పంపు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటన ఏప్రిల్‌ 22న ఉదయం 9.3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ట్యాంక్‌ ఫిల్‌ చేసుకునేందుకు మహారాష్ట్రలోని పూణే సతారా హైవే సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు రావడంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. 

సరిగ్గా పెట్రోల్‌ బంక్‌ ఎంట్రెన్స్‌లోకి వస్తుండగా ట్రక్కు అదుపుతప్పడంతో.. బంక్‌ వద్ద ఆగి ఉన్న కారుని ఢీకొట్టి పెంట్రోల్‌ బంక్‌ పంపు వైపుకి దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్ష్యలు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్‌ ఇచ్చేలా..మోదీ రోడ్‌ షో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement