లండన్: బ్రిటన్ కింగ్ చార్లెస్-3కి ఇటీవల క్యాన్సర్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే చార్లెస్-3 ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు ఆకాక్షించారు. కాన్సర్ నిర్ధారణ అయిన తొలిసారి చార్లెస్-3 స్పందించారు.
‘ఇటీవలి కాలంలో నా ఆరోగ్యం బాగుండాలని ఎంతో మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు సందేశాలు పంపారు. వారు పంపిన అన్ని సందేశాలు నాకు చేరాయి. వారందరికీ నా ఆరోగ్యంపై చూపిన ప్రేమకు హృదయాపూర్వకమైన కృతజ్ఞతలు. క్యాన్సర్ బారినపడినవారికి తెలుసు.. అభిమానం, ప్రేమ చూపించేవారి దయతో కూడిన పార్థనలు, ఆలోచనలే తమకు గొప్ప ఓదార్పు, ప్రోత్సాహం’ అని కింగ్ చార్లెస్-3 ఓ ప్రకటనలో తెలిపారు.
‘మెడికల్ ప్రొఫెషనల్స్, క్యానర్స్ చారిటీలు చూపిన అంకితభవం మరువలేనిది. నేను స్వయంగా వారి సేవలు పొందాను. అందుకే వారి మీద ఆరాధనభావం మరింత పెరిగింది’ అని ను రాజు చార్లెస్-3 ప్రశంసించారు.
సోమవారం 75 ఏళ్లు ఉన్న రాజు చార్లెస్‌కు కాన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హం ప్యాలేస్ ఓ ప్రకటన వెల్లడించిన విషయం తెలిసిందే. చార్లెస్-3.. బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం చేసిన 18 నెలలో కాన్సర్ గురికావటం గమనార్హం. ఆయన కాన్సర్ సంబంధించి చికిత్స తీసుకుంటున్నారని స్థానిక మీడియా పేర్కొంటోంది.
చదవండి: కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
Comments
Please login to add a commentAdd a comment