Protester arrested after eggs hurled at King Charles III during ceremony
Sakshi News home page

King Charles III: బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కు చేదు అనుభవం.. ఇలా జరిగిందేంటి?

Published Thu, Nov 10 2022 12:54 PM | Last Updated on Thu, Nov 10 2022 3:29 PM

Protester Arrested After Hurling Eggs At King Charles III - Sakshi

King Charles III..  ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్-2 మరణంలో ఇటీవలే బ్రిటన్‌ నూతన రాజుగా చార్లెస్‌-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారులు చార్లెస్‌-3 పైకి కోడిగుడ్లు విసిరారు. 

వివరాల ప్రకారం.. చార్లెస్‌- 3 ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన భార్య కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడకకు హాజరైన వారిని కలిసి అక్కడ కొందరితో చార్లెస్‌-3 షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో చార్లెస్‌-3కి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అక్కడే జన సమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపైకి కోడి గుడ్లు విసిరాడు. 

దీంతో​, ఒక్కసారిగా చార్లెస్‌ దంపతులు షాకయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు.. చార్లెస్‌-3ని కవర్‌చేశారు. అనంతరం.. నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోడిగుడ్లు చార్లెస్‌ చేతికి తగిలాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం వ్యక్తం చేసే ప్రిన్స్‌ చార్లెస్‌.. ఈ ఘటన సందర్భంగా మాత్రం ప్రశాంతంగా కనిపించడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement